Amanchi Krishna Mohan: ఎన్నికల సమయంలో అధికార వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీకి, సీఎం జగన్‌కు భారీ షాక్‌ తగిలింది. పార్టీకి చెందిన కీలక నాయకుడు ఎమ్మెల్యే ఆమంచి కృష్ణమోహన్‌ రాజీనామా చేశారు. మారిన రాజకీయ పరిణామాలతో అలక వహించిన కృష్ణమోహన్‌ ఎట్టకేలకు వైఎస్సార్‌సీపీని వీడారు. త్వరలోనే ఏ పార్టీలో చేరుతానో ప్రకటిస్తానని వెల్లడించారు. ఈ మేరకు ఓ ప్రకటన విడుదల చేశారు.

COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

Also Read: CBN Is Lord Shiva: ఏపీ కోసం నేను శివుడి అవతారం ఎత్తా: చంద్రబాబు కీలక వ్యాఖ్యలు


 


బాపట్ల జిల్లాలో కీలక నాయకుడిగా ఉన్న ఆమంచి కృష్ణమోహన్‌కు తాజా ఎన్నికల్లో ఆశించిన టికెట్‌ లభించలేదు. దీంతో పార్టీపై, జగన్‌పై తీవ్ర అసహనంతో ఉన్నారు. పర్చూర్‌ నియోజకవర్గ బాధ్యతలు నిర్వహించారు. చీరాల నుంచి టికెట్‌ ఆశించిన కృష్ణమోహన్‌కు పర్చూరును కాదని వదిలేశారు. ఈ సందర్భంగా వైసీపీ పర్చూరు నియోజకవర్గ ఇన్‌చార్జ్‌ పదవికి అతడు రాజీనామా చేశాడు. తాను ఆశించిన చీరాల టికెట్‌ను కరణం వెంకటేశ్‌కు పార్టీ అధినేత జగన్‌ కేటాయించడంతో కృష్ణమోహన్‌ అసంతృప్తితో ఉన్నారు. టికెట్‌ వస్తుందని కొన్నాళ్లు ఆగిచూసినా పార్టీ అధిష్టానం నుంచి ఎలాంటి స్పందన రాకపోవడంతో గురువారం రాజీనామా చేశారు. ఈనెల 9వ తేదీన తన భవిష్యత్‌ కార్యాచరణ ప్రకటిస్తానని కృష్ణమోహన్‌ తెలిపారు.

Also Read: Pawan Kalyan Fever: పవన్‌ కల్యాణ్‌కు అస్వస్థత.. యాత్రను వదిలేసి హుటాహుటిన హైదరాబాద్‌కు


 


ఆమంచి వర్సెస్‌ కరణం
గత ఎన్నికల్లో కరణం బలరాం చేతిలో ఆమంచి కృష్ణమోహన్‌ ఓడిపోయారు. మారిన పరిణామాలతో బలరాం వైసీపీలో చేరడంతో ఆమంచి వర్సెస్‌ బలరాం అనేట్టుగా పార్టీలో విబేధాలు వచ్చాయి. ఈ నేపథ్యంలో పర్చూరు బాధ్యతలు అప్పగించినా కృష్ణమోహన్‌ మాత్రం చీరాలపైనే దృష్టి సారించారు. దీంతో తీవ్ర రాజకీయ విబేధాలు ఏర్పడ్డాయి. పర్చూరును వదులుకోవడంతో ఆ బాధ్యతలను యెడం బాలాజీకి పార్టీ అధిష్టానం అప్పగించింది. దీంతో రెండు విధాల ఆమంచి కృష్ణమోహన్‌కు ఎదురుదెబ్బ తగలడంతో ఇక పార్టీని వీడారు.


కాంగ్రెస్‌లో చేరిక?
చీరాల నుంచి 2014లో స్వతంత్ర ఎమ్మెల్యేగా గెలిచిన ఆమంచి కృష్ణమోహన్‌ అనంతరం తెలుగుదేశం పార్టీ చేరారు. 2019లో టీడీపీని వీడి వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీలో చేరారు. ఇప్పుడు పార్టీకి రాజీనామా చేసిన కృష్ణమోహన్‌ త్వరలో కాంగ్రెస్‌ పార్టీలో చేరనున్నట్లు సమాచారం. వైఎస్‌ షర్మిల సమక్షంలో పార్టీలో చేరి చీరాల నుంచి పోటీ చేయాలని భావిస్తున్నారు. తన భవిష్యత్‌ కార్యాచరణ ఏమిటో ఈనెల 9వ తేదీన తెలియనుంది.



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.     


Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu     


Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook