Posani Krishna Murali: వైసీపీ నేత, ప్రముఖ సినీ నటుడు పోసాని కృష్ణ మురళి ఏపీ హైకోర్టు ను ఆశ్రయించారు. తనపై నమోదైన కేసులను కొట్టివేయాలని కోరుతూ క్వాష్ పిటిషన్ దాఖలు చేశారు. అదేవిధంగా పాతపట్నం, సూర్యారావుపేట, కర్నూలు, అదోని టూటౌన్ పోలీసులు తనపై నమోదు చేసిన కేసులను కొట్టివేయాలని క్వాష్ పిటిషన్ లో పేర్కొన్నారు. ఆయా కేసుల్లో తనకు మధ్యంతర బెయిల్ మంజూరు చేయాలని హైకోర్టును ఆశ్రయించారు. పోలీసులు అన్యాయంగా తనపై తప్పుడు కేసులు బనాయించారని, వారు పెట్టిన సెక్షన్లు పోసానికి వర్తించవని ఆయన తరుఫు న్యాయవాది పిటిషన్‌లో పేర్కొన్నారు. మొత్తం నాలుగు కేసులలో ఏడేళ్ల పాటు శిక్ష పడేలా సెక్షన్లను ఉన్నాయన్నారు. ఈ నేపథ్యంలో ముందు నోటీసు ఇచ్చి పోలీసులు వివరణ తీసుకోసునేలా ఆదేశాలు ఇవ్వాలని కోర్టును అభ్యర్థించారు. ఈ మేరకు ఆంధ్ర ప్రదేశ్ హైకోర్టు పోసాని క్వాష్ పిటిషన్‌పై గురువారం విచారణ చేపట్టనుంది.
పోసాని కృష్ణమురళిపై ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా 17పైగా వివిధ పోలీసు స్టేషన్లలో కేసులు నమోదయ్యాయి. అన్నమయ్య జిల్లా ఓబులవారిపల్లె పోలీసు స్టేషన్‌లో నమోదైన కేసుకు సంబంధించి పోసానిని పోలీసులు ఫిబ్రవరి 26న అరెస్ట్ చేశారు. అనంతరం రైల్వే కొడూరు మేజిస్ట్రేట్ రిమాండ్ విధించడంతో రాజంపేట సబ్ జైలు కు తరలించారు. నరసరావుపేట పోలీసు స్టేషన్‌లో నమోదైన కేసుకు సంబంధించి అక్కడి పోలీసులు రాజాంపేట సబ్ జైలుకు చేరుకుని పీటీ వారెంట్ పై పోసానిని సోమవారం అదుపులోకి తీసుకున్నారు.
ఇదీ చదవండి: అల్లు అర్జున్ నిజంగానే రామ్ చరణ్ అన్ ఫాలో చేశాడా.. తెర వెనక అసలు స్టోరీ ఇదే.
అనంతరం అదే రోజు సాయంత్రం నరసరావుపేట కోర్టులో పోసానిని హాజరుపరిచారు. ఈ క్రమంలోనే పోసాని కృష్ణమురళికి ఈ నెల 13 వరకు కోర్టు రిమాండ్ విధించింది. దీంతో పోసానిని గుంటూరు సబ్ జైలుకు తరలించారు. మంగళవారం ఆదోని పోలీసులు గుంటూరు జైలు నుంచి అదుపులోకి తీసుకుని కర్నూలుకు తీసుకెళ్లారు. కర్నూలు జడ్జి ఎదుట పోసానిని పోలీసులు హాజరుపరచగా పోసానికి న్యాయమూర్తి 14 రోజుల రిమాండ్ విధించారు. ప్రస్తుతం పోసాని మురళికృష్ణ కర్నూలు జిల్లా జైలులో ఉన్నారు.
ఇదీ చదవండి: టబుకు అన్న ఎన్టీఆర్ ఫ్యామిలీకి ఉన్న ఈ రిలేషన్ తెలుసా.. ! అస్సలు ఎక్స్ పెక్ట్ చేయరు..
ఇదీ చదవండి: నిహారిక మళ్లీ పెళ్లి కూతురు అవుతుందోచ్.. పెళ్లి కొడుకు ఫిక్స్..?
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.









