Rain Alert To Andhra Pradesh: వేసవికాలంలో అధిక ఉష్ణోగ్రతల నుంచి అల్లాడుతున్న ప్రజలకు వాతావరణ శాఖ చల్లటి కబురు అందించింది. రాబోయే మూడు రోజుల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తాయని ప్రకటించింది. ఈ మేరకు వాతావరణ శాఖ కీలక ప్రకటన చేసింది. అకాల వర్షాలతో రైతులతోపాటు ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించింది. ఉరుములు మెరుపులతోపాటు అక్కడక్కడ పిడుగులు పడే ప్రమాదం కూడా ఉండడంతో ప్రజలను వాతావరణ శాఖ హెచ్చరించింది.
Also Read: Tirumala Drone: తిరుమలలో మరోసారి భద్రతా వైఫల్యం.. డ్రోన్ ఎగురవేసిన యూట్యూబర్
ఆంధ్రప్రదేశ్ వాతావరణంపై అమరావతి వాతావరణ కేంద్రం సోమవారం కీలక ప్రకటన చేసింది. వచ్చే మూడు రోజుల పాటు ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు పడే అవకాశం ఉన్నట్లు వాతావరణ శాఖ వెల్లడించింది. కొన్ని చోట్ల తేలికపాటి వర్షాలు పడతాయని.. మరికొన్ని ప్రాంతాల్లో ఈదురుగాలులతో వర్షాలు పడే అవకాశం ఉందని అమరావతి వాతావరణ శాఖ తెలిపింది పిడుగులు కూడా పడే అవకాశం ఉండడంతో ప్రజలు, రైతులు అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ అధికారులు సూచిస్తున్నారు.
Also Read: Love Marriage Murders: ఏపీలో ప్రియురాళ్ల వరుస హత్యలు.. ప్రేమ పెళ్లి అంటేనే హడల్
చిత్తూరు జిల్లాలో వర్షం.. భారీగా నష్టం..
అకాల వర్షాల ప్రభావం ఏపీలో అక్కడక్కడ ఉండగా.. చిత్తూరు జిల్లాలో కొంత ప్రభావం చూపింది. ఎస్ఆర్ పురం మండలంలో గాలివాన బీభత్సం సృష్టించింది. నెలవాయి వద్ద రోడ్డుకు అడ్డంగా భారీ వృక్షాలు కూలాయి. దీంతో చిత్తూరు-పుత్తూరు మార్గంలో భారీగా ట్రాఫిక్ జామ్ జరిగింది. వెంటనే స్థానిక పోలీసులతోపాటు అధికార యంత్రాంగం చేరుకుని చెట్టును అడ్డు తొలగించి రాకపోకలు సాఫీ సాగేలా పునరుద్ధరణ పనులు చేస్తున్నారు. ఇక ఎస్‌ఆర్ పురంలో మండలంలోని పలు గ్రామాల్లో వర్షం, ఈదురుగాలలు ప్రభావానికి విద్యుత్ సరఫరాకు అంతరాయం ఏర్పడింది.
తెలంగాణలో..
వేసవికాలంలో తెలంగాణలో కూడా అకాల వర్షాలు కురుస్తున్నాయి. కొన్ని రోజుల కింద రాష్ట్రవ్యాప్తంగా భారీ వర్షాలు కురిసిన విషయం తెలిసిందే. కొంత తెరపినిచ్చిన వర్షాలు మళ్లీ వర్షం ముప్పు లేకపోలేదు. రాబోయే రోజుల్లో రాష్ట్రవ్యాప్తంగా వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ సూత్రప్రాయంగా తెలిపింది. రంగారెడ్డి జిల్లా యాచారం మండలం మేడిపల్లి గ్రామంలో సోమవారం భారీ వర్షం కురిసింది. రాళ్ల వర్షం కురవడంతో మామిడితోటల్లో ఇప్పుడిప్పుడే కాతకు వస్తున్న మామిడికాయలు నేలరాలాయి.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Facebook, Twitter









