People drinking alcohol in tirumala tirupati video: తిరుమల శ్రీవారిని కలియుగ దైవంగా భావిస్తారు. ప్రతిరోజు కూడా భక్తులు భారీ ఎత్తున తరలివచ్చి స్వామివారిని దర్శనం చేసుకుని మొక్కులు తీర్చుకుంటారు. ఇటీవల తిరుమలలో వరుస అపచారాలు చోటు చేసుకుంటున్నాయి. తిరుమలలో కొంత మంది రీల్స్ తీసుకుంటు స్వామి వారిసన్నిధిలో అపచారం చేస్తున్నారు. మరికొందరు తిరుమలలో రాజకీయాలు మాట్లాడుతున్నారు.
మద్యం, మాంసంలను టీటీడీ విజిలెన్స్ సిబ్బందికి తెలియకుండా కొండపైకి తీసుకొని వెళ్తున్నారు. అంతే కాకుండా.. అన్యమత ప్రచారం కూడా చేస్తున్నారు. గతంలో తిరుమల బంగారు వాకిలి ముందు వరకు కొంత మంది భక్తులు చెప్పులు వేసుకుని రావడం కూడా పెద్ద దుమారంగా మారిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ప్రస్తుతం తిరుమలలో చాలా తక్కువ ఎత్తులో స్వామి వారి ప్రధాన ఆలయంపై నుంచి విమానాలు వెళ్తున్న ఘటనలు ఇటీవల తరచుగా వార్తలలో ఉంటున్నాయి.
తిరుమలలో మరొక అపచారం .. తిరుమలని కూడా వదలని మందు బాబులు !
శ్రీవారి సన్నిధిలో మద్యం తాగుతున్న మందు బాబులు
మందు తాగేసి బాటిల్స్‌ను మెట్లపై విసురుతున్న మందు బాబులు
కూటమి ప్రభుత్వంలో రోజురోజుకు దిగజారుతున్న తిరుమల ప్రతిష్ట pic.twitter.com/BcT7K3Mifu
— Vizag - The City Of Destiny (@Justice_4Vizag) June 8, 2025
ఇది ఆగమశాస్త్రం ప్రకారం అపచారం అని తెలిసిన కూడా ఘటనలు మాత్రం ఆగడంలేదు. టీటీడీ ఎన్ని చర్యలు తీసుకున్న కూడా ఇలాంటి ఘటనలు జరుగుతూనే ఉన్నాయి. ఇటీవల ఒక ముస్లిం వ్యక్తి తిరుమలలో నమాజ్ చేయడం పెద్ద చర్చనీయాంశంగా మారిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో తాజాగా.. కొంత మంది కేటుగాళ్లు తిరుమలలో మద్యం సేవించిన ఘటన పెద్ద దుమారంగా మారింది.
ఒకవైపు భక్తులు గుంపులుగా తిరుమల శ్రీవారి దర్శనానికి వెళ్తున్నారు. మరోవైపు కొంత మంది వ్యక్తులు పిట్టగొడమీద కూర్చుని మద్యంతాగుతున్నారు. అక్కడున్న కొంత మంది వీడియోలు తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో ఇది కాస్త వైరల్గా మారింది.
దీనిపై స్వామి వారి భక్తులు తీవ్ర ఆగ్రహాం వ్యక్తం చేస్తున్నారు. వరుసగా అపచారాలు జరుగుతున్న విజిలెన్స్ సిబ్బంది, పోలీసులు ఏంచేస్తున్నారని భక్తులు మండిపడుతున్నారు.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.









