Real Snake On Shiva lingam: అద్భుతం.. శివలింగాన్ని చుట్టుకుని పడగ విప్పిన నాగుపాము.. ఎక్కడంటే..?

Real Snake spotted on Shiva lingam in nellore:  శివలింగం మీద నాగు పడగ విప్పి కూర్చుంది. దీన్ని చూస్తున్న వారంతా భక్తి పారవశ్యంలో మునిగిపోయారు.ఈ ఘటన ప్రస్తుతం సోషల్ మీడియాలో బాగా వైరల్గా మారింది.  

Written by - Inamdar Paresh | Last Updated : Jan 20, 2026, 02:35 PM IST
  • శివయ్య మీద నాగు పాము..
  • ఏపీలోని నెల్లూరులో ఘటన..
Real Snake On Shiva lingam: అద్భుతం.. శివలింగాన్ని చుట్టుకుని పడగ విప్పిన నాగుపాము.. ఎక్కడంటే..?

Real Snake on Shiva lingam in manubolu nellore: ఇటీవల  పాములు ఎక్కువగా అడవుల్లో నుంచి జనావాసాల్లోకి వస్తున్నాయి. ఎలుకలు, వెచ్చని ఆవాసం కోసం కోబ్రాలు వస్తున్నాయి. దీంతో చాలా మంది పాముల కాటుకు గురౌతున్నారు. చాలా మంది పాములు కన్పిస్తే వెంటనే దూరంగా పారిపోతారు. కానీ మరికొంత మంది మాత్రం కోబ్రాలతో చాలా జాగ్రత్తగా ఉంటారు. అసలు దాని జోలికి పోయేందుకు అస్సలు డేర్ చేయరు. మొత్తంగా నాగు పాములకు చెందిన ఘటనలు తరచుగా వార్తలలో ఉంటాయి. ఈ క్రమంలో ప్రస్తుతం సోమవారం వేళ ఏపీలోనినెల్లూరు జిల్లాలో ఒక అనుకొని ఘటన చోటు చేసుకుంది.

Add Zee News as a Preferred Source

 

పొట్టి శ్రీరాములు జిల్లాలో ఒక భారీ నాగుపాము శివయ్య లింగం మీద చుట్టుకుని పడగవిప్పి కూర్చుంది. మనుబోలు మండలం చెర్లోపల్లి రైల్వేగేటు సమీపంలోని విశ్వనాథుని ఆలయంలో నాగుపాము శివలింగాన్ని చుట్టుకుని దర్శనమిచ్చింది. వెంటనే అక్కడున్న వారంతా ఈ ఘటనను తమఫోన్ లలో రికార్డులు చేశారు.

ఆ తర్వాత నాగుపామును దర్శనం చేసుకునేందుకు చుట్టుపక్కల వారంతా భారీగా అక్కడకు వస్తున్నారు. మరోవైపు ఆ ఆలయం పక్కన భారీగా పుట్ట ఉంది. దానిలో నుంచి నాగుపాము బైటకు వచ్చిందని అక్కడివారు చెప్పుకుంటున్నారు.

Read more: Snake Video: ఓర్నాయనో.. వయ్యారంగా మెలికలు తిరుగుతూ డ్యాన్స్ చేస్తున్న నాగు పాము.. వీడియో వైరల్..

మొత్తంగా  నాగు పాము  శివలింగం మీద దర్శనం ఇవ్వడం మాత్రం నెట్టింట బాగా ట్రెండింగ్ మారింది. మరోవైపు ఈరోజు సోమవారం కావడం, శివయ్య మెడలోని నాగు పాము ఇలాదర్శనం ఇవ్వడం పట్ల భక్తులు భక్తి పారవశ్యంకు గురౌతున్నారు. హరహర మహాదేవ అంటూ స్మరించుకుంటు పులకించిపోతున్నారు.

 

 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

.Twitter, Facebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి

About the Author

Inamdar Paresh

పరేష్ జీ తెలుగు డిజిటల్ మీడియాలో సబ్ ఎడిటర్‌గా పనిచేస్తున్నారు. ఇక్కడ 2024 నుంచి నేషనల్, సోషల్ మీడియా వైరల్ న్యూస్, క్రైమ్, తెలంగాణ, ఏపీ రాజకీయాలు, ఆస్ట్రాలజీ, లైఫ్  స్టైల్  వ్యవహరాలకు సంబంధించిన వార్తలు రాస్తున్నారు. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో వివిధ రంగాలకు సంబంధించిన వార్తలు అందించారు.

...Read More

Trending News