PM Modi Visits AP : ఏపీలో ప్రధాని మోడీ కీలక పర్యటన.. ఏర్పాట్లు చేస్తోన్న కూటమి ప్రభుత్వం..

PM Modi Visits AP : భారత ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ ఆంధ్ర ప్రదేశ్ పర్యటన ఖరారైంది. ఈ సందర్భంగా చంద్రబాబు నేతృత్వంలోని కూటమి ప్రభుత్వం జోరుగా ఏర్పాట్లు చేస్తోంది.

Written by - TA Kiran Kumar | Last Updated : Apr 21, 2025, 11:23 AM IST
PM Modi Visits AP : ఏపీలో  ప్రధాని మోడీ కీలక పర్యటన.. ఏర్పాట్లు చేస్తోన్న కూటమి ప్రభుత్వం..

PM Modi Visits AP : 2024 ఎన్నికల్లో మరోసారి బీజేపీ, టీడీపీ, జనసేన కూటమిగా పోటీ చేసి ప్రతిపక్ష వైసీపీని కకావికలం చేసాయి. ఈ పార్టీల కలయికతో ఏపీ ప్రజలకు మంచి రోజులు వచ్చాయి. ఇప్పటికే ఏపీ విషయంలో కేంద్రంలోని నరేంద్ర మోడీ ప్రభుత్వం ఉదారంగా వ్యవహరిస్తోంది. ఇప్పటికే ఏపీకి పలు అభివృద్ది ప్రాజెక్టులను కేటాయించిన నరేంద్ర మోడీ.. తాజాగా మరోసారి ఏపీలో పర్యటించనున్నారు.
అమరావతి పునర్నిర్మాణ కార్యక్రమం ప్రారంభానికి మోదీ మే 2న రానున్న నేపథ్యంలో ప్రభుత్వం భారీ ఏర్పాట్లు చేస్తోంది. సచివాలయం వెనక దాదాపు 350 ఎకరాల సువిశాల విస్తీర్ణంలో భారీ ఏర్పాట్లు సాగుతున్నాయి. సుమారు 5 లక్షల మంది జనం హాజరయ్యే అవకాశం ఉండటంతో...అందుకు అనుగుణంగా సభా ప్రాంగణాన్ని సిద్ధం చేస్తున్నారు.

Add Zee News as a Preferred Source

మే 2వ తేదీ సాయంత్రం 4గంటల సమయంలో ప్రధాని నరేంద్ర మోదీ అమరావతి ప్రాంతానికి చేరుకుంటారు. అక్కడ రాజధాని పనులు పునఃప్రారంభిస్తారు. ప్రధాని పర్యటనకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేయాలని సీఎస్ కే. విజయానంద్ ను చంద్రబాబు ఆదేశించారు. ప్రజలు, ప్రముఖులు సభా ప్రాంగణానికి చేరుకునేలా తొమ్మిది రహదారులను గుర్తించామని చెప్పారు.  ఆయా రహదారులపై ఎక్కడా వాహనాల రాకపోకలకు అంతరాయం కలగకుండా చర్యలు తీసుకోవాలని అధికారులను  ఆదేశించారు.

ప్రధాని నరేంద్ర మోడీతోపాటు ఇతర ప్రముఖుల కోసం నాలుగు హెలిప్యాడ్లు అవసరమని అధికారులు భావిస్తున్నారు. సచివాలయం ఎదుట ముఖ్యమంత్రి ఉపయోగించే మూడు హెలీప్యాడ్లు ఉన్నాయి. వీటికి అదనంగా మరొకటి రెడీ చేయాలని నిర్ణయించారు. ఈ నాలుగో హెలీప్యాడ్ ను రైతుల లే ఔట్ లో రెడీ చేయాలని నిర్ణయించారు. మరోవైపు ప్రధాని నరేంద్ర మోదీ పర్యటన ఏర్పాట్ల కోసం మంత్రుల కమిటీని ప్రభుత్వం నియమించింది.

బహిరంగ సభకు ఉమ్మడి గుంటూరు, కృష్ణా, ప్రకాశం, పశ్చిమ గోదావరి జిల్లాల నుంచి ప్రజలు హాజరయ్యేలా కార్యాచరణను రూపొందించారు. సభకు వచ్చేవారి కోసం 40 ఎకరాల్లో టెంట్లు వేయాలని నిర్ణయించినట్లు తెలిసింది.ప్రధాని హెలీప్యాడ్ నుంచి వేదిక వరకు ఇరువైపులా రైతులు, మహళలు నిలబడి ప్రధాని మోదీకి పూలు చల్లుతూ స్వాగతం పలికేలా ఏర్పాట్లు చేయాలని భావిస్తున్నారు. మరోవైపు మోదీ భద్రతా ఏర్పాట్లను ఎస్పీజీ బృందం పర్యవేక్షించనుంది. మరోవైపు మోడీ ఏపీలో పర్యటన లో అధికార కార్యక్రమాలతో పాటు బీజేపీ కార్యకర్తలతో ప్రత్యేకంగా భేటి కానున్నారు. ఏపీలో పార్టీ బలోపేతంపై వారితో కలిసి చర్చించనున్నారు. ఈ లోగా ఏపీకి కొత్త అధ్యక్షుడిని ప్రకటించానున్నారు.

ఇదీ చదవండి: బడా స్టార్స్ సహా 900 సినిమాల్లో నటించిన నటి.. భర్త చనిపోవడంతో తాగుడుకు బానిసై జీవితం నాశనం..

ఇదీ చదవండి:  ఈ చెట్లు ఉంటే.. పాములకు మీ ఇంట్లోకి రెడ్ కార్పెట్ పరిచినట్టే.. తస్మాత్ జాగ్రత్త..!

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

TwitterFacebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.

About the Author

TA Kiran Kumar

కిరణ్ కుమార్ తంజావూర్ జీ తెలుగు తెలుగు న్యూస్‌లో ఛీఫ్ సబ్ ఎడిటర్‌గా పనిచేస్తున్నారు. ఇక్కడ 2024 నుంచి  వినోదం, ఆధ్యాత్మికం, జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ వ్యవహారాలకు సంబంధించిన వార్తలు రాస్తున్నారు. సినిమా రివ్యూలు, సినిమాలకు సంబంధించి ప్రత్యేక కథనాలు కూడా రాస్తుంటారు. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో వివిధ రంగాలకు సంబంధించిన వార్తలు అందించారు. ఆయనకు జర్నలిజంలో 18 ఏళ్లకుపైగా అనుభవం ఉంది.

...Read More

Trending News