Varma Comments: టీడీపీ పగ్గాలు లోకేష్ కు అప్పగించాలి.. పిఠాపురం వర్మ సంచలన వ్యాఖ్యలు..

Varma Comments: ప్రస్తుతం ఆంధ్ర ప్రదేశ్ లో చంద్రబాబు, పవన్ కళ్యాణ్, లోకేశ్ ల తర్వాత ఎక్కువగా వినిపిస్తున్న పేరు  పిఠాపురం వర్మ.  పవన్ కళ్యాణ్ కోసం తన సీటును త్యాగం చేసిన త్యాగ రాజుగా నిలిచారు. ఆ తర్వాత పవన్ గెలుపు కోసం తన వంతుగా కృషి చేశారు. ఆ సంగతి పక్కన పెడితే.. తాజాగా ఈయన మరో సంచలన వ్యాఖ్యలతో వార్తల్లో నిలిచారు.  

Written by - TA Kiran Kumar | Last Updated : Apr 10, 2025, 07:57 AM IST
Varma Comments: టీడీపీ పగ్గాలు లోకేష్ కు అప్పగించాలి.. పిఠాపురం వర్మ సంచలన వ్యాఖ్యలు..

Varma Comments:పిఠాపురం మాజీ ఎమ్మెల్యే ఎన్.వి.ఎస్.ఎస్.వర్మ కీలక వ్యాఖ్యలు చేశారు. టీడీపీకి లోకేశ్ ను రధసారథిగా నియమించాలని వర్మ డిమాండ్ చేశారు. తెలుగుదేశం పార్టీకి లోకేశ్ నాయకత్వం అవసరమని తెలిపారు. గత ఎన్నికలకు ముందు లోకేశ్ చేసిన యువగళం పాదయాత్ర కారణంగానే బీజేపీ, తెలుగు దేశం, జనసేన కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిందని వర్మ అన్నారు.

Add Zee News as a Preferred Source

READ ALSO:  Chiranjeevi: చిరంజీవికి భార్యగా..చెల్లిగా.. అక్కగా.. తల్లిగా నటించిన ఏకైక హీరోయిన్..

READ ALSO:  Prabhas Vs Venkatesh: కథ ఒక్కటే.. వెంకటేష్ డిజాస్టర్.. ప్రభాస్ బ్లాక్ బస్టర్..

లోకేశ్ నాయకత్వంలో పార్టీ మరిన్ని విజయాలను అందుకుంటుందని వర్మ ఆకాంక్షించారు. టీడీపీకి భవిష్యత్ తరం నాయకులు ఉండాలన్న వర్మ, టీడీపీకి 2047 ప్రణాళిక కూడా అవసరమని అభిప్రాయపడ్డారు. చంద్రబాబు వయసు 75 దాటింది. ఈ నేపథ్యంలో ఇది వరకటిలా ఆయన పని చేయలేరనేది వర్మ ఉద్దేశ్యం. ఏది ఏమైనా చంద్రబాబుకు ఈ వయసులో రెస్ట్ ఇచ్చి పార్టీ పగ్గాలను లోకేష్ కు అప్పగిస్తే.. బాగుంటుందనే ఉద్దేశ్యంతో వర్మ ఈ వ్యాఖ్యలు చేసినట్టు తెలుస్తోంది. వర్మ 2019 ఎన్నికల్లో వైసీపీ హవాలో కూడా పిఠాపురం నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా గెలిచారు. ఆ తర్వాత నియోజకవర్గంలో తల్లో నాలుకగా మారారు.

అయితే.. పిఠాపురం వర్మ తన వల్లే పవన్ కళ్యాణ్ గెలిచాడని పలు సందర్బాల్లో ప్రస్తావిస్తూ ఉన్నారు. ఈ నేపథ్యంలో జనసేన 12వ ఆవిర్భావ సభలో నాగబాబు ఎవరి వల్ల ఎవరు గెలవలేదు. గెలిచామని చెబుతున్న వారి కర్మ అని వ్యంగ్యంగా వ్యాఖ్యానించారు.  ఈ నేపథ్యంలో పిఠాపురంలో టీడీపీ, జనసేన కార్యకర్తల మధ్య విభేదాలు వచ్చాయి. అంతేకాదు నియోజకవర్గంలో బాహాహహీకి దిగిన సందర్భాలున్నాయి.

ఇదీ చదవండి:  Sri Rama Navami 2025: వెండితెర శ్రీరాముళ్లు..

ఇదీ చదవండి: Sri Rama Navami 2025: వెండితెరపై సీతమ్మ వారి పాత్రల్లో మెప్పించిన నటీమణులు..

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

TwitterFacebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.

About the Author

TA Kiran Kumar

కిరణ్ కుమార్ తంజావూర్ జీ తెలుగు తెలుగు న్యూస్‌లో ఛీఫ్ సబ్ ఎడిటర్‌గా పనిచేస్తున్నారు. ఇక్కడ 2024 నుంచి  వినోదం, ఆధ్యాత్మికం, జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ వ్యవహారాలకు సంబంధించిన వార్తలు రాస్తున్నారు. సినిమా రివ్యూలు, సినిమాలకు సంబంధించి ప్రత్యేక కథనాలు కూడా రాస్తుంటారు. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో వివిధ రంగాలకు సంబంధించిన వార్తలు అందించారు. ఆయనకు జర్నలిజంలో 18 ఏళ్లకుపైగా అనుభవం ఉంది.

...Read More

Trending News