Ramagiri si strong counter to ap former cm ys jagan Video: ఆంధ్రప్రదేశ్ లో రాజకీయాలు సమ్మర్ లో మరింత హీట్ ను పెంచుతున్నాయి. కూటమి వర్సెస్ వైసీపీగా రాజకీయాలు ఆరోపణలు, ప్రత్యారోపణలతో నిప్పులు రాజేస్తున్నాయి. ఈ క్రమంలో ప్రస్తుతం ఎక్కడ అవకాశం దొరికిన కూడా ఒకరిపై మరోకరు మాటల తూటాలు పేల్చుకుంటున్నారు. ఇదిలా ఉండగా.. మాజీ సీఎం జగన్ ఇటీవల మాట్లాడుతూ.. ఏపీలో అరాచక పాలన నడుస్తుందని కామెంట్లు చేశారు.
కూటమి ప్రభుత్వం ఎన్నికల వేళ ఇచ్చిన హమీలను ప్రశ్నిస్తే తమపై అక్రమ కేసుల్ని బనాయిస్తున్నారని జగన్ తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. అధికారం ఒకరికి మాత్రమే శాశ్వతం కాదని.. వచ్చేది తమ ప్రభుత్వమే నంటూ తెల్చి చెప్పారు. పోలీసులు కొంత మంది తమ టోపీలపై ఉన్న మూడు సింహలకు సెల్యూట్ చేయకుండా.. చంద్రబాబు మెప్పుకొసం చంచాగిరి చేస్తున్నారన్నారు. ఇప్పటికే తమ పార్టీకి చెందిన నేతలు, కార్యకర్తలపై అక్రమ కేసుల్ని బనాయించి, అపోసిషన్ పార్టీల గొంతులు నొక్కుతున్నారన్నారు.
పొలిటికల్ లీడర్ గా మారిన వివాదాస్పద ఎస్ఐ
జగన్.. జాగ్రత్తగా మాట్లాడు ఎవడో వచ్చి బట్టలు ఊడదిస్తా అంటే ఊరుకోం అంటూ వార్నింగ్
ఈయన గారి నిర్లక్ష్యం వల్లే రామగిరిలో గోడవలు, హత్యలు జరిగాయాని ఆరోపిస్తున్న వైసీపీ నేతలు
ఇంత డైరెక్టర్ గా వైసీపీ అధినేత పైనే వార్నింగ్ ఇస్తే ఆ మండలంలో… pic.twitter.com/i9wCOQuUpy
— greatandhra (@greatandhranews) April 9, 2025
ఈ క్రమంలో తాము అధికారంలోకి రాగానే.. వేధింపులకు పాల్పడిన పోలీసులు యూనిఫామ్ ఊడదీసి, న్యాయస్థానం ముందు దోషులుగా నిలబెడతామని పోలీసు శాఖను కించపర్చే విధంగా మాట్లాడారు.ఈ క్రమంలో దీనిపై తాజాగా.. శ్రీసత్య సాయి జిల్లా రామగిరి ఎస్సై సుధాకర్ యాదవ్ కౌంటర్ ఇచ్చారు. జగన్ వ్యాఖ్యల్ని ఖండిస్తు.. పోలీసు శాఖను ఉన్నతంగా భావించి తాము వచ్చామన్నారు. ఎన్నో సవాళ్లు, ఎగ్జామ్ లు, రన్నింగ్ పోటీలు, ఫిజికల్ టెస్ట్ లు పూర్తి చేసుకుని ఖాకీ ఉద్యోగం సంపాదించామని తెలిపాడు.
అసలు.. తమ యూనిఫామ్ ఏమైన అరటి తొక్క అనుకుంటున్నారా..?.. ఊడదీస్తా.. అనుకుంటూ మాట్లాడుతున్నారని జగన్ పై మండిపడ్డారు. నిజాయితీ, నిబద్దతలతో పనిచేస్తున్నామని ఎస్సై కౌంటర్ ఇచ్చారు. తాము ఎలాంటి తప్పుడు పనులు చేయడంలేదని.. ఇలాంటి వివాదాస్పద వ్యాఖ్యలు చేయడం మానుకొవాలని చురకలు పెట్టాడు. తాము ఎలాంటి అడ్డదారులు తొక్కలేదని.. పోలీసుల మనోస్థైర్యాన్ని దెబ్బతీసేలా మాట్లాడితే సహించేది లేదని ఎస్సై మాస్ కౌంటర్ ఇచ్చాడు.ఈ క్రమంలో ఎస్సై మాట్లాడిన వీడియో ప్రస్తుతం నెట్టింట వైరల్గా మారింది.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి









