YS Jagan: జగన్‌కు మరో బిగ్ షాక్.. ఆ ఇద్దరు సీనియర్లు రాజీనామాకు సిద్ధం..?

AP Politics: ఆంధ్రప్రదేశ్‌లో వైసీపీకి షాక్‌ల మీద షాక్‌లు తగులుతున్నాయి..! ఫ్యాన్ పార్టీకి కీలక నేతలంతా గుడ్‌బై చెబుతున్నారు..! తాజాగా ఎమ్మెల్సీ మర్రి రాజశేఖర్‌ వైసీపీకి గుడ్‌బై చెప్పారు.. ఇప్పుడు ఆయన బాటలోనే మరికొందరు నేతలు పయనిస్తున్నారా..! సిక్కోలులో ఓ వెలుగు వెలిగిన ఆ ఇద్దరు మాజీ మంత్రులు.. జగన్‌కు షాక్ ఇచ్చేందుకు సిద్దమయ్యారా..! ఇంతకీ ఎవరా ఆ ఇద్దరు నేతలు..!   

Written by - Ashok Krindinti | Last Updated : Mar 22, 2025, 02:59 PM IST
YS Jagan: జగన్‌కు మరో బిగ్ షాక్.. ఆ ఇద్దరు సీనియర్లు రాజీనామాకు సిద్ధం..?

AP Politics: వైసీపీ అధినేత వైఎస్‌ జగన్‌కు సొంత పార్టీ నేతలు వరుస షాక్‌లు ఇస్తున్నారు. ఒకరి తర్వాత మరొకరు అన్నట్టు నేతలంతా ఫ్యాన్‌ పార్టీకి గుడ్‌ బై చెబుతున్నారు. తాజాగా వైసీపీకి ఎమ్మెల్సీ మర్రి రాజశేఖర్‌ గుడ్‌బై చెప్పేశారు. ఆయన తన ఎమ్మెల్సీ పదవితో పాటు.. పార్టీ సభ్యత్వాన్ని వదులుకున్నారు. ఇప్పుడు ఆయన దారిలోనే సిక్కోలుకు చెందిన మాజీ మంత్రులు ధర్మాన ప్రసాదరావు, మాజీ స్పీకర్‌  తమ్మినేని సీతారామ్‌ వైసీపీకి వీడేందుకు రెడీ అయ్యారని ప్రచారం సాగుతోంది. గత వైసీపీ ప్రభుత్వంలో ధర్మాన ప్రసాదరావు మంత్రిగా ఓ వెలుగు వెలిగారు. ఆయన కీలక శాఖలను నిర్వహించారు. మరోవైపు తమ్మినేని సీతారామ్‌ కూడా స్పీకర్‌గా జగన్‌కు అన్ని విధాల అండగా నిలిచారు. కానీ గత అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి తర్వాత.. ఈ ఇద్దరు నేతలు ఒక్కసారిగా సైలెంట్‌ అయ్యారు.. 
 
మాజీ మంత్రి ధర్మాన ప్రసాద రావు కొద్దిరోజులుగా వైసీపీతో అంటిముట్టనట్టు వ్యవహరిస్తున్నారు. గత వైసీపీ ప్రభుత్వంలో మంత్రిగా సేవలందించిన ధర్మాన ప్రసాద రావు.. ఇప్పుడు పార్టీ కార్యక్రమాలకు దూరం పాటిస్తున్నారు. అప్పట్లో ఎన్నికల్లో ఓటమి నుంచి తేరుకోలేదు.. ఆ కారణంగానే పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉంటున్నారని అంతా భావించారు. కానీ ఎన్నికలు ముగిసి దాదాపు ఏడాది కావొస్తున్న ఆయన మౌన వ్రతం వీడటం లేదు. ఇటీవల సిక్కోలు నేతలతో వైఎస్‌ జగన్ సమావేశం నిర్వహించారు. ఆ తర్వాత ఉత్తరాంధ్ర రీజినల్ కో ఆర్డినేటర్ బాధ్యతలను మాజీమంత్రి కన్నబాబుకు అప్పగించారు. ఆయన బాధ్యతలు స్వీకరించగానే ఉత్తరాంధ్ర నేతలందరితో వరుస భేటీలు నిర్వహించారు. ఈ సమావేశానికి సైతం ధర్మాన డుమ్మా కొట్టారు. దాంతో ఆయన ఇకమీదట కూడా పార్టీ కార్యక్రమాలకు రాకపోవచ్చనే టాక్ వినిపిస్తోంది.. 
 
మరోవైపు తమ్మినేని సీతారామ్‌ కూడా పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉంటున్నారు. ఇటీవల అముదాలవలస వైసీపీ ఇంచార్జ్‌గా చింతాడ రవికుమార్‌కు బాధ్యతలు అప్పగించారు. దాంతో నారజ్‌ అయినా తమ్మినేని పార్టీ కార్యక్రమాల్లో అస్సలు పాల్గొనడం లేదు. సిక్కోలు రాజకీయాల్లో దాదాపు మూడు, నాలుగు దశాబ్ధాలుగా కీలకపాత్ర పోషించినా తమ్మినేనిని ఉన్నపళంగా ఇంచార్జ్‌ బాధ్యతల నుంచి తప్పించడంతో ఆయన తీవ్ర అసంతృప్తితో రగిలిపోతున్నట్టు ప్రచారం సాగుతోంది. అయితే ఇప్పుడు ఈ ఇద్దరు నేతలు బీజేపీతో టచ్‌లోకి వెళ్లినట్టు ప్రచారం సాగుతోంది.
 
ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్‌లో మరింత విస్తరించేందుకు బీజేపీ పావులు కదుపుతోంది. ఈ నేపథ్యంలో సిక్కోలు లీడర్లు కమలం పార్టీలోకి టచ్‌లోకి వెళ్లారట. దాంతో వారిని చేర్చుకునేందుకు పార్టీ హైకమాండ్‌ గ్రీన్ సిగ్నల్‌ ఇచ్చినట్టు సమాచారం. పార్టీలో చేరికపై ఇప్పటికే పార్టీ చీఫ్‌ పురంధేశ్వరి వీరితో చర్చలు కూడా పూర్తి చేసినట్టు సమాచారం. అయితే గతంలో వైఎస్ జగన్‌కు వీరవిదేయులుగా ఉన్న ఈ ఇద్దరు నేతలు.. ఇప్పుడు.. సడెన్‌గా పార్టీ మారాలనే నిర్ణయం వెనుక.. మాజీఎంపీ విజయసాయిరెడ్డి ఉన్నట్టు ప్రచారం సాగుతోంది. ఇటీవలే వైసీపీకి రాజీనామా చేసిన విజయసాయిరెడ్డి..త్వరలోనే కమలం పార్టీ కండువా కప్పుకుంటారని అంటున్నారు. ఆయనతో పాటు.. ఈ ఇద్దరు నేతలు కూడా కమలం పార్టీలో చేరుతారని చెబుతున్నారు.. మొత్తంగా ఏపీలో వైసీపీ టార్గెట్‌గా బీజేపీ ఆపరేషన్‌ కొనసాగుతోందనే టాక్‌ బలంగా వినిపిస్తోంది.. 

Add Zee News as a Preferred Source

Also Read: Bandi Sanjay: అధ్యక్ష రేసులో లేను.. చెన్నైలో జరిగేది దొంగల ముఠా సభ .. బండి సంజయ్ సంచలన వ్యాఖ్యలు..

Also Read: Delimitation: నియోజకవర్గాల పునర్విభజనపై జగన్ స్టాండ్ ఇదే, ప్రదాని మోదీకు లేఖ

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

TwitterFacebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.

About the Author

Ashok Krindinti

అశోక్‌ క్రిందింటి జీ తెలుగు డిజిటల్ మీడియాలో సీనియర్ సబ్ ఎడిటర్‌గా పనిచేస్తున్నారు. ఇక్కడ 2022 నుంచి స్పోర్ట్స్, వినోదం, క్రైమ్, రాజకీయ వ్యవహరాలకు సంబంధించిన వార్తలు రాస్తున్నారు. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో వివిధ రంగాలకు సంబంధించిన వార్తలు అందించారు. ఆయనకు జర్నలిజంలో ఏడేళ్లకుపైగా అనుభవం ఉంది.

...Read More

Trending News