close

News WrapGet Handpicked Stories from our editors directly to your mailbox

ఇంటి ప్లాన్ కావాలా.. ఇంకుడు గుంత తప్పనిసరి

ఇంటి ప్లాన్ కావాలా.. ఇంకుడు గుంత తప్పనిసరి

Updated: Aug 13, 2019, 09:25 PM IST
ఇంటి ప్లాన్ కావాలా.. ఇంకుడు గుంత తప్పనిసరి
Representational image

విజయవాడ మునిసిపల్ కార్పొరేషన్‌(వీఎంసి) పరిధిలో ఇకపై ఇల్లు నిర్మించుకోవాలంటే ఇంటి ఆవరణలో ఇంకుడు గుంత తప్పనిసరిగా ఉండాల్సిందే అంటున్నారు అక్కడి అధికారులు. ఇంటిని నిర్మించే సమయంలో ఇంకుడు గుంత తవ్వుతామని అంతకన్నా ముందుగా సంబంధిత అధికారులకు హామీ పత్రం ఇస్తేనే, సదరు దరఖాస్తుదారుడి ఇంటి ప్లానుకు అనుమతి మంజూరు చేయాలని వీఎంసి భావిస్తోంది. భావించడమే కాకుండా ఇకపై ఈ నియమాన్ని విధిగా అమలు చేయాలని వీఎంసీ అధికారులు ఓ నిర్ణయానికొచ్చారు. 

ఇంకుడు గుంతలను తవ్వుతామని హామీ పత్రం ఇస్తేనే, ఇంటి నిర్మాణ ప్లాన్‌ని ఆమోదించే నిబంధనను తీసుకురావాలని 2017 మే నెలలోనే అప్పటి కౌన్సిల్‌ సమావేశంలో ఒక తీర్మాణం చేశారు. అయితే, అప్పట్లో తీర్మానం చేసిన కౌన్సిల్ సభ్యులు ఆ తర్వాత దానిని అమలు చేయడంలోనే అంత కఠినంగా వ్యవహరించలేదనే విమర్శలున్నాయి.