)
School Holidays in Andhra Pradesh: బే ఆఫ్ బెంగాల్ లో ఏర్పడిన అల్ప పీడనం వల్ల వాయు గుండంగా మారే అవకాశాలున్నాయి. ఈ రోజు ప్రకాశం, నెల్లూరు, తిరుపతి, చిత్తూరు, అన్నమయ్య, వైఎస్సార్ కడప జిల్లాలకు వాతావరణ శాఖ అధికారులు రెడ్ అలర్ట్ జారీ చేసింది. ఇక సీమ జిల్లాలైన అనంతపురం, శ్రీసత్యసాయి, కర్నూలు, నంద్యాల జిల్లాల్లో వాతావరణ శాఖ ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది. దీని ప్రభావం పల్నాడు జిల్లాపై కూడా వుంటుందంటూ ఐఎండీ ఎల్లో అలర్ట్ జారీ చేసింది. రానున్న 5 రోజులు రాష్ట్రంలో విస్తృతంగా పిడుగులతో కూడిన వర్షాలు పడే అవకాశం ఉందని హెచ్చరించింది.
తీరం వెంబడి గంటకు 35-55కిమీ వేగంతో బలమైన బలమైన ఈదురు గాలులు వీచే ఛాన్స్ వుందంటోంది. మరో వైపు పలు చోట్ల వరదలు వచ్చే అవకాశ ముందని హెచ్చరించింది. దీంతో ప్రభుత్వం కూడా అలర్ట్ అయ్యింది. ప్రభావిత జిల్లాల్లో ఎటువంటి పరిస్థితినైనే ఎదుర్కొనేలా NDRF, SDRF బృందాలని సిద్ధం చేసింది. ఇప్పటికే వర్షం కారణంగా మునిగే అవకాశాలున్న ప్రాంతాల్లో ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరించనున్నారు. వాయు గుండం బలపడకుండానే తీరం దాటిన తీవ్ర అల్ప పీడనం.
అటు ఉత్తర తమిళనాడు ప్రాంతంలో తీరం దాటిన తీవ్ర అల్పపీడనం. దీంతో ఆంధ్ర ప్రదేశ్ లో పలు జిల్లాల్లో భారీ వర్షాలు పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది. అటు దక్షిణ తెలంగాణ జిల్లాలకు మోస్తరు వర్షాలు పడే అవకాశాలున్నాయని తెలిపింది. ఇక భాగ్యనగరంలో మోస్తరు నుంచి భారీ వర్షం కురిసే అవకాశం ఉందని తెలిపింది. అటు భారీ వర్షాల నేపథ్యంలో చిత్తూరు, అన్నమయ్య, తిరుపతి జిల్లాల్లో వర్ష ప్రభావిత ప్రాంతాల్లోని విద్యా సంస్థలకు సెలవు ప్రకటించారు.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.