Polavaram Project: పోలవరం ప్రాజెక్టులో డయాఫ్రం వాల్ నిర్మాణంతో పాటు మిగిలిన పనులు చేపట్టేందుకు అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. ఎగువ కాఫర్ డ్యాం పొడవునా సీపేజీ నివారణకు వీలుగా బట్రెస్ డ్యాం నిర్మాణానికి కేంద్ర జలసంఘం-CWC అనుమతి ఇచ్చింది. బట్రెస్ డ్యాం డిజైన్లు కూడా ఖరారయ్యాయి. ఈనెల 3 లేదా 4 నాటికి... ఆ డిజైన్లకు ఆమోదం తెలియజేసి పంపుతామని..., ఈలోపు పనులు పూర్తి చేసుకోవాలని పోలవరం అధికారులకు CWC తెలియజేసింది.
ఈ పనులను మూడు నెలల్లో పూర్తి చేయాలని టార్గెట్ పెట్టుకున్నారు అధికారులు. ప్రాజెక్టు సీఈ నరసింహమూర్తి ఢిల్లీ వెళ్లి ప్రాజెక్టు అనుశీలన పనులన్నీ పర్యవేక్షించారు. పోలవరంలో ప్రధాన డ్యాం, డి వాల్ నిర్మాణ ప్రాంతంలో నీటి సీపేజీ పెద్ద సమస్య సృష్టించింది.
ఇదీ చదవండి: అల్లు అర్జున్ నిజంగానే రామ్ చరణ్ అన్ ఫాలో చేశాడా.. తెర వెనక అసలు స్టోరీ ఇదే.
వరద రోజుల్లో సీపేజీ సమస్యను నియంత్రించడంతో పాటు డి-వాల్ నిర్మాణానికి ఇబ్బందులు లేకుండా ప్లాట్ ఫాం నిర్మించి అక్కడి నుంచి పనులు కొనసాగేలా చర్యలు తీసుకుంటున్నారు. పోలవరంలో క్లేకోర్ రీచ్ సహా కొన్ని కీలక అంశాలు చర్చించాల్సి ఉన్నందున.. ఈనెల 3 లేదా తర్వాత ఏ రోజైనా విదేశీ నిపుణులతో...ఆన్ లైన్ సమావేశానికి ఏర్పాట్లు చేస్తున్నారు.
ఇదీ చదవండి: Liquor Rates Hike: మందుబాబుకు భారీ షాక్.. భారీగా పెరిగిన బీర్ల ధరలు..
ఇదీ చదవండి: ప్రభుత్వ ఉద్యోగులకు అదిరిపోయే శుభవార్త.. బేసిక్ పేలో భారీ పెంపు..
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.









