Rk Roja On Pawan Kalyan: నీ కొడుక్కి అందుకే అలా జరిగింది..!.. పవన్‌పై రోజా షాకింగ్ కామెంట్స్... ఏపీ రాజకీయాల్లో దుమారం..

Rk roja controversy on ttd goshala: తిరుమలలో గోశాలలో ఇటీవల చాలా గోవులు చనిపోతున్న కూడా టీటీడీ పట్టించుకోవడంలేదని వైసీపీ మాజీ మంత్రి ఆర్కే రోజా మండిపడ్డారు.  అదే విధంగా తిరుమలలో ఇన్ని అపచారాలు జరుగుతున్న కూడా కూటమి ప్రభుత్వం అస్సలు మాట్లాడట్లేదని అన్నారు.

Written by - Inamdar Paresh | Last Updated : Apr 17, 2025, 04:53 PM IST
  • రోజా కాంట్రవర్సీ వ్యాఖ్యలు..
  • మండిపడుతున్న జనసేన నేతలు..
Rk Roja On Pawan Kalyan: నీ కొడుక్కి అందుకే అలా జరిగింది..!.. పవన్‌పై రోజా షాకింగ్ కామెంట్స్... ఏపీ రాజకీయాల్లో దుమారం..

Rk roja comments on pawan kalyan son markshankar: ఏపీ రాజకీయాల్లో ప్రస్తుతం తిరుమల గోశాల ఆవుల వివాదం పెనుదుమారంగా మారింది. తిరుమలలో గోశాలలో చాలా ఆవులు చనిపోయాయాని ఏకంగా టీటీడీ మాజీ చైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి ఆరోపణలు గుప్పించారు. దీంతో తిరుమల వివాదం మరోసారి వార్తలలో నిలిచింది.ఈ క్రమంలో మాజీ మంత్రి ఆర్కే రోజా సైతం.. దీనిపై కూటమి సర్కారుపై తీవ్రమైన ఆరోపణలు చేశారు.

Add Zee News as a Preferred Source

సనాతన ధర్మంఅంటూ దేశ మంతట తిరుగుతున్న పవన్ కళ్యాణ్ తిరుమలలో ఇన్ని అపచారాలు జరుగుతుంటే ఎందుకు మాట్లాడట్లేదని అన్నారు. మీకు ప్యాకేజీలు, పదవులు ఇస్తే.. మిన్నకుండా ఉంటారా..అంటూ ఏకీపారేశారు. కలియుగ దైవం వెంకటేశ్వర స్వామి దగ్గర తప్పులు ఎవరు చేసిన వారిపై కేసులు పెట్టాలని, కఠినంగా పనిష్మెంట్ చేయాలన్నారు.

అదే విధంగా కలియుగ దైవం, భక్తుల కొంగుబంగారమైన తిరుమల శ్రీవారితో గతంలో చంద్రబాబు పెట్టుకుంటే.. ఏమైందో ఆయనకు బాగా తెలుసని సెటైర్ లు వేసింది. అదే విధంగా ఇటీవల పవన్ కళ్యాణ్ సైతం.. కాస్తంత రుచిచూశాడన్నారు.  అందుకే తిరుమల శ్రీవారితో పెట్టుకొవద్దని మాజీ మంత్రి రోజా హితవు పలికారు. అదేవిధంగా తిరుమలలో జరుగుతున్న అపచారాలు, గోశాలలో ఆవులు చనిపోతున్న ఘటనపై సమగ్ర విచారణ జరిపించి.. బాధ్యులపై చర్యలు తీసుకొవాలని రోజా డిమాండ్ చేశారు.

ఈ నేపథ్యంలో రోజా ఏకంగా పవన్ కళ్యాణ్ కొడుకు మార్క్ శంకర్  పై ఇండైరెక్ట్ గా చేసిన వ్యాఖ్యలు ఏపీ రాజకీయాల్లో దుమారంగా మారాయి. దీనిపై కూటమి నేతలు మండిపడుతున్నారు. అన్యం పున్యం ఎరుగటి పసివాడిపై కామెంట్లు ఏంటని కూడా మండిపడుతున్నారు.

Read more: Vijaya Shanthi: అన్న లెజినోవా గుండుపై భీభత్సంగా ట్రోల్స్‌.. సంచలన వ్యాఖ్యలు చేసిన విజయశాంతి !

మరోవైపు సోషల్ మీడియా వేదికంగా జనసైనికులు రోజా వ్యాఖ్యల పట్ల శివాలెత్తిపోతున్నారు. అది నోరా.. లేదా తాడి మట్టా అంటూ మండిపడుతున్నారు. మాజీ మంత్రి ఆర్కే రోజా చేసిన వ్యాఖ్యలపై జనసేన నేతలు సైతం సీరియస్ గా స్పందిస్తున్నారు. పసివాడి గురించి ఇంత నీచంగా మాట్లాడాలా.. అంటూ రోజాపై సెటైర్ లు వేస్తున్నారు. 

మరోవైపు సింగపూర్ లో స్కూల్లో అగ్ని ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన పవన్ తనయుడు మార్క్ శంకర్ ఇప్పుడిప్పుడు కోలుకుంటున్నాడు. అదే విధంగా పవన్ సతీమణి అన్నాలెజినొవా తిరుమలకు వెళ్లి స్వామివారికి తలనీలాలు సమర్పించి, గండం గట్టేక్కించినందుకు ప్రత్యేకంగా మొక్కులు కూడా తీర్చుకున్నారు. 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.FacebookTwitter

About the Author

Inamdar Paresh

పరేష్ జీ తెలుగు డిజిటల్ మీడియాలో సబ్ ఎడిటర్‌గా పనిచేస్తున్నారు. ఇక్కడ 2024 నుంచి నేషనల్, సోషల్ మీడియా వైరల్ న్యూస్, క్రైమ్, తెలంగాణ, ఏపీ రాజకీయాలు, ఆస్ట్రాలజీ, లైఫ్  స్టైల్  వ్యవహరాలకు సంబంధించిన వార్తలు రాస్తున్నారు. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో వివిధ రంగాలకు సంబంధించిన వార్తలు అందించారు.

...Read More

Trending News