Rise Survey 2025: ఏపీలో కూటమి ప్రభుత్వానికి ఏడాది పూర్తయిన సందర్భంగా రైజ్ సంస్థ చేపట్టిన సర్వే సంచలన విషయాలు వెల్లడించింది. రాష్ట్రవ్యాప్తంగా 175 అసెంబ్లీ నియోజకవర్గాలు, 25 పార్లమెంట్ నియోజకవర్గాల్లో తాజాగా ఎలాంటి పరిస్థితులు ఉన్నాయో ఈ సర్వే వివరించింది. సంక్షేమం విషయంలో జగన్‌కే ప్రజలు పట్టం కట్టారు.
రైజ్ సంస్థ సర్వే ప్రకారం కూటమి ప్రభుత్వం పనితీరు బాగుందని 52.8 శాతం ప్రజలు అభిప్రాయపడితే 26 శాతం బాగాలేదని, 21,2 శాతం మంది ఫర్వాలేదని తెలిపారు. ఏ ప్రభుత్వం పనితీరు బాగుందనే ప్రశ్నకు కూటమి ప్రభుత్వం పనితీరు 51 శాతంగా, వైసీపీ పనితీరు 38 శాతంగా ప్రజలు అభిప్రాయపడ్డారు. మరో 11 శాతం మంది చెప్పలేమన్నారు. సంక్షేమం విషయంలో మాత్రం ప్రజలు జగన్‌కే ఓటేశారు. సంక్షేమం ఎక్కువగా అందించిన ముఖ్యమంత్రిగా 52 శాతం మంది జగన్ కు ఓటేయగా, చంద్రబాబుకు 48 శాతం పట్టం కట్టారు. ఇక కూటమి ఎమ్మెల్యేల పనితీరు బాగుందని మాత్రం 28 శాతం మందే చెప్పారు. 64 శాతం మంది ఎమ్మెల్యేల పనితీరు బాగాలేదన్నారు. మరో 8 శాతం మంది చెప్పలేమన్నారు.
ఇక ఏ ముఖ్యమంత్రి హయాంలో అభివృద్ధి ఉందనే ప్రశ్నకు 59 శాతం ప్రజలు చంద్రబాబుకు ఓటేస్తే 41 శాతం మంది జగన్ పేరు చెప్పారు. అమరావతిపై ఎక్కువగా దృష్టి పెడుతున్నారని 78 శాతం చెప్పారు. ఇక మంత్రుల పనితీరుపై కూడా రైజ్ సంస్థ సర్వే చేపట్టింది.
చంద్రబాబు, పవన్ కళ్యాణ్, నారా లోకేశ్, నారాయణ, రామానాయుడు, పయ్యావుల కేశవ్ పనితీరు బాగుందని చెబితే కొండపల్లి శ్రీనివాస్, గుమ్మిడి సంధ్యారాణి, కందుల దుర్గేశ్, అనగాలి సత్యప్రసాద్, వంగలపూడి అనిత, నాదెండ్ల మనోహర్, అచ్చెన్నాయుడు, ఆనం రాంనారాయణ రెడ్డి పనితీరు పర్వేలేదని చెప్పారు. ఇక కొల్లు రవీంద్ర, సత్యకుమార్, పార్ధసారధి, బాల వీరాంజనేయస్వామి, గొట్టిపాటి రవి, బీసీ జనార్ధన్ రెడ్డి, సవిత, మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి, వాసంశెట్టి సుభాష్ పనితీరు బాగాలేదన్నారు.
ఏడాది కాలంలోనే ప్రభుత్వంపై అసంతృప్తికి ప్రధానంగా 9 కారణాలున్నాయని రైజ్ సర్వే తెలిపింది. అమరావతి రెండో విడత భూసేకరణ, కక్ష సాధింపులో వైసీపీతో పోటీ, ఆక్వా రైతుల కష్టాలు, సాధారణ రైతుల సమస్యలు, రేషన్ సరఫరాలో మార్పు, ఎమ్మెల్యేల అవినీతి, గ్రామాల్లో కొనుగోలు శక్తి తగ్గడం, ఇసుక దందా, లిక్కర్ పర్సెంటేజీలు, సెటిల్మెంట్లు వంటివి చాలా ఉన్నాయని సర్వేలో తేలింది.
Also read: Tata Punch: 68 వేలు కడితే చాలు టాటా పంచ్ మీ సొంతం, ఎలాగంటే
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu
Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook