YS Jagan: వైఎస్‌ జగన్‌కు మరో కీలక నేత ఝలక్..? త్వరలో జనసేనలోకి జంప్..!

AP Politics: వైసీపీ అధినేత వైఎస్‌ జగన్‌కు మరో షాక్ తగలబోతోందా..! తూర్పుగోదావరి జిల్లాలో ఓ వైసీపీ కీలక నేత పార్టీ వీడేందుకు రెడీ అయ్యారా..! ప్రస్తుతం ఎమ్మెల్సీగా ఉన్న ఆయన.. వీలైనంత త్వరగా జనసేన కండువా కప్పుకోవాలని భావిస్తున్నారా..! ఇటీవల పవన్‌ కల్యాణ్‌ను కలిసిన ఆయన.. పార్టీలో చేరిక విషయమై చర్చలు జరిపారు.. రేపోమాపో ఆయన జనసేన కండువాల కప్పుకోవడం ఖాయమా..!  

Written by - Ashok Krindinti | Last Updated : Mar 26, 2025, 07:36 PM IST
YS Jagan: వైఎస్‌ జగన్‌కు మరో కీలక నేత ఝలక్..? త్వరలో జనసేనలోకి జంప్..!

AP Politics: ఆంధ్రప్రదేశ్‌లో వైసీపీకి రోజుకో నేత గుడ్‌ బై చెబుతున్నారు. ఫ్యాన్‌ పార్టీ అధికారం ఉన్నన్నీ రోజులు అధికారం చెలయించినా నేతలు.. ఇప్పుడు ప్రతిపక్షంలోకి రాగానే.. తిరిగి అధికార పార్టీలోకి జంపింగ్‌ కొడుతున్నారు. ముఖ్యంగా వైసీపీని వీడుతున్న వారిలో ఎమ్మెల్సీలే ఎక్కువగా ఉన్నారు. ఇప్పటికే ఐదుగురు ఎమ్మెల్సీలు వైసీపీని వీడారు. మొదట నలుగురు నేతలు పార్టీ మారితే.. ఇటీవల పల్నాడు జిల్లా చిలకలూరీపేటకు చెందిన వైసీపీ ఎమ్మెల్సీ మర్రి రాజశేఖర్‌ వైసీపీకి గుడ్‌బై చెప్పారు. వైఎస్‌ జగన్‌ తనకు గతంలో ఇచ్చిన ఏ ఒక్క హామీని  నిలబెట్టుకోలేదని.. అందుకే ఫ్యాన్ పార్టీకి గుడ్‌ బై చెబుతున్నట్టు ప్రకటించారు. అంతలోపే మరో నేత వైసీపీని వీడేందుకు రెడీ అయ్యారని ప్రచారం సాగుతోంది. తూర్పు గోదావరి జిల్లా రామచంద్రాపురానికి చెందిన సీనియర్‌ వైసీపీ లీడర్‌ తోట త్రిమూర్తులు పార్టీ వీడేందుకు రెడీ అయ్యారని టాక్‌ వినిపిస్తోంది.. 
 
తోట త్రిమూర్తులు వైసీపీలో సీనియర్‌ లీడర్‌. గతంలో టీడీపీలో కొనసాగిన ఆయన.. 2019 ఎన్నికల్లో వైసీపీ అధికారంలోకి రాగానే ఆయన పార్టీ మారారు.. 1994లో తొలిసారి రామచంద్రాపురం నుంచి ఎమ్మెల్యేగా గెలిచారు ఆయన.. ఆ తర్వాత అనేక సార్లు రామచంద్రాపురం నుంచి ఎమ్మెల్యేగా విజయం సాధించారు. కానీ ఆయన ఎమ్మెల్యే అయ్యాక.. అన్ని పార్టీల్లోనూ చేరి రికార్డు సృష్టించారు. గతంలో ప్రజారాజ్యం, కాంగ్రెస్‌, టీడీపీ, వైసీపీ ఇలా అన్ని పార్టీలోనూ పనిచేసిన అనుభవం సంపాదించుకున్నారు. అయితే 2019 ఎన్నికల్లో వైసీపీ అధికారంలోకి రాగానే.. వైఎస్‌ జగన్‌ ఆయనకు ఎమ్మెల్సీగా అవకాశం కల్పించడంతో.. ప్రస్తుతం ఎమ్మెల్సీగా కంటిన్యూ అవుతున్నారు.. 
 
అయితే ఇన్ని పార్టీలు మారినా.. ఆయన కోరిక మాత్రం నెరవేరలేదని అసంత్రప్తి ఆయనలో కనిపినిస్తోంది. ఆయన మంత్రి కావాలని చాలా రోజులుగా ఆశగా ఎదురుచూస్తున్నారు. అలాగే తన కుమారుడిని రాజకీయ వారుసుడికి కూడా ఎమ్మెల్యేను చేయాలని భావిస్తున్నారు. కానీ ఈ రెండు కోరికలు నెరవేరడం లేదు.. దాంతో ఆయన పార్టీ మారాలని డిసైడ్‌ అయినట్టు ప్రచారం సాగుతోంది. అయితే గతంలో టీడీపీలో కొనసాగిన ఆయన.. ఇప్పుడు తన అదృష్టాన్ని జనసేన పార్టీలో  చేరి పరీక్షించుకోవాలని భావిస్తున్నారని సమాచారం. అందుకే ఇటీవల అసెంబ్లీలో పవన్‌ను కలిసి తన మనసులో మాట డిప్యూటీ సీఎంతో చెప్పినట్టు ప్రచారం సాగుతోంది. 
 
ఇటీవల ఏపీ బడ్జెట్‌ సమావేశాల సందర్భంగా ఎమ్మెల్సీ తోట త్రిమూర్తులు.. పవన్‌ కల్యాణ్‌తో సన్నిహితంగా మెలిగారు. అంతేకాదు.. పవన్‌కల్యాణ్‌తో కలిసి ఓ ఫోటో దిగారు.. దాంతో తోట త్రిమూర్తులు పార్టీ మారడం ఖాయమైందని టాక్ ఊపందుకుంది. పార్టీ మారే ఆలోచనలో భాగంగానే.. ఆయన పవన్‌ కల్యాణ్‌తో సన్నిహితంగా ఉన్నారని అనుచరులు సైతం గుసగుసలాడుకుంటున్నారు. అయితే తోట త్రిమూర్తులు జనసేన పార్టీలోకి వెళ్లడం వెనుక బలమైన కారణమే ఉందంటున్నారు అనుచరులు.. ప్రస్తుతం గోదావరి జిల్లాల్లో జనసేన పార్టీ రోజురోజుకు బలోపేతం అవుతోంది. అలాగే కాపు సామాజికవర్గం మొత్తం పవన్‌ వెంటే నడుస్తున్నారు. దాంతో త్రిమూర్తులు కూడా తన సామాజికవర్గం ఆలోచనకు తగ్గట్టుగా జనసేనలో చేరి.. మరోసారి వారి మద్దతు కూడగట్టుకోవాలని లెక్కలు వేసుకుంటున్నారట. అందుకే ఆయన వైసీపీకి గుడ్‌బై చెప్పేందుకు రెడీ అయ్యారని అంటున్నారు.. 
 
మరోవైపు తోట త్రిమూర్తులు వ్యవహారం వైసీపీలో ఇప్పుడు హాట్‌టాపిక్‌ అయ్యింది. ఇటీవల ఆయన మాజీమంత్రి, ఎమ్మెల్సీ  యనమల రామకృష్ణుడి పదవి కాలాన్నీ మరోసారి కంటిన్యూ  చేయాలని కోరడం చర్చనీయాంశం అయ్యింది. వైసీపీ ఎమ్మెల్సీగా ఉన్న ఈయన.. టీడీపీకి చెందిన యనమల పదవీకాలన్నీ పొడగించాలని కోరడంతో రెండు పార్టీల నేతలు ఉలిక్కిపడ్డారు. ఇదిలా ఉంటే.. తోట త్రిమూర్తులు పార్టీ మారే ఆలోచన వెనుక జనసేన నేత సామినేని ఉదయబాను కూడా ఉన్నారని ప్రచారం సాగుతోంది. సామినేని ఉదయభానుకు తోట త్రిమూర్తులు వియ్యంకుడు కావడంతో ఆయన కూడా ఒత్తిడి చేస్తున్నారని టాక్‌. ఇక్కడే మరో టాక్ సైతం వినిపిస్తోంది. ప్రస్తుతం వైసీపీని వీడిన ఎమ్మెల్సీల రాజీనామాలను మండలి చైర్మన్ మోషేన్ రాజు ఆమోదించలేదు.. వారంతా తమ రాజీనామాలను ఆమోదించాలని కోరినా ఆయన స్పందించడం లేదు. దాంతో వారంతా పరేషన్ అవుతున్నారు. 
 
మొత్తంమీద తోట త్రిమూర్తులు ఎమ్మెల్సీ పదవీకాలం మరో రెండున్నరేళ్లు ఉంది. ఇప్పుడు ఎమ్మెల్సీ పదవికి గుడ్‌ బై చెబితే.. తిరిగి తనకు మరోసారి ఎమ్మెల్సీగా అవకాశం ఇవ్వాలని జనసేన అధినేతను ఆయన కోరారట. అలాగే వచ్చే ఎన్నికల్లో తన కొడుకుకు రామచంద్రాపురం ఎమ్మెల్యే టికెట్‌ విషయంలో క్లారిటీ ఇవ్వాలని కోరుతున్నారట. ఈ రెండు హామీలు ఇస్తే.. వెంటనే జనసేనలో చేరేందుకు ఎలాంటి అభ్యంతరం లేదని అంటున్నారట. అయితే ఈ విషయంలో పవన్‌ కల్యాణ్‌ ఏటు తేల్చలేదని సమాచారం. అయితే ఆయన ఓకే అనగానే కండువా మార్చేందుకు త్రిమూర్తులు రెడీ అవుతున్నట్టు ప్రచారం సాగుతోంది.

Add Zee News as a Preferred Source

Also Read: RC 16 First Pre Look: రామ్ చరణ్ బర్త్ డే ట్రీట్ రెడీ.. RC 16 మూవీ ఫస్ట్ లుక్ కు ముహూర్తం ఫిక్స్..

Also Read: School Holidays: విద్యార్ధులకు సూపర్ గుడ్‌న్యూస్, ఏప్రిల్ లో 3-4 రోజులు సెలవులు

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

TwitterFacebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.

About the Author

Ashok Krindinti

అశోక్‌ క్రిందింటి జీ తెలుగు డిజిటల్ మీడియాలో సీనియర్ సబ్ ఎడిటర్‌గా పనిచేస్తున్నారు. ఇక్కడ 2022 నుంచి స్పోర్ట్స్, వినోదం, క్రైమ్, రాజకీయ వ్యవహరాలకు సంబంధించిన వార్తలు రాస్తున్నారు. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో వివిధ రంగాలకు సంబంధించిన వార్తలు అందించారు. ఆయనకు జర్నలిజంలో ఏడేళ్లకుపైగా అనుభవం ఉంది.

...Read More

Trending News