Raghu college in Vizianagaram girl suspended from college: ఆంధ్రప్రదేశ్ లోని విజయనగరంలో ఉన్న రఘు ఇంజనీరింగ్ కాలేజీలో ఇటీవల షాకింగ్ ఘటన చోటు చేసుకుంది. కాలేజీ టీచర్ ఒక అమ్మాయి దగ్గరున్న సెల్ ఫోన్ ను లాక్కుంది. దీంతో ఆమె రెచ్చిపోయింది. ఇది 12 వేల ఫోన్ అని.. టీచర్ పై శివాలెత్తిపోయింది. ఫోన్ ఇస్తావా లేదా.. అంటూ బూతులు తిట్టింది. అంతటితో ఆగకుండా లేడీ టీచర్ మీద చెప్పుతొ దాడికి కూడా దిగింది.
ఈ తరం పిల్లలు తమ గురువులకు ఇచ్చే గౌరవం ఇది...?
తప్పు పిల్లలది కాదు, తల్లిదండ్రులది, టీచర్లది. పిల్లలకు ఫోన్లు కొనివ్వడం, వాళ్ళ గౌరవం కోసం లక్షల రూపాయల ఫీజులు కట్టే తల్లిదండ్రులు, లక్షల రూపాయల ఫీజులు తీసుకోని అమ్ముడుపోయిన టీచర్లు గౌరవాన్ని ఆశించడం సరైందేనా? #ShameOnSociety pic.twitter.com/tSmxNdNeW7
— ꜱʀɪʀᴀɴɢᴀᴍ ꜱᴀɢᴀʀ(ᴍᴏᴅɪ ᴋᴀ ᴘᴀʀɪᴠᴀʀ) (@SAGAR4TBJP) April 22, 2025
బూతులు తిగుతూ నానా రచ్చచేసింది. ఈ ఘటనకు చెందిన వీడియో వైరల్ కావడంతో ఇది పెద్దదుమారంగా మారింది.చదువు చెప్పే గురువు పట్ల ఇంత నీచంగా ప్రవర్తించడంపై సర్వత్రా విమర్శలు వచ్చాయి. ఆ యువతిపై కఠిన చర్యలుతీసుకొవాలని, కాలేజీ నుంచి టీసీ ఇచ్చి పంపించి వేయాలని కూడా నెటిజన్లు డిమాండ్ లు చేశారు. ఈ నేపథ్యంలో ప్రస్తుతం ఈఘటనలో కాలేజీ యాజమాన్యం యువతికి బిగ్ షాక్ ఇచ్చింది.
లేడీ టీచర్ తో అమర్యాదగా ప్రవర్తించినందుకు కాలేజీ నుంచి సస్పెండ్ చేస్తున్నట్లు తెలిపింది. ఈ మేరకు కాలేజీ యాజమాన్యం అమ్మాయిని కాలేజీ నుంచి సస్పెండ్ చేస్తున్నట్లు నోటీసులు జారీచేసింది. ఈ ఆదేశాలు వెంటనే అమల్లోకి వస్తాయిన కాలేజీ యాజమాన్యం స్పష్టం చేసింది.
Read more: Seema Haidar: భారత్ , పాక్ ల మధ్య ఉద్రిక్తతలు... సంచలన నిర్ణయం తీసుకున్న సీమా హైదర్..
అయితే.. ఘటన జరిగాక.. యువతి నుంచి కానీ.. లేదా వాళ్ల తల్లిదండ్రుల నుంచి ఏదైన పశ్చాత్తాప భావన వస్తుందని యాజమాన్యం భావించింది. కానీ యువతిమాత్రం ఇప్పటి వరకు తనపనిపై రియలైజ్ కాలేదు. దీంతో ఆమెపై ఈ విధంగా కాలేజీ యాజమాన్యం చర్యలు తీసుకుంది.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.









