)
PM Modi Tour Schedule: ప్రధాని నరేంద్ర మోదీ అమరావతి పర్యటన ఫిక్స్ అయింది. మే 2 తేదీ సాయంత్రం 4 గంటలకు ప్రధాని మోదీ చేతుల మీదుగా పలు శంకుస్థాపనలు జరగనున్నాయి. ఈ సందర్భంగా 15 నిమిషాలు రోడ్ షో నిర్వహించనున్నారు. మొత్తం పర్యటన షెడ్యూల్ ఇలా ఉండనుంది.
ఏపీ రాజధాని అమరావతి నిర్మాణ పనులు ప్రధాని నరేంద్ర మోదీ చేతుల మీదుగా జరగనున్నాయి. ఈ మేరకు అమరావతి పర్యటన ఖరారైంది. మే 2వ తేదీ మద్యాహ్నం 3 గంటలకు విజయవాడ విమానాశ్రయానికి చేరుకుంటారు. అక్కడి నుంచి ప్రత్యేక విమానం ద్వారా మద్యాహ్నం 3.30 గంటకు అమరావతిలో ఏర్పాటు చేసిన హెలీ ప్యాడ్‌కు చేరుకుంటారు. అక్కడి నుంచి ప్రధాన వేదిక వరకు 1.1 కిలోమీటర్ రోడ్ షో ఉంటుంది. రోడ్ షో దాదాపుగా 15 నిమిషాలు ఉంటుంది. మద్యాహ్నం 3.45 గంటల నుంచి 4 గంటల వరకు అమరావతి పెవిలియన్ సందర్శన ఉంటుంది. ఆ తరువాత అంటే సాయంత్రం 4 గంటల నుంచి 5 గంటల వరకు బహిరంగ సభ ఉంటుంది. అమరావతి పునర్ నిర్మాణ పనులకు శంకుస్థాపన చేస్తారు.
అనంతరం అదే రోజు సాయంత్రం 5.10 గంటలకు హెలీకాప్టర్ ద్వారా గన్నవరం విమానాశ్రయానికి చేరుకుని 5.20 గంటలకు ఢిల్లీ బయలుదేరి వెళతారు. ప్రధాని మోదీ పాల్గొనే సభా వేదికపై 20 మందికి మాత్రమే అనుమతి ఉంటుంది. వీరిలో ప్రధాని మోదీ, ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ సహా 20 మంది ఉంటారు. వీవీఐపీల కోసం మరో వేదిక ఉంటుంది. ఆ వేదికపై 100 మంది వరకు ఉంటారు.
బహిరంగ సభ కోసం ఏపీ సెక్రటేరియట్ వెనుక భాగంలో వేదిక సిద్ధం చేశారు. ప్రస్తుతం ప్రధాని పర్యటన ఏర్పాట్లు ఘనంగా జరుగుతున్నాయి.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి