Tirumala Drone: తిరుమలలో మరోసారి భద్రతా వైఫల్యం.. డ్రోన్ ఎగురవేసిన యూట్యూబర్

Security Failure Again In Tirumala YouTuber Arrest: తిరుమలలో అదే నిర్లక్ష్యం. కోట్లాది మంది భక్తులు సందర్శించే తిరుమలలో భద్రతా వైఫల్యాలు కొట్టిచ్చినట్లు కనిపిస్తున్నాయి. తాజాగా ఓ యూట్యూబర్‌ తిరుమల ప్రధాన ఆలయంపై డ్రోన్‌ ఎగురవేయడం కలకలం రేపుతోంది. 

Written by - Ravi Kumar Sargam | Last Updated : Apr 15, 2025, 08:36 PM IST
Tirumala Drone: తిరుమలలో మరోసారి భద్రతా వైఫల్యం.. డ్రోన్ ఎగురవేసిన యూట్యూబర్

YouTuber Arrest In Tirumala: పవిత్రమైన పుణ్యక్షేత్రం.. కోట్లాది భక్తుల ఆరాధ్య దైవం వెంకటేశ్వరుడు కొలువైన తిరుమలలో తరచూ వివాదాస్పద సంఘటనలు చోటుచేసుకుంటున్నాయి. లడ్డూ ప్రసాదం మొదలుకుని పాదరక్షలు ధరించడం.. డ్యామ్‌లో బోటింగ్‌, క్యూలైన్లలో రీల్స్‌ చేయడం.. ఆలయంలోకి కెమెరాలు.. ఫోన్లు తీసుకెళ్లడంతోపాటు ఆలయంపై విహంగాలు సంచరించడం తరచూ చోటుచేసుకుంటున్నాయి. కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు ఉండాల్సి ఉండగా.. తీవ్ర వైఫల్యం కనిపిస్తోంది. తాజాగా ఓ యూట్యూబర్‌ ఆలయంపై డ్రోన్‌ ఎగురేసిన సంఘటన కలకలం రేపింది.

Add Zee News as a Preferred Source

Also Read: Hyderabad Rains: హైదరాబాద్‌లో కుండపోత వర్షం.. అర్ధగంట పాటు అతలాకుతలం

తిరుమలలో మరొకసారి భద్రత వైఫల్యం బయటపడింది. ఇటీవల కాలంలో తిరుమలలో విజిలెన్స్‌ అధికారుల నిర్లక్ష్యం తరచూ బయటపడుతూనే ఉంది. తాజాగా డ్రోన్ ఎగురవేసిన యూట్యూబర్‌ను టీటీడీ అధికారులు అరెస్ట్‌ చేశారు. రాజస్థాన్ రాష్ట్రానికి చెందిన అన్షుమన్  తరెజా అనే యూట్యూబర్ మంగళవారం తిరుమలను సందర్శించాడు. దర్శనం అనంతరం సాయంత్రం శ్రీవారి ఆలయం ఎదురుగా ఉన్న హరినామ సంకీర్తన మండపం వద్ద డ్రోన్ ఎగురవేశాడు. దానికి సంబంధించిన వీడియోలు వైరల్‌గా మారాయి. భక్తుల నుంచి తీవ్ర అభ్యంతరాలు వ్యక్తం కావడంతో వెంటనే తిరుమల తిరుపతి దేవస్థానం విజిలెన్స్ అధికారులు రంగంలోకి దిగారు.

Also Read: Aghori Naga Sadhu: అఘోరీ నాగసాధు సంచలనం.. శ్రీవర్షిణితో ఘనంగా పెళ్లి

డ్రోన్‌ ఎగురవేసింది అన్షుమన్‌ తరెజా అని గుర్తించి టీటీడీ విజిలెన్స్ అధికారులు అదుపులోకి తీసుకున్నారు. వెంటనే అతడిని అరెస్ట్‌ చేసి డ్రోన్‌ను స్వాధీనం చేసుకుని పోలీసులకు అప్పగించారు. ఈ సంఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. మీడియా కెమెరాలనే తిరుమలకి తీసుకురావడానికి ఆంక్షలు విధించే విజిలెన్సు అధికారులు సామాన్య భక్తుడు డ్రోన్ కెమెరాని ఎలా తిరుమలకి అనుతించారనేది వస్తున్న ప్రశ్న.

తంలో అన్యమతస్తుడు హంగామా చేసి తిరుమలకి వెళ్లగా.. విజిలెన్స్ అధికారులకు తెలియకుండా అటవీ శాఖ అధికారులు డ్యామ్‌లో బోట్లతో ట్రయిల్ రన్ చేశారు. ఇప్పుడు సామాన్య భక్తుడు డ్రోన్ కెమెరాతో ప్రధాన ఆలయంపై ఎగురవేసి వీడియోలు తీయడం చూస్తుంటే భద్రతా వైఫల్యం ఎలా ఉందో అర్థమవుతోంది. ఇదంతా విజిలెన్స్ అధికారుల నిర్లక్ష్యంతోనే జరుగుతుందని భక్తులు ఆరోపిస్తున్నారు. ఆగమశాస్త్ర ప్రకారం శ్రీవారి ఆలయంపై డ్రోన్‌లు, విమానాలు, హెలికాప్టర్‌లు ఎగరకూడదు. తిరుమల కొండను నో ప్లైయింగ్‌ జోన్‌గా ప్రకటించాలని టీటీడీ పౌర విమానాయ శాఖకి పలుమార్లు లేఖలు రాసినా స్పందన లేదు. యూట్యూబర్‌ అరెస్ట్‌తో విజిలెన్స్‌ అధికారులు ఇప్పటికైనా నిద్రమత్తు వదులుతారా? లేదా అని చూడాలి. కాగా తిరుమలలో చోటుచేసుకుంటున్న వరుస సంఘటనలు రాజకీయ దుమారానికి తెరలేపుతున్న విషయం తెలిసిందే. చంద్రబాబు నాయుడు అధికారంలోకి వచ్చాక తిరుమల ప్రతిష్ట మరింత దిగజారుతోందని వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ తీవ్రంగా తప్పుపడుతోంది.

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

TwitterFacebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.

About the Author

Ravi Kumar Sargam

సర్గం రవి కుమార్‌. జీ తెలుగు డిజిటల్ మీడియాలో సబ్ ఎడిటర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ 2024 నుంచి రాజకీయాలు, స్పోర్ట్స్, వినోదం, క్రైమ్, జాతీయ వ్యవహరాలకు సంబంధించిన వార్తలు రాస్తున్నారు. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో వివిధ రంగాలకు సంబంధించిన వార్తలు అందించారు.

...Read More

Trending News