Viral Video: విద్యార్థులకు దండం పెట్టి గుంజీలు తీసిన హెడ్మాస్టర్.. నారా లోకేష్ స్పందన ఇదే.. వీడియో వైరల్..

Vizianagaram Head Master video: విజయనగరం జిల్లాలోకి ఒక పాఠశాల ప్రధానోపాధ్యాయుడు ఏకంగా స్టూడెంట్స్ ముందు సాష్టాంగ నమస్కారం  చేసి, గుంజీలు కూడా తీశాడు.ఈ వీడియో ప్రస్తుతం వార్తలలో నిలిచింది.  

Written by - Inamdar Paresh | Last Updated : Mar 13, 2025, 02:46 PM IST
  • గుంజీలు తీసిన హెచ్ఎం..
  • చక్కగా చదవాలని రిక్వెస్ట్..
Viral Video: విద్యార్థులకు దండం పెట్టి గుంజీలు తీసిన హెడ్మాస్టర్.. నారా లోకేష్ స్పందన ఇదే.. వీడియో వైరల్..

Vizianagaram Head Master Worried Students: సాధారణంగా మనం తల్లి, తండ్రి, ఆ తర్వాత అంతటి గొప్ప స్థానం గురువుకు ఇచ్చాం. అంటే గురువు యొక్క బాధ్యత ఎంత గొప్పదో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. చాలా మంది ఉపాధ్యాయ వృత్తిని దైవంలాగా, అంకిత భావంతో పనిచేస్తారు. అయితే.. కొంత మంది విద్యార్థులకు పాఠాలతో పాటు, జీవిత పాఠాలు సైతం చెప్తారు. ఒకప్పుడు పిల్లలు చదవకపోతే, స్కూల్ లలో ప్రవర్తన సరిగ్గా లేకపోతే.. ఇచ్చిన వర్క్ చేయకపోతే.. ఉపాధ్యాయులు, టీచర్లు దండించే వారు. రకరకాల పనిష్మెంట్ లను ఇచ్చేవారు.

Add Zee News as a Preferred Source

కొంత మంది ఉపాధ్యాయులు చెప్పగానే వారి మాటలు విని అప్పచెప్పిన పనిచేసేవారు. కానీ ఇంకొందరు మాత్రం.. వీరి భయానికి ఇచ్చిన హోంవర్క్ ను కంప్లీట్ చేసేవారు. ఏదీ చేసిన కూడా.. ఉపాధ్యాయులు అంతిమంగా మంచి విద్యను అందించాలని ప్రయత్నించేవారు. కానీ ఇప్పుడు మాత్రం ట్రెండ్ గా గతంలో దానికి భిన్నంగా మారింది.

 

 స్టూడెంట్స్ లను తప్పులు చేస్తే.. పాఠశాలలో చెప్పిన పనిచేయకుంటే.. ఉపాధ్యాయులు ఏమైన అంటే..వెంటనే ఇంట్లో వాళ్లు వచ్చి గొడవలు పెట్టుకుంటున్నారు. తమ పిల్లల్ని ఎందుకు కొడుతున్నారని కొందరు పోలీసుల వరకు వెళ్తున్నారు. ఈ క్రమంలో చాలా మంది ఉపాధ్యాయులు మాత్రం.. మంచి మాటతో చెప్పిచూస్తున్నారు. వినకుంటే.. మాత్రం.. ఏమీ చేయలేక.. తలలు కొట్టుకుంటున్నారు. ఈ క్రమంలో విజయనగరంలోని ఒక హెడ్మాస్టర్ చేసిన పని నెట్టింట వైరల్గా మారింది.

 విజయనగరం జిల్లా బొబ్బిలి మండలం పెంట గ్రామం జెడ్పీ స్కూల్లో ఈ ఘటన జరిగింది. ఆ స్కూల్ లో చదివే విద్యార్థులు గత కొన్నిరోజులుగా నిర్వహించిన అన్నిఎగ్జామ్లలో వెనుక బడ్డారు. ఉపాధ్యాయులు, హెచ్ఎం ఎంత చెప్పిన కూడా వారిలో మార్పులు రాలేదు.ఈ క్రమంలో సదరు హెడ్మాస్టర్ ప్రేయర్ ఏర్పాటు చేసి.. మంచి బోధన అందిస్తున్నామ్ కదా.. ఎందుకు చదవట్లేదని విద్యార్థులను ప్రశ్నించారు.

లోపం మీలో ఉందా.. లేదా మాలో ఉందా..అని ఎమోషనల్ అయ్యారు. ఏకంగా ప్రేయర్ లో అందరి ముందే సాష్టాంగ నమస్కారం చేసి.. గుంజీలు కూడా తీశారు.  మిమ్మల్ని కొట్టలేము.. మీరు చెబితే వినరు.. చేతకాక...ఈ విధంగా తమ చేస్తున్నాం.. దయచేసి బాగా చదవాలని కూడా ఆ హెడ్మాస్టర్ తన గొడును చెప్పుకున్నాడు. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. దీనిపై మంత్రి నారాలోకేష్ స్పందించారు.

Read more: Vizianagaram: జాతరలో ఘోరం... లేడీ ఎస్సై జుట్టు పట్టుకుని వేధించిన పోకీరీలు.. పరుగులు పెట్టిన అధికారిణి..

విజ‌య‌న‌గ‌రం జిల్లా, బొబ్బిలి మండ‌లం, పెంట జెడ్పీ హైస్కూల్ హెడ్మాస్ట‌ర్ చింత ర‌మ‌ణ గారు పిల్ల‌ల విద్యా పురోగ‌తి కోసం హెడ్మాస్టర్ పడుతున్న తపన అభినందనీయమన్నారు.  అంతా కలిసి పనిచేసి.. ప్రొత్సాహం అందించి.. పిల్లల అభ్యున్నతి కోసం పాటు పడదామని నారాలోకేష్ ట్విట్ చేశారు. 

 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.FacebookTwitter

About the Author

Inamdar Paresh

పరేష్ జీ తెలుగు డిజిటల్ మీడియాలో సబ్ ఎడిటర్‌గా పనిచేస్తున్నారు. ఇక్కడ 2024 నుంచి నేషనల్, సోషల్ మీడియా వైరల్ న్యూస్, క్రైమ్, తెలంగాణ, ఏపీ రాజకీయాలు, ఆస్ట్రాలజీ, లైఫ్  స్టైల్  వ్యవహరాలకు సంబంధించిన వార్తలు రాస్తున్నారు. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో వివిధ రంగాలకు సంబంధించిన వార్తలు అందించారు.

...Read More

Trending News