Rise Survey: ఏడాదిలో కూటమికి షాక్, కూటమికి చేజారనున్న సీమ, రైజ్ సర్వే

Rise Survey: ఆంధ్రప్రదేశ్‌లో రాజకీయాలు ఆసక్తి రేపుతున్నాయి. కూటమి ప్రభుత్వం వర్సెస్ ప్రతిపక్షం మధ్య వ్యూహాలు, ఆరోపణలు, ప్రత్యారోపణలు చోటు చేసుకుంటున్నాయి. కూటమి ప్రభుత్వం ఏడాది పాలన నేపధ్యంలో రైజ్ సంస్థ సర్వేలో ఆసక్తికర అంశాలు వెలుగు చూశాయి. 

Written by - Md. Abdul Rehaman | Last Updated : Jun 16, 2025, 01:23 PM IST
Rise Survey: ఏడాదిలో కూటమికి షాక్, కూటమికి చేజారనున్న సీమ, రైజ్ సర్వే

Rise Survey: ఏపీలో కూటమి ప్రభుత్వానికి ఏడాది పూర్తయింది. సూపర్ సిక్స్ హామీలో తొలి ఏడాది ఒక పధకమే అమలు చేయగా ఇటీవల రెండో పధకం ప్రారంభించింది. ఈ క్రమంలో ప్రభుత్వ పనితీరు ఎలా ఉంది, వ్యతిరేకత ఎంత వరకు ఉందనే విషయాలపై రైజ్ సంస్థ సర్వే నిర్వహించింది. ఈ సర్వే ఫలితాలు కూటమి ప్రభుత్వానికి షాక్ ఇస్తున్నాయి. 

Add Zee News as a Preferred Source

ఏపీలో కూటమి ప్రభుత్వంపై వ్యతిరేకత పెరుగుతోందని ప్రతిపక్షం వైసీపీ అధినేత వైఎస్ జగన్ పదే పదే చెబుతున్నారు. మరోవైపు కూటమి ప్రభుత్వం ప్రతిపక్షాన్ని ఇరుకునపెట్టే వ్యూహాలు రచిస్తోంది. ఏడాది కాలంలో కూటమి ఎమ్మెల్యేల పనితీరుపై రైజ్ సంస్థ చేసిన సర్వేలో ఆసక్తికర అంశాలు వెలుగు చూశాయి. 2024కు భిన్నమైన పరిస్థితులు ఏర్పడినట్టు సర్వే తెలిపింది. ముఖ్యంగా రాయలసీమలో జరిపిన సర్వే వివరాలు అందించింది. రాష్ట్రవ్యాప్తంగా అన్ని జిల్లాల్లో సర్వే చేస్తున్నా రాయలసీమ ఫలితాలు ముందుగా విశ్లేషించింది. వైసీపీ కంచుకోటగా భావించే రాయలసీమలోని నాలుగు ఉమ్మడి జిల్లాల్లో 2019లో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కేవలం మూడు సీట్లకు పరిమితం కాగా 2024లో సీన్ రివర్స్ అయింది. వైసీపీ బలం గణనీయంగా తగ్గింది. పులివెందుల, బద్వేల్, రాజంపేట, మంత్రాలయం, తంబళ్లపల్లి, పుంగనూరు మొత్తం ఆరింట మాత్రమే విజయం సాధించింది. 

అయితే ఇప్పుడు రైజ్ సంస్థ చేసిన తాజా సర్వేలో సీన్ పూర్తిగా రివర్స్ కన్పిస్తోంది. రాయలసీమలో అత్యధికంగా 33 మంది ఎమ్మెల్యేలపై వ్యతిరేకత స్పష్టంగా ఉందని రైజ్ సంస్థ అభిప్రాయపడింది. కూటమి ఎమ్మెల్యేలకు రాయలసీమలో 2029లో కష్టమేనని రైజ్ సంస్థ తేల్చింది. రెడ్ జోన్‌లో నలుగురు మంత్రులున్నారని రైజ్ సంస్థ తెలిపింది. తొలిసారి ఎన్నికైన 90 శాతం కూటమి ఎమ్మెల్యేలపై అవినీతి ఆరోపణలు ఉన్నాయని తేలింది. చిత్తూరు పార్లమెంట్ పరిధిలో కుప్పం, పలమనేరు తప్పించి మిగిలిన స్థానాలను కూటమి ప్రభుత్వం మర్చిపోవడం మంచిదని సర్వేలో తేలింది. అనంతపురం అర్బన్ ఎమ్మెల్యేపై తీవ్రస్థాయిలో వ్యతిరేకత ఆరోపణలు ఉన్నట్టు తేలింది. 

క్షేత్రస్థాయిలో ఎమ్మెల్యేల పనితీరుపై వస్తున్న సర్వే నివేదిక ఫలితాలు కూటమి ప్రభుత్వానికి షాక్ ఇస్తున్నాయి. కొందరు ఈ ఫలితాలను కొట్టిపారేస్తుంటే, మరి కొందరు అలర్ట్ అవుతున్నారు. ముఖ్యంగా ఎస్సీ నియోజకవర్గాలు వైసీపీ వైపు ఉన్నట్టు సర్వేలో తేలింది. 

Also read: AP Super Six Guarantees: మహిళలకు సూపర్ గుడ్‌న్యూస్, ఏపీలో త్వరలో నెలకు 1500 రూపాయలు

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.     

Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu     

Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

About the Author

Trending News