)
All Schools Tomorrow Holiday: దసరా, దీపావళి సెలవులు ముగిసిన తర్వాత మళ్లీ పాఠశాలలకు సెలవులు భారీగా వస్తున్నాయి. వాతావరణ మార్పులతో విద్యాలయాలకు సెలవులు ఇస్తున్నారు. ఇప్పటికే దీపావళి తర్వాతి రోజు సెలవు ప్రకటించగా.. తాజాగా రెండో రోజు కూడా పాఠశాలలకు సెలవుఇచ్చారు. బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం వాయుగుండంగా మారి గురువారం భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ హెచ్చరించింది. ఆకస్మిక వరదలు పొంచి ఉన్నాయనే హెచ్చరికల నేపథ్యంలో ప్రభావిత జిల్లాలు సెలవులు ఇచ్చాయి. కడప, అన్నమయ్య, చిత్తూరు, నెల్లూరు జిల్లాల్లో స్కూళ్లకు అధికారులు సెలవు ప్రకటించారు. భారీ వర్షాల నేపథ్యంలో ప్రకాశం జిల్లాలోనూ సెలవు ఇచ్చినట్లు సమాచారం.
చిత్తూరు
భారీ వర్షాల కారణంగా చిత్తూరు కలెక్టర్ ఆదేశాల ప్రకారం అన్ని యాజమాన్యాల (ప్రభుత్వ/ ప్రైవేటు) పాఠశాలలకు రేపు కూడా అనగా 23వ తేదీన సెలవు దినంగా ప్రకటిస్తున్నట్లు చిత్తూరు జిల్లా విద్యాశాఖాధికారి ప్రకటించారు. విద్య శాఖ అధికారులు కలెక్టర్ ఆదేశాలకు అనుగుణంగా అన్ని పాఠశాలలకు సెలవు ఉండేలా చూసుకోవాలని ఆదేశించారు.
కడప
వైఎస్సార్ కడప జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు జిల్లాలోని అన్ని ప్రభుత్వ/ ప్రైవేటు పాఠశాలలు, అంగన్వాడీ కేంద్రాలకు రేపు 23వ తేదీన సెలవు దినంగా ప్రకటించినట్లు కడప విద్యా శాఖ అధికారులు తెలిపారు. వాతావరణ శాఖ జారీ చేసిన భారీ వర్షాల హెచ్చరికల నేపథ్యంలో సెలవు పాటించాలని పాఠశాలల ఉపాధ్యాయులు, ప్రధానోపాధ్యాయులు, ఉప విద్యాధికారులకు, ఎంఈఓలకు ఆదేశాలు జారీ చేశారు.
నెల్లూరు జిల్లా
రెండు రోజుల నుంచి నెల్లూరు జిల్లాలో కుంభవృష్టి కురుస్తోంది. భారీ వర్షాలు పొంచి ఉన్నాయని వాతావరణ శాఖ తెలపడంతో నెల్లూరు అధికారులు రేపు గురువారం కూడా పాఠశాలలకు సెలవు ప్రకటించారు. జిల్లాలోని అన్ని ప్రభుత్వ, ప్రైవేట్, ఎయిడెడ్ పాఠశాలలు, కాలేజీలు, అంగన్డీ కేంద్రాలకు గురువారం సెలవు ప్రకటిస్తూ కలెక్టర్ హిమాన్షు శుక్లా నిర్ణయం తీసుకున్నారు. ఈ ఉత్తర్వులను విధిగా అమలుచేయాలని ఎంఈఓలకు.. విద్యా శాఖ అధికారులకు కలెక్టర్ ఆదేశించారు.
14 జిల్లాలకు ఆకస్మిక వరదల ముప్పు
ఆంధ్రప్రదేశ్‌లో భారీ వర్షాలు కురుస్తాయని ఇప్పటికే వాతావరణ శాఖ ప్రకటించింది. ప్రకాశం, నెల్లూరు, తిరుపతి, చిత్తూరు, అన్నమయ్య, కడప, అనంతపురం, సత్యసాయి, కర్నూలు జిల్లాలకు అప్రమత్తం చేసింది. గుంటూరు, బాపట్ల, పల్నాడు, కృష్ణా, ఎన్టీఆర్ జిల్లాలకు ఆకస్మిక వరదలు వచ్చే అవకాశం ఉందని హెచ్చరించింది. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచించారు.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి