Varma vs Janasena: పిఠాపురంలో వర్మ వర్సెస్ జనసేన, నియోజకవర్గంపై పట్టుకు వ్యూహం

Varma vs Janasena: ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ నియోజకవర్గం పిఠాపురంలో సెగ మొదలైంది. పవన్‌ను భుజానెత్తుకుని గెలిపించిన వ్యక్తి తెరవెనుక మంత్రాంగం మొదలెట్టేశారు. అసలు పిఠాపురంలో ఏం జరుగుతోంది పూర్తి వివరాలు మీ కోసం.

Written by - Md. Abdul Rehaman | Last Updated : Mar 26, 2025, 11:02 PM IST
Varma vs Janasena: పిఠాపురంలో వర్మ వర్సెస్ జనసేన, నియోజకవర్గంపై పట్టుకు వ్యూహం

Varma vs Janasena: ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ నియోజకవర్గమైన పిఠాపురంలో తెలుగుదేశం నేత, మాజీ ఎమ్మెల్యే వర్మ వ్యూహం మార్చుతున్నారు. తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్సీ పదవి ఇస్తానని చెప్పి ఇవ్వకుండా మోసం చేసిందానికంటే..జనసేన వైఖరే ఆయనను రగిల్చివేస్తోంది. అందుకే ఇక చెక్ పెట్టాలని నిర్ణయించేసుకున్నారు. 

Add Zee News as a Preferred Source

పిఠాపురంలో ఇటీవల జరిగిన జనసేన ఆవిర్భావ సభలో పవన్ కళ్యాణ్ సమక్షంలోనే ఆయన సోదరుడు నాగబాబు చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపిన సంగతి తెలిసిందే. ముఖ్యంగా వర్మలో అసహనం కల్గించింది. పిఠాపురంలో పవన్ కళ్యాణ్‌కు గెలుపుకు తామే కారణమని ఎవరైనా భావిస్తే అది వారి ఖర్మని బహిరంగంగా చెప్పడంతో వర్మకు షాక్ తగిలింది. ఎందుకంటే పిఠాపురంలో పవన్ కళ్యాణ్‌ను భుజానెత్తుకుని గెలిపించే బాధ్యత తీసుకున్నారు వర్మ. అందుకే వర్మ తీవ్ర అసహనంతో, అసంతృప్తితో ఉన్నారు. అందుకే తన బలం, బలగం అయినా ప్రజల్లో ఉండేందుకు నిర్ణయించుకున్నారు. ఎమ్మెల్యే పవన్ కళ్యాణ్‌తో సంబంధం లేకుండా ప్రజల్లో పట్టు సడలకుండా ప్రయత్నాలు ప్రారంభించనున్నారు. వ్యూహాత్మకంగా అడుగులు వేస్తున్నారు. ఇప్పటికే నియోజకవర్గంలోని పలు ప్రాంతాల్లో విస్తృతంగా పర్యటించేందుకు సిద్ధమయ్యారు. కాకినాడ నగర ప్రజలకు కొమరగిరిలో ఇద్దామని అనుకున్న ఇళ్ల పట్టాలను రద్దు చేస్తామంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. తన నియోజకవర్గంలో ఇతరులకు పట్టాలివ్వడాన్ని అంగీకరించేది లేదన్నారు. 

నియోజకవర్గంలో విస్తృతంగా పర్యటించడం ద్వారా పట్టు పెంచుకునే ప్రయత్నం చేస్తున్నట్టు తెలుస్తోంది. ఇదంతా తెలుగుదేశం అధిష్టానానికి తెలిసే జరుగుతుందనే వార్తలు కూడా విన్పిస్తున్నాయి. మొత్తానికి పిఠాపురంలో వర్మ వర్సెస్ జనసేన రాజకీయం మొదలైపోయింది. పవన్ కళ్యాణ్‌కు నియోజకవర్గంలో చెక్ పెట్టేందుకే ఇలా చేస్తున్నారనే చర్చ నడుస్తోంది. 

కాకినాడ ప్రజలకు తన నియోజకవర్గంలో పట్టాలిచ్చేందుకు అంగీకరించనని చెప్పడం ద్వారా కాకినాడలో జనసేన నాయకుడు, ఎంపీ ఉదయ్‌కు చెక్ పెట్టవచ్చనేది మరో ఆలోచనగా ఉంది. అందుకే ఎమ్మెల్యే కాకపోయినా నియోజకవర్గాన్ని తన అదుపులో ఉంచుకునే ప్రయత్నాలు ప్రారంభించారు వర్మ.

Also read: 8th Pay Commission: కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు బిగ్ అప్‌డేట్, ఎప్పుడు అమలవుతుంది

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

Twitter, Facebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి

About the Author

Trending News