Recording dance controversy pithapuram video: ఆంధ్ర ప్రదేశ్ లో ఇటీవల చంద్రబాబు సర్కారు మహిళల భధ్రతకు పెద్దపీట వేసింది.ఈ క్రమంలో మహిళల పరువు, మర్యాదలకు భంగం కలిగే విధంగా ఎవరు వేధించిన కూడా ప్రభుత్వం సీరియస్ గాచర్యలు తీసుకుంటుంది. అదే విధంగా సోషల్ మీడియాలో మహిళలపై పోస్టులు, అడ్డుగోలు రాతలు రాసి కూడా పోలీసుల్ని కఠిన చర్యలు తీసుకొవాల్సిందిగా చంద్రబాబు ఇప్పటికే ఆదేశాలు సైతం జారీ చేశారు.
పవన్ కళ్యాణ్ సైతం.. గతంలో హోంమినిస్ట్రి నా దగ్గర ఉంటే.. సీన్ మరోలా ఉండేదని వ్యాఖ్యలు చేశారు. ఇదిలా ఉండగా.. ప్రస్తుతం ఏపీ డిప్యూటీ సీఎం ఇలాఖాలో.. అమ్మాయిలతో రికార్డింగ్ డ్యాన్స్ లు చేయించడం ప్రస్తుతం రాజకీయంగా కూడా హాట్ టాపిక్ గా మారింది.
జనసేన అధినేత ఇలాకాలో రికార్డింగ్ డాన్సులు
పిఠాపురం నియోజకవర్గం యు.కొత్తపల్లి మండలం మూలపేట గ్రామంలో పోలేరమ్మ అమ్మవారి జాతర సందర్భంగా ఏర్పాటు చేసిన రికార్డింగ్ డాన్సులు.#Pithapuram #PawanKalyan pic.twitter.com/bSQ5qxX1Z5
— Telugu Feed (@Telugufeedsite) March 27, 2025
తాజాగా.. పిఠాపురం నియోజకవర్గం యు.కొత్తపల్లి మండలం మూలపేట గ్రామంలో దాదాపు.. 12 మంది యువతులతో అశ్లీడ డ్యాన్స్ లు చేయించారు. పోలేరమ్మ అమ్మవారి జాతర సందర్భంగా ఏర్పాటు చేసిన రికార్డింగ్ డాన్సులను ఏర్పాటు చేశారు. దీన్ని చూసేందుకు చుట్టుపక్కల గ్రామాల నుంచి పెద్ద ఎత్తున యువత తరలివచ్చారు. జాతరలో అమ్మాయిలు.. యువతను రెచ్చగొట్టేలా అశ్లీల స్టెప్పులు వేస్తు.. మత్తెక్కించే విధంగా వంపు సొంపులతో రెచ్చిపోయారు.
అర్ధరాత్రి వరకు పెద్దగా డీజేలు పెట్టి అశ్లీలంగా ప్రవర్తించారు. ఇంత జరుగుతున్నకూడా పోలీసులు ఆ దిక్కున కనీసం వెళ్లలేదని తెలుస్తొంది. అయితే..దీనిపై స్థానికులు మాత్రం పెద్ద ఎత్తున మండిపడుతున్నారు. అమ్మాయిలు, మహిళలకు మాన ప్రాణాలకు భంగం కలిగే విధంగా ఆస్టెప్పులు ఉన్నాయని అక్కడున్న వాళ్లు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
Read more: Viral Video: వావ్.. బుడ్డోడి ప్రాణాలు కాపాడిన నెమలి.. గూస్ బంప్స్ తెప్పిస్తున్న వీడియో ఇదే..
మరోవైపు ఈ రికార్డింగ్ డ్యాన్స్ అంశం పొలిటికల్ టర్న్ తీసుకుంది. దీనిపై వైసీపీ నేతలు పవన్ తన ఇలాఖాలో ఇలాంటివి జరుగుతుంటే..ఆపలేక పోతున్నాడని.. ఇక ఏపీని ఏం ఉద్దరిస్తాడని కూడా సెటైర్ లు వేస్తున్నారు. మరికొందరు డిప్యూటీ సీఎం సొంత నియోజక వర్గంలో అమ్మాయిలతో ఈ నీచపు స్టెప్పులేంటని మండిపడుతున్నారు. మొత్తంగా ఈ రికార్డింగ్ డ్యాన్స్ ఘటన మాత్రం రాజకీయంగా వివాదాస్పదంగా మారింది.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.Facebook, Twitter









