పవన్ పార్టీ నుంచి పోటీ చేసే తొలి అభ్యర్థి బాలకృష్ణ

జనసేన పార్టీలో చేరిన బాలకృష్ణ

Updated: Sep 11, 2018, 04:42 PM IST
పవన్ పార్టీ నుంచి పోటీ చేసే తొలి అభ్యర్థి బాలకృష్ణ

తెలంగాణలో ముందస్తు ఎన్నికల సెగ.. ఏపీకి తాకుతోంది. ఈ నేపథ్యంలో తమ పార్టీ తరఫు నుంచి ఆంధ్రప్రదేశ్‌ అసెంబ్లీకి పోటీచేసే తొలి అభ్యర్థిని జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్‌ కల్యాణ్‌ మంగళవారం ప్రకటించారు. హైదరాబాద్‌లోని పార్టీ కార్యాలయంలో జరిగిన కార్యక్రమంలో పవన్‌ కల్యాణ్‌ సమక్షంలో పితాని బాలకృష్ణ తదితరులు జనసేనలో చేరారు.  ఈ సందర్భంగా పవన్‌కల్యాణ్‌ మాట్లాడుతూ.. అంబేద్కర్ గొప్పవారని, ఆయన్ను  ప్రేమిస్తానని, ఆయన ఆశయాల సాధనకు తన వంతు కృషి చేస్తానన్నారు. పితాని లాంటి బలమైన నాయకుడు పార్టీకి ఎంతో అవసరమన్నారు.

ఈ సందర్భంగా తూర్పుగోదావరి జిల్లాకు చెందిన పలువురు జనసేన పార్టీలో చేరారు. వచ్చే ఎన్నికల్లో జనసేన నుంచి బి-ఫారం అందుకునే మొదటి వ్యక్తి పితాని బాలకృష్ణ అని పవన్‌ అన్నారు. తూర్పుగోదావరి జిల్లా ముమ్మిడివరం నియోజకవర్గం‌ స్థానాన్ని పితాని బాలకృష్ణకు కేటాయించినట్లు జనసేనాని వెల్లడించారు. ప్రస్తుతానికి సినిమాలకు దూరంగా ఉంటున్న పవన్ కళ్యాణ్.. రాష్ట్రమంతటా పర్యటిస్తూ ప్రజల కష్టాలను తెలుసుకుంటున్నారు.