Duvvada Srinivas: దువ్వాడ సస్పెన్షన్ వెనుకాల అసలు కారణం ఇదే.. ఆ కామెంట్స్‌తో పెద్ద దుమారం..!

Duvvada Srinivas Suspension Reason: వైసీపీ ఎమ్మెల్సీ దువ్వాడ పొలిటికల్‌ లైఫ్ క్లోజ్‌ అయ్యింది..! వైసీపీ హైకమాండ్‌ దువ్వాడను సస్పెండ్‌ చేస్తూ సంచలన నిర్ణయం తీసుకుంది..! అయితే ఇన్నాళ్లు పార్టీకి చేయాల్సినంతా డ్యామేజీని దువ్వాడ చేశారు. అయినప్పటికీ వైఎస్‌ జగన్‌ ఊరుకున్నారు. కానీ ఇప్పుడు ఉన్నపళంగా దువ్వాడ శ్రీనివాస్‌ను వైసీపీ అధినేత జగన్‌ ఎందుకు దూరం చేసుకున్నారు..! దీని వెనుక ఉన్న అసలు కథేంటి..!   

Written by - Ashok Krindinti | Last Updated : Apr 26, 2025, 05:05 PM IST
Duvvada Srinivas: దువ్వాడ సస్పెన్షన్ వెనుకాల అసలు కారణం ఇదే.. ఆ కామెంట్స్‌తో పెద్ద దుమారం..!

Duvvada Srinivas Suspension Reason: వైసీపీ ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్‌ రాజకీయాల్లో కంటే.. వ్యక్తిగత అంశాలతోనే ఎక్కువ పాపులారిటీ సంపాదించుకున్నారు. కోట్లు ఖర్చుచేసినా దొరకని ప్రచారం ఆయనను దివ్వెల మాధురి కారణంగా దొరికిపోయింది. అటు భార్య దువ్వాడ వాణి, ఇద్దరు కూతుళ్లు, ఇటు దివ్వెల మాధురి మధ్య గొడవలు.. టీవీ సీరియల్‌ను తలపించాయి. చివరకు దువ్వాడ వాణిని వదిలేసిన దువ్వాడ శ్రీనివాస్‌.. చివరకు దివ్వెల మాధురితోనే ఉంటానంటూ ప్రకటించుకున్నారు. అయితే ఈ ఏపిసోడ్‌తో వైసీపీలో హాట్‌టాపిక్ అయ్యారు దువ్వాడ శ్రీనివాస్‌. ఈ విషయంలో వైసీపీ హైకమాండ్ చూసిచూడనట్టే వ్యవహరించింది. కానీ చాలా రోజుల తర్వాత.. ఉన్నపళంగా దువ్వాడను పార్టీ నుంచి సస్పెండ్‌ చేయడం మాత్రం హాట్‌ టాపిక్‌గా మారింది..

Add Zee News as a Preferred Source

ఇక ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్ వైసీపీలో సీనియర్ లీడర్‌. గత రెండు దశాబ్ధాలుగా సిక్కోలు రాజకీయాల్లో కీలకంగా ఉన్నారు ఆయన.. అందుకే వైఎస్‌ రాజశేఖర్‌ రెడ్డి దువ్వాడ సిక్కోలు జిల్లా జడ్పీ వైఎస్‌చైర్మన్ పదవికి కట్టబెట్టారు. ఆయన తర్వాత జగన్‌ గతంలో మూడు సార్లు టికెట్‌ ఇచ్చి ప్రొత్సహించారు. దీనికి కారణం సిక్కోలు కింజరపు అచ్చెన్నాయుడు కుటుంబ రాజకీయాలను దువ్వాడను తట్టుకుని నిలబడ్డారు. అందుకే ఆయనకు జగన్‌ ఎమ్మెల్సీగా అవకాశం ఇచ్చారని చెబుతుంటారు. అయితే రాజకీయంగా ఎంత పోరాటం చేశారో.. వ్యక్తిగత జీవితంతోనూ అంతే వివాదస్పదం అయ్యారు దువ్వాడ శ్రీనివాస్‌.. కొద్దిరోజుల క్రితం దివ్వెల మాధురి అనే వివాహితతో దువ్వాడ శ్రీనివాస్‌ సహజీవనం చేస్తుండటంతో.. కుటుంబ సభ్యులు నిలదీశారు. దాంతో దువ్వాడ శ్రీనివాస్‌ వారిపై దాడి చేసే ప్రయత్నం చేశారు. దాంతో ఈ వ్యవహారం రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం రేపింది. అప్పట్లో వైసీపీకి దువ్వాడ వ్యవహారం పెద్ద తలనొప్పిగా మారింది. అప్పట్లోనే ఆయన్ను పార్టీలో నుంచి తప్పించాలంటూ సిక్కోలు నేతలు వైఎస్‌ జగన్‌కు ఫిర్యాదు సైతం చేశారు. కానీ జగన్ మాత్రం దువ్వాడ విషయంలో సైలెంట్‌గానే ఉండిపోయారు.. 

కానీ ఆ తర్వాత అలర్ట్ అయినా వైసీపీ హైకమాండ్‌.. దువ్వాడ శ్రీనివాస్‌ను టెక్కలి ఇంచార్జ్‌ బాధ్యతల నుంచి తప్పించింది. ఆయన స్థానంలో పేరాడ తిలక్‌కు టెక్కలి ఇంచార్జ్‌ బాధ్యతలు అప్పగించారు. 2024 పార్లమెంటు ఎన్నికల్లో పోటీచేసిన పేరాడ తిలక్‌ ఎంపీగా ఓటమి పాలయ్యారు. దాంతో టెక్కలి వైసీపీకి ఆయన పెద్దదిక్కులా మారిపోయారు. అప్పటి నుంచి నియోజకవర్గంలో పేరాడ తిలక్ దూకుడు పెంచారు. పార్టీలో కార్యక్రమాలను విస్తృతంగా నిర్వహిస్తూ.. పార్టీలో కీలక పాత్ర పోషిస్తున్నారు. ఈ సమయంలోనే దువ్వాడ శ్రీనివాస్‌ పాలిటిక్స్‌కు కాస్తా విరామం ప్రకటించి మాధురితో కలిసి విహార యాత్రలు చేయడం.. వ్యాపారం చేయడం ప్రారంభించారు. చివరకు హైదరాబాద్‌లో మాధురితో కలిసి బట్టల వ్యాపారం సైతం ప్రారంభించి.. తమ వ్యాపారాన్ని మరింత అభివృద్ధి చేసుకునేందుకు ప్రచారం కూడా మొదలు పెట్టారు.. 

అయితే హైదరాబాద్‌లో వ్యాపారం మొదలు పెట్టాక.. దువ్వాడ శ్రీనివాస్‌ హైదరాబాద్‌కే పరిమితం అయ్యారు. అప్పుడప్పుడు మాత్రమే టెక్కలి వచ్చి వెళ్తున్నారు. దాంతో వైసీపీ కార్యక్రమాల్లో పేరాడ తిలక్, దువ్వాడ వాణి మాత్రమే పాల్గొంటున్నారు. ఈ క్రమంలోనే టెక్కలిలో పర్యటించిన దువ్వాడ శ్రీనివాస్‌ సొంత పార్టీ లీడర్లను ఉద్దేశించి చేసిన కామెంట్స్‌ పెద్ద దుమారాన్నే రేపాయి. పార్టీలో ఎవరేమీ చేసుకున్న నాకు భయం లేదని.. తనకు జగనన్న ఆశీస్సులు మెండుగా ఉన్నాయని అందరిముందు తెగేసి చెప్పారట. దాంతో టెక్కలి క్యాడర్‌ పార్టీ హైకమాండ్‌కే అల్టిమేటం జారిచేసినట్టు తెలిసింది.. దువ్వాడ కావాలో.. తాము కావాలో తేల్చుకోవాలంటూ చెప్పడంతో.. పార్టీ హైకమాండ్‌ను దువ్వాడను సస్పెండ్ చేసినట్టు తెలుస్తోంది.. 

మరోవైపు టెక్కలి నియోజకవర్గంలో దువ్వాడ శ్రీనివాస్‌ గ్రాఫ్‌ పూర్తిగా పడిపోయినట్టు తెలుస్తోంది. ప్రస్తుతం టెక్కలిలో దువ్వాడ వెంట నడిచే లీడర్లు సైతం కనిపించడం లేదట. ఇవన్నీ చూశాకే దువ్వాడపై సస్పెన్షన్ వేటు పడిందనే టాక్‌ వినిపిస్తోంది. మరోవైపు దువ్వాడను పార్టీలో కంటిన్యూ చేస్తే.. మిగతా నాయకులు కూడా దూరమయ్యే అవకాశాలు ఉండటం కూడా మరో కారణంగా చెబుతున్నారు. మొత్తంమీద దువ్వాడ శ్రీనివాస్‌పై వరుస కేసులు, వ్యక్తిగత ఇమేజ్‌ దెబ్బతినడంతో ఆయన పొలిటికల్‌ లైఫ్‌ క్లోజ్‌ అన్న చర్చ జరుగుతోంది. కానీ ఆయనకు ఎమ్మెల్సీగా మరో రెండేళ్లు పదవీకాలం ఉండటంతో.. ఆయన ఏదైనా పార్టీలో చేరొచ్చనే చర్చ సైతం జరుగుతోంది.

Also Read: Pahalgam Animation Video: పహల్గం ఘటన..  ప్రతి ఒక్కర్ని రక్తం మరిగేలా గూస్ బంప్స్ తెప్పిస్తున్న వీడియో ఇదే..

Also Read: Seema Haidar:  భారత్ , పాక్ ల మధ్య ఉద్రిక్తతలు... సంచలన నిర్ణయం తీసుకున్న సీమా హైదర్..  

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

TwitterFacebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.

About the Author

Ashok Krindinti

అశోక్‌ క్రిందింటి జీ తెలుగు డిజిటల్ మీడియాలో సీనియర్ సబ్ ఎడిటర్‌గా పనిచేస్తున్నారు. ఇక్కడ 2022 నుంచి స్పోర్ట్స్, వినోదం, క్రైమ్, రాజకీయ వ్యవహరాలకు సంబంధించిన వార్తలు రాస్తున్నారు. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో వివిధ రంగాలకు సంబంధించిన వార్తలు అందించారు. ఆయనకు జర్నలిజంలో ఏడేళ్లకుపైగా అనుభవం ఉంది.

...Read More

Trending News