Rain Alert In AP And Telangana: అక్టోబరు చివర్లో వచ్చిన మొంథా తుపాను ఇటు ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాలను కుదిపేసింది. ఆ విధ్వంసం నుంచి కోలుకోకముందే ఇప్పుడు మరో ఉపధ్రవం ముంచుకొస్తుంది. మొంథా తుపాను వల్ల ఇప్పటికే నీట మునిగిన ప్రాంతాలు ఇంకా కోలుకోలేదు. ఇప్పుడు తాజాగా మరో తుపాను హెచ్చరికను వాతావరణ శాఖ జారీ చేసింది. ఈ నెల 19 లేదా 20న బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పనున్నట్లు వెల్లడించింది.
అండమాన్, శ్రీలంక సమీప ప్రాంతాల్లో వాతావరణ పరిస్థితులు మారుతున్న తరుణంలో అల్పపీడనం మరింత బలపడే అవకాశం ఉన్నట్లు వాతావరణ శాఖ హెచ్చరిస్తుంది. దీని తీవ్రత పెరిగితే మరోసారి ఆంధ్రప్రదేశ్, తెలంగాణ వ్యాప్తంగా భారీ నుంచి అతి భారీ వర్షాలు కురవడంతో పాటు బలమైన గాలులు వీచే అవకాశం ఉన్నట్లు స్పష్టం చేసింది. ఇప్పటికే ఇరు తెలుగు రాష్ట్రాల్లోని రైతులు పంట నష్టాలతో ఇబ్బంది పడుతుంటే.. ఇప్పుడు మరో తుపాను హెచ్చరిక.. రైతుల కంటిమీద కునుకు లేకుండా చేస్తుంది.
Also REad: 8th Pay Commission: ప్రభుత్వ ఉద్యోగులకు అతిపెద్ద షాక్? 8వ వేతన సంఘం మరింత ఆలస్యం..?
వాతావరణశాఖ ప్రకారం.. నవంబరు 19 లేదా 20 లోపు బంగాళఖాతంలో మరో అల్పపీడనం ఏర్పడనుంది. అది బలపడి తుపానుగా మారే అవకాశం ఉన్నట్లు వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. ఈ క్రమంలో ప్రభుత్వ యంత్రాంగంతో పాటు రైతులు, మత్య్సకారులు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. నవంబరు 19న ఏర్పడే అల్పపీడనం తుపానుగా మారి 4 నుంచి 5 రోజుల్లో తీవ్ర తుపానుగా మారి తీరం దాటే అవకాశం ఉన్నట్లు తెలిపారు. ఈ క్రమంలో కోస్తా ప్రాంత వాసులు తీవ్రంగా ఇబ్బంది పడే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.
ఇదిలా ఉండగా తాజాగా శ్రీలంక సమీపంలో ఏర్పడిన అల్పపీడనం బలపడుతున్నట్లు వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది. ఇది తుపానుగా మారి భారతదేశం వైపుగా కదులుతుందని అధికారులు సూచించారు. ఈ తుపాను తమిళనాడు, ఆంధ్రప్రదేశ్ మీద ఎక్కువ ప్రభావం చూపే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ఈ క్రమంలో నవంబరు నెలాఖరు వరకు భారీ నుంచి అతి భారీ వర్షసూచన ఉన్నట్లు వాతావరణ శాఖ స్పష్టం చేసింది.
Also Read: Anaya Bangar: RCB మహిళల జట్టులోకి మాజీ క్రికెటర్ కొడుకు..హిజ్రాగా మారి క్రికెట్ ఆడతానంటూ కోరిక!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook









