)
Jail Break In Andhra Pradesh Video: అనకాపల్లి జిల్లాలో ఇద్దరు ఖైదీలు జైలు నుంచి పారిపోయిన ఘటన కలకలం రేపుతుంది. ప్రధానంగా జైలు వార్డును సుత్తితో కొట్టి అక్కడి నుంచి పారిపోయిన వీడియో సోషల్ మీడియా వేదికగా వైరల్ అవుతుంది. వీరిద్దరూ ఒకరు చోరీ కేసులో రిమాండ్ ఖైదీ, మరొకరు పెన్షన్ డబ్బులు కాజేసిన రిమాండ్ ఖైదీ. పంచాయతీ మాజీ కార్యదర్శి నక్క రవికుమార్, బెజవాడ రాము వీళ్ళు జైలు హెడ్ వార్డనర్ రాజును తలపై సుత్తితో కొట్టి అక్కడి నుంచి తాళాలు తీసుకొని పారిపోయారు. ఇక పారిపోయిన ఖైదీల కోసం పోలీసులు తీవ్రస్థాయిలో గాలింపు చర్యలు చేపట్టారు. ఇక వార్డనర్ను ఆసుపత్రికి తరలించి అక్కడ మెరుగైన చికిత్స అందిస్తున్నారు.
సినిమా తరహాలో ఘటన చోటు చేసుకోవడంతో నెట్టింట వైరల్ అవుతుంది. ఇద్దరూ ఆరోజు జైలు కిచెన్ లో పని చేస్తున్నారు. ఆ సమయంలో వారు ముందస్తు ప్లాన్ గానే వార్డనర్ పై రవికుమార్ అటాక్ చేయడం ప్రారంభించారు. ఓ సుత్తి తీసుకొని జైలు వార్డనర్ రాజు పై అటాక్ చేశాడుజ అక్కడి ఇద్దరు కలిసి పారిపోయారు. పెన్షన్ డబ్బులు కాజేసిన ఘటనలో ఈ నక్క రవికుమార్ ని పోలీసులు అరెస్టు చేసి జైలుకు పంపించారు. ఇక బెజవాడ రాము వచ్చేసి దొంగతనం కేసులో నిందితుడు ఇక ఇద్దర్ని పట్టుకునేందుకు ప్రత్యేక గాలింపు చర్యలు చేపట్టారు.
ఇక సోషల్ మీడియా వైరల్ అవుతున్న ఈ వీడియోలో జైలు వార్డనర్ తన పని చేసుకుంటూ ఉన్న సమయంలో ముందుగా ఒకరు వచ్చి అతనిపై సుత్తితో అటాక్ చేశారు. వెంటనే మరొకరు అక్కడి నుంచి పారిపోయారు. పలుమార్లు రాజు అడ్డుకుని వారిని పట్టుకోవడానికి ప్రయత్నించారు. ఆ ఇద్దరు పలుమార్లు వార్డనర్పై దాడి చేసి ఆ తర్వాత అక్కడి నుంచి పారిపోయాడు. అక్కడే ఉన్న సీసీటీవీ ఫుటేజ్ లో ఈ వీడియో నమోదు అయింది. దీంతో ఇది నెట్టింటా వైరల్ అవుతుంది . ఇద్దరు అక్కడి నుంచి ఆ తర్వాత పారిపోయారు. వారిని పట్టుకోవడానికి పోలీసులు ప్రత్యేక బృందం సెర్చ్ ఆపరేషన్ చేపట్టింది.
Need to strengthen security in Jails. Two remands prisoners escaped from Chidavaram Sub Jail of Anakapalli district( Andhra Pradesh) - authorities are trying to nab them . pic.twitter.com/MDh32nGOX1
— Dr Srinubabu Gedela (@DrSrinubabu) September 5, 2025
అసోంలో కూడా ఇలాంటి ఘటన..
రెండు వారాల క్రితం అసోంలో కూడా ఇలాంటి ఘటనే చోటుచేసుకుంది. 20 ఏళ్ల జైలు శిక్ష పడిన ఇద్దరు నిందితులు ఇలానే జైలు నుంచి పారిపోయారు. ఇద్దరు ఒకే బారక్ లో ఉండగా ముందస్తు ప్లాన్ ప్రకారం జైలు బ్యారక్ కిటికీల గ్రిల్స్ విరగొట్టేసి బెడ్ షీట్లు, టవల్ ఆధారంగా జైలు నుంచి పారిపోయారు. ఒకరు జేరూల్ ఇస్లాం, అతన్ని ఆంధ్రప్రదేశ్‌లో పోలీసులు పట్టుకున్నారు. మరొకరు సర్కార్ పోక్సో కేసు కింద అరెస్టు చేశారు.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.