Pastor Praveen Death Case: పాస్టర్ ప్రవీణ్ పగడాల డెత్ మిస్టరీ.. షాకింగ్ నిజాలు బైటపెట్టిన ఐజీ.. ఏమన్నారంటే..?

Praveen Pagadala Death Mystery: పాస్టర్ ప్రవీణ్ పగడాల డెత్ పై అనేక రూమర్స్ నెట్టింట వైరల్గా మారాయి. కొంత మంది కావాలని ఆయనను యాక్సిడెంట్ చేసి చనిపోయేలా చేశారని వార్తలు ప్రచారం చేశారు.ఈ క్రమంలో రాజమండ్రి ఐజీ తాజాగా..ఈ కేసులోని సంచలన విషయాలు బైటపెట్టారు.

Written by - Inamdar Paresh | Last Updated : Apr 12, 2025, 01:18 PM IST
  • పాస్టర్ ప్రవీణ్ ఘటనపై క్లారిటీ ఇచ్చిన ఐజీ..
  • వాళ్లకుటుంబాన్ని డిస్టర్బ్ చేయోద్దని వార్నింగ్..
Pastor Praveen Death Case: పాస్టర్ ప్రవీణ్ పగడాల డెత్ మిస్టరీ.. షాకింగ్ నిజాలు బైటపెట్టిన ఐజీ.. ఏమన్నారంటే..?

IG Ashok Kumar Clarity on Pastor Praveen Pagadala death case: పాస్టర్ ప్రవీణ్ పగడాల డెట్ మిస్టరీ ఏపీలో సంచలనంగా మారింది. దీనిపై తాాజాగా..  రాజమండ్రి ఐజీ అశోక్ కుమార్..   కీలక వ్యాఖ్యలు చేశారు. ఆయనది హత్య అని ఇటీవల కొంత మంది పనిగట్టుకుని సోషల్ మీడియాలో ప్రచారం చేశారన్నారు.. మరికొందరు ఇతర వాహనానలతో ఢీకొట్టి.. ప్రమాదంలో చిత్రీకరించారని కూడా ఆరోపణలు చేశారు.ఈ నేపథ్యంలో రాజమండ్రిపోలీసులు దీనిపై సీరియస్ అయ్యారు. పాస్టర్ ప్రవీణ్ ది హత్య అని చెప్తున్న వాళ్లు.. కనీసం ఒక్క ఆధారమైన చూపించలేకపోయారన్నారు.

Add Zee News as a Preferred Source

అదే విధంగా రోడ్డు ప్రమాదంలో పాస్టర్ ప్రవీణ్ చనిపోయారన్నారు. ఆయన ప్రయాణిస్తున్న బుల్లెట్ బైక్ వేగంగా అదుపు తప్పి.. ఆయన మీద పడటం వల్లనే ఆయన చనిపోయినట్లు రాజమండ్రి ఐజీ ఒక ప్రకటనలో వెల్లడించారు. పాస్టర్ ప్రవీణ్ పగడాల ఘటన జరిగిన రోజు.. హైదరాబాద్, కోదాడ, ఏలురు ప్రాంతాల్లో మద్యం తీసుకుని డ్రైవింగ్ చేసినట్లు పోలీసులు సీసీ ఫుటేజీలలో గుర్తించారు. మద్యం మత్తులో డ్రైవింగ్ చేయడం వల్ల పలు మార్లు ఆయన బుల్లెట్ అదుపు తప్పి పడిపోయిందని కూడా చెప్పారు.

దీంతో ఆయన కళ్లద్దాలు పగిలిపోయాయని.. బుల్లెట్ హెడ్ లైట్, వాహనం కూడా దెబ్బతిందని చెప్పారు. కానీ ప్రవీణ్ పగడాల మాత్రం అలాగే.. డ్రైవింగ్ చేసుకుంటూ వెళ్లాడని చెప్పారు. ఆయన మొత్తంగా ఆరు సార్లు యూపీఐ పెమెంట్ లు చేశాడని కూడా చెప్పారు. ఈ క్రమంలో ప్రస్తుతం.. బుల్లెట్..కొంత మూరు వంతెనపై స్పీడ్ గా వచ్చి.. అక్కడ బ్యాలెన్స్ అవుట్ కావడంతో.. బుల్లెట్ ఆయన మీద పడిందని ఐజీ వెల్లడించారు.

ఈ క్రమంలో ఫోరెన్సీక్ రిపోర్ట్ సైతం.. పాస్టర్ ప్రవీణ్ బైక్ ప్రమాదంలో చనిపోయారని.. ఆయన శరీరంపై అయిన గాయాలు.. ఘటన ప్రదేశంలో కుచ్చుకున్న కంకర, రాళ్లతో కల్గినవేనని, అదే విధంగా  ఆయన శరీరంలో మద్యం ఆనవాళ్లు ఫోరెన్సీక్ ల్యాబ్ రిపోర్ట్ లో బైటపడిందన్నారు.పాస్టర్ ప్రవీణ్ ఒక సారి తన భార్యతో మాట్లాడినట్లు పోలీసులు గుర్తించారు. అదే విధంగా.. రెండు వారాల సమయం ఇచ్చినా ఎవరూ హత్య అనే ఆరోపణకు సంబంధించి ఆధారాలు మాకు అందించలేకపోయారన్నారు. 

Read more: Tirumala News: హనుమాన్ జయంతి వేళ తిరుమలలో మహా అపచారం.. ఏకంగా గర్భగుడి వద్దకు.. వీడియో వైరల్..

డ్రంక్ అండ్ డ్రైవ్ వల్లనే ప్రమాదం జరిగిందని ఐజీ అశోక్ కుమార్ స్పష్టం చేశారు. కొంత మంది  దీనిని వివాదం చేయాలని చూస్తున్నారన్నారు. ఈ క్రమంలో తప్పుడు ఆరోపణలు, భయభ్రాంతులకు గురిచేయాలని చూస్తే.. కఠిన చర్యలు ఉంటాయని ఐజీ హెచ్చరించారు. ఈ కేసులో.. రెండు వారాల సుదీర్ఘ విచారణలో 113 మంది సాక్ష్యులను విచారించిట్లు ఐజీ తెలిపారు.  అదే విధంగా ప్రవీణ్ పగడాల కుటుంబ సభ్యుల్ని వేధిస్తు.. డిస్టర్బ్ చేయోద్దనికూడా ఐజీ ఐజీ స్పష్టం చేశారు.

 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

Twitter, Facebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి

About the Author

Inamdar Paresh

పరేష్ జీ తెలుగు డిజిటల్ మీడియాలో సబ్ ఎడిటర్‌గా పనిచేస్తున్నారు. ఇక్కడ 2024 నుంచి నేషనల్, సోషల్ మీడియా వైరల్ న్యూస్, క్రైమ్, తెలంగాణ, ఏపీ రాజకీయాలు, ఆస్ట్రాలజీ, లైఫ్  స్టైల్  వ్యవహరాలకు సంబంధించిన వార్తలు రాస్తున్నారు. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో వివిధ రంగాలకు సంబంధించిన వార్తలు అందించారు.

...Read More

Trending News