close

News WrapGet Handpicked Stories from our editors directly to your mailbox

ఉదయం కల్లా కనుమరుగు కానున్న ప్రజా వేదిక భవనం !!

సీఎం జగన్ ఆదేశాల మేరకు ఉండవల్లిలోని ప్రజా వేదిక భవనం కూల్చివేత ప్రక్రియ మొదలైంది

Updated: Jun 25, 2019, 10:35 PM IST
ఉదయం కల్లా కనుమరుగు కానున్న ప్రజా వేదిక భవనం !!

ఉండవల్లిలోని ప్రజావేదిక కూల్చివేత ప్రక్రియ మొదలైంది. భవనానికి సంబంధించిన ప్రహరీగోడను ప్రొక్లైన్ల సాయంతో సిబ్బంది కూల్చివేశారు. అంతకుముందు అక్కడి క్యాంటీన్ ను కూల్చివేశారు.

ప్రజావేదిక భవంలో నిన్న కలెక్టర్ల సమావేశంలో సీఎం జగన్ ..ప్రజా వేదిక భవనం అక్రమ కట్టడమని ప్రకటించి దాని కూల్చివేతకు ఆదేశాలు ఇచ్చిన విషయం తెలిసిందే. రెండు రోజుల్లో కూల్చేయాలన్న సీఎం ఆదేశాల మేరకు ఈ రోజు జరిగిన సదస్సు ముగియగానే కూల్చివేత ప్రక్రియను ప్రారంభించారు. ఈ రోజు సాయంత్రం ప్రారంభమైన కూల్చివేత ప్రక్రియ తెల్లవారేసరికి పూర్తి కానుంది. అంటే ఉదయం కల్లా ప్రజావేదిక నేలమట్టం కానుందన్నమాట. కాగా కూల్చివేతను సీఆర్డీఏ ఉన్నతాధికారులు పర్యవేక్షిస్తున్నారు. 

ఇదిలా ఉండగా ప్రజావేదిక కూల్చివేతను టీడీపీ వ్యతిరేకిస్తున్నందున ఎలాంటి అవాంఛనీయ ఘటనలు, ఘర్షణలు జరగకుండా ఉండేందుకుగాను భవనం పరిసర ప్రాంతాల్లో  భారీగా పోలీసులు మోహరించారు.