Posani Krishna Murali: పోసాని కృష్ణ మురళీకి భారీ ఊరట.. బెయిల్‌ మంజూరు

Big Relief To Posani Krishna Murali Kadapa Mobile Court Grants Bail: అరెస్టయి జైల్లో ఉన్న నటుడు పోసాని కృష్ణ మురళీకి భారీ ఊరట లభించింది. అతడికి కోర్టు బెయిల్‌ మంజూరు చేసింది. ఈ వార్త వివరాలు ఇలా ఉన్నాయి.

Written by - Ravi Kumar Sargam | Last Updated : Mar 7, 2025, 04:46 PM IST
Posani Krishna Murali: పోసాని కృష్ణ మురళీకి భారీ ఊరట.. బెయిల్‌ మంజూరు

Posani Krishna Murali: ఆంధ్రప్రదేశ్‌ రాజకీయాల్లో సంచలనం సృష్టించిన సినీ నటుడు పోసాని కృష్ణ మురళీకి భారీ ఊరట లభించింది. చంద్రబాబు, పవన్ కల్యాణ్, నారా లోకేశ్‌పై అనుచిత వ్యాఖ్యలు చేశారనే ఆరోపణలతో ఆంధ్రప్రదేశ్‌ పోలీసులు అరెస్ట్‌ చేసిన విషయం తెలిసిందే. ఏపీకి తరలించిన అనంతరం పోసాని కృష్ణ మురళీని కేసు నమోదైన అన్ని స్టేషన్‌లకు తిప్పుతున్నారు. పోలీసులు కస్టడీకి తీసుకోగా.. తాజాగా ఆ కస్టడీ పిటిషన్‌ను న్యాయస్థానం కొట్టివేసింది. పోసానికి బెయిల్ మంజూరు చేస్తూ ఆదేశాలు జారీ చేసింది.

Add Zee News as a Preferred Source

Also Read: Heat Waves: ఆంధ్రప్రదేశ్‌కు హెచ్చరిక.. రేపు, ఎల్లుండి వడగాల్పులు

ప్రముఖ నటుడు పోసాని కృష్ణమురళికి బెయిల్ మంజూరు చేస్తూ కడప మొబైల్ కోర్టు ఆదేశాలు ఇచ్చింది. ఓబులవారిపల్లి పోలీస్‌ స్టేషన్‌లో పోసానిపై నమోదైన కేసులో బెయిల్ లభించింది. అక్కడి జడ్జి అందుబాటులో లేకపోవడంతో కడప మొబైల్ కోర్టు బెయిల్ పిటిషన్‌ను విచారించి బెయిల్ మంజూరు చేసింది. పోసాని కస్టడీ పిటిషన్‌ను కోర్టు కొట్టి వేసింది. అయితే నరసరావుపేట, ఆదోని కోర్టుల్లోనూ బెయిల్ వస్తేనే పోసాని బయటకు వచ్చే అవకాశం ఉంది. లేకపోతే పోసాని ఇంకా జైల్లోనే ఉండవలసి ఉంటుంది. బెయిల్‌ రావడంతో అతడి కుటుంబసభ్యులు హర్షం వ్యక్తం చేశారు. మిగిలిన కేసుల్లో కూడా బెయిల్‌ లభిస్తుందని కుటుంబసభ్యులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.

Also Read: Nara Lokesh Counter: 'అహంకారానికి ప్యాంట్, షర్ట్ వేస్తే మాజీ సీఎం వైఎస్ జగన్'

ఆంధ్రప్రదేశ్‌లో వైఎస్సార్‌సీపీ సానుభూతిపరులు, నాయకులు అరెస్ట్‌లు జరుగుతున్నాయి. హైదరాబాద్‌లోని రాయదుర్గంలో పోసాని కృష్ణ మురళీ ఇంటికి వచ్చిన ఏపీలోని రాయదుర్గం పోలీసులు అతడిని అరెస్ట్‌ చేశారు. అతడి అరెస్ట్‌ను వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ తీవ్రంగా ఖండిస్తోంది. ఏపీలో రెడ్‌ బుక్‌ రాజ్యాంగం నడుస్తోందనడానికి నిదర్శనం పోసాని కృష్ణ మురళీ అరెస్ట్‌ అని వైఎస్సార్‌సీపీ నాయకులు పేర్కొంటున్నారు.

రాయదుర్గంలోని మై హోం భుజ అపార్ట్‌మెంట్‌లో నివసిస్తున్న పోసాని కృష్ణ మురళీ నివాసానికి ఏపీలోని రాయదుర్గం పోలీసులు ప్రవేశించారు. గతంలో చంద్రబాబు, పవన్ కల్యాణ్, నారా లోకేశ్‌పై అనుచిత వ్యాఖ్యలు చేశారని ఏపీలోని పలు పోలీస్‌ స్టేషన్‌లలో పోసానిపై వివిధ సెక్షన్ల కింద కేసులు నమోదయ్యాయి. ఈ కేసుల విచారణలో భాగంగా ఏపీ పోలీసులు అరెస్ట్‌ చేయగా.. విచారణ కోసం ప్రతి పోలీస్‌ స్టేషన్‌కు పోసానీని తీసుకెళ్తున్నారు.

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

Twitter, Facebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.

About the Author

Ravi Kumar Sargam

సర్గం రవి కుమార్‌. జీ తెలుగు డిజిటల్ మీడియాలో సబ్ ఎడిటర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ 2024 నుంచి రాజకీయాలు, స్పోర్ట్స్, వినోదం, క్రైమ్, జాతీయ వ్యవహరాలకు సంబంధించిన వార్తలు రాస్తున్నారు. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో వివిధ రంగాలకు సంబంధించిన వార్తలు అందించారు.

...Read More

Trending News