)
RK Roja Ends Politics: సంచలనాలకు.. వివాదాలకు కేంద్రంగా నిలిచే ఫైర్‌బ్రాండ్ ఆర్కే రోజా కొంతకాలంగా రాజకీయాలకు దూరంగా ఉంటున్నారు. సినీ రంగం నుంచి రాజకీయాల్లోకి ప్రవేశించిన ఆమె మళ్లీ వినోదం వైపు చూస్తున్నట్లు తెలుస్తోంది. రాజకీయాల కన్నా వినోద రంగంలో రోజాకు విశేష గుర్తింపు లభించింది. ఈ క్రమంలోనే ఆమె రాజకీయాల నుంచి దాదాపుగా నిష్క్రమిస్తున్నట్లు చర్చ జరుగుతోంది. ఉన్నఫలంగా ఈ చర్చకు దారి తీసిన పరిస్థితులు ఏమిటి? అసలు ఏం జరిగిందో తెలుసుకుందాం.
సినీ రంగంలో ఎన్నో సినిమాలు చేసిన ఆర్కే రోజా సెల్వమణి అనంతరం బుల్లి తెరపై సందడి చేస్తుండేవారు. పలు ప్రముఖ టీవీ ఛానల్స్‌లో షోలు.. కార్యక్రమాలు చేస్తూ ఫుల్ బిజీగా కొనసాగారు. అలా కొనసాగుతూనే రాజకీయాల్లో కూడా చాలా బిజీగా ఉండేవారు. తెలుగుదేశం పార్టీలో చేరి ఫైర్ బ్రాండ్‌గా ముద్ర వేసుకుని రాజకీయాల్లో చాలా చురుగ్గా ఉండేవారు. 2004, 2009లో టీడీపీ నుంచి పోటీ చేసి రెండుసార్లు ఓడిపోయారు. అనంతరం కాంగ్రెస్ పార్టీలో చేరిన ఆమె వైఎస్సార్ మరణానంతరం వైఎస్ జగన్ స్థాపించిన వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరారు. 2014, 2019లో వరుసగా రెండు సార్లు నగరి నుంచి గెలుపొందారు.
ప్రతిపక్షంలో.. అధికార పక్షంలో ఉన్న ఆర్కే రోజా సంచలనాలకు కేంద్రంగా ఉన్నారు. మంత్రిగా కొన్నేళ్లు పని చేసిన ఆమె 2024లో జరిగిన ఎన్నికల్లో నగరి నుంచి ఓడిపోయారు. అంతేకాకుండా ఆమె పార్టీ కూడా అధికారం కోల్పోవడంతో రోజాకు ఇబ్బందులు ఎదురయ్యాయి. తన ప్రసంగాలు.. వ్యాఖ్యలు ఆమెను రాజకీయంగా ఎంత పైకి తీసుకువచ్చాయో ఇప్పుడు అంత చేటు చేసే అవకాశం ఉంది. ప్రస్తుతం అధికారం కోల్పోవడంతో ఆమె రాజకీయంగా కొంత వెనక్కి తగ్గినట్లు కనిపిస్తోంది.
ఏపీలో అధికారంలోకి వచ్చిన చంద్రబాబు ప్రభుత్వం రోజాపై ప్రతీకార చర్యలకు దిగుతుందనే ప్రచారం జరుగుతోంది. టీడీపీ అగ్ర నాయకత్వాన్ని.. పవన్ కల్యాణ్‌ను నాడు మంత్రిగా.. అధికార పార్టీ ఎమ్మెల్యేగా రోజా తీవ్ర పదజాలంతో విమర్శలు చేశారు. అసెంబ్లీలో కూడా ఆమె దూషణలకు దిగారు. వాటన్నింటిని గుర్తుంచుకున్న ఎన్డీయే ప్రభుత్వం ఇప్పుడు రోజాపై చర్యలు తీసుకునే అవకాశం లేకపోలేదు. ఇప్పటికే రెడ్ బుక్ ఏపీ రాజకీయాల్లో సంచలనంగా మారగా.. ఆ రెడ్ బుక్‌లో రోజా పేరుందని.. ఆమెపై తీవ్ర చర్యలకు ప్రభుత్వం దిగబోతుందని చర్చ జరుగుతోంది. ఇప్పటికే సీఐడీకి రోజా అవినీతిపై ఫిర్యాదులు వెళ్లాయి. ఆమె అవినీతికి పాల్పడ్డారని ఎన్డీయే ప్రభుత్వం ఆరోపిస్తోంది. ఈ నేపథ్యంలో త్వరలో రోజాను అరెస్ట్ చేస్తారని టీడీపీ వర్గాలు ఆశాభావంతో ఉన్నారు.
రాజకీయంగా ఇబ్బందులు ఎదురయ్యే అవకాశం ఉండడంతో మాజీ మంత్రి రోజా ప్రస్తుతం వెనక్కి తగ్గినట్లు కనిపిస్తోంది. ఇప్పటికే పార్టీ కార్యక్రమాలకు కొంత దూరమైన ఆమె వీలైనంత హైదరాబాద్‌లోనే ఉంటున్నారు. దీనికితోడు నగరిలో ఆమెకు వ్యతిరేకంగా మరో గ్రూపు తయారవుతోందనే ప్రచారం జరుగుతోంది. సొంత పార్టీలోనే పెద్ద నాయకుడు నగరిపై పట్టు సాధించేందుకు ఇప్పటికే ప్రయత్నాలు మొదలుపెట్టారు.
పార్టీపరంగా.. ప్రభుత్వపరంగా ఇబ్బందులు ఎదురవుతుండడంతో రాజకీయాలను వదిలేసి తనకు కలిసివచ్చిన వినోద రంగం వైపు రోజా మరోసారి వెళ్తున్నారు. ఇప్పటికే ఓ ఛానల్‌కు సంబంధించిన కార్యక్రమంలో రోజా జడ్జిగా వ్యవహరించేందుకు అంగీకరించారు. ఆ కార్యక్రమంలో త్వరలో బుల్లితెరపై ప్రసారం కానుంది. గతంలో రాజకీయాలు.. వినోద రంగాన్ని సమన్వయం చేసుకుంటూ వెళ్లిన రోజా ఇకపై తనకు జీవితాన్ని ఇచ్చిన వినోద రంగాన్ని వదలరని తెలుస్తోంది.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి