)
8 Dead At simhachalam Temple: సింహాచలం అప్పన్స చందనోత్సవం ఏటా నిర్వహిస్తారు. ఈరోజు కూడా ఈ ఉత్సవాల జరపడానికి అన్నీ ఏర్పాట్లు పూర్తి చేశారు. అయితే, చందనోత్సవం వేళ ఘోర విషాదం జరిగింది. కొత్త షాపింగ్ కాంప్లెక్స్ దగ్గర గోడ కూలి ఎనిమిది మంది మరణించారు. ప్రధానంగా భారీ వర్షానికి గోడ కూలినట్లు తెలుస్తోంది. ఈ ఘటనలో పదుల సంఖ్యలో గాయపడినట్లు సమాచారం. మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉంది.
ఇక సింహాచలం ప్రమాదంలో సహాయక చర్యలు జరుగుతున్నాయి. హోం మంత్రి అనిత దగ్గరుండి పర్యవేక్షిస్తున్నారు. ఈ ప్రమాదంపై ఆమె ఆరా తీశారు.భక్తులు ఆందోళన చెందవద్దని కలెక్టర్ హరేంద్ర ప్రసాద్ కోరారు. క్షతగాత్రులను కూడా సమీపంలోని ఆసుపత్రికి తరలించారు.
ప్రతి ఏడాది మాదిరి ఈ సారి కూడా సింహాచలం శ్రీవరాహ లక్ష్మీనరసిహ స్వామికి చందనోత్సవం జరగాల్సి ఉంది. దీనికి సంబంధించిన అధికారులు అన్నీ ఏర్పాట్లను కూడా పూర్తి చేశారు. స్వామివారు నిజరూపంలో దర్శనమిచ్చి భక్తులను కనువిందు చేయనున్నారు. ఈ నేపథ్యంలో భారీ ఎత్తున భక్తులు స్వామిదర్శనం చేసుకుంటారు. ఇంతలోనే ఈ ఘోర ప్రమాదం జరిగింది.
అయితే, మంగళవారం అర్ధరాత్రి దాటిన తర్వాత సింహాచలంలో భారీ వర్షం కురిసింది. ఈ నేపథ్యంలో సింహగిరి బస్టాండ్ నుంచి పైకి వెళ్లే మార్గంలో షాపింగ్ కాంప్లెక్స్ ఉంది. అక్కడే రూ.300 టికెట్ క్యూ లైన్ సిమెంట్ కూడా ఉండటంతో భారీ వర్షానికి కూలిపోయింది. ఈ ఘటనలో శిథిలాల కింద మరికొందరు కూడా ఉన్నట్లు తెలుస్తోంది. సింహాచలం అప్పన్న స్వామి దర్శనం కోసం మంగళవారం మధ్యాహ్నం నుంచి భక్తులు పోటెత్తారు. ఇప్పటికే ఉచిత దర్శనం క్యూలైన్లు కూడా నిండిపోయాయి.
ఈ ఉత్సవాల్లో స్వామివారిని వేకువ జామున సుప్రభాతం సేవలో మేల్కొలిపారు. ఆ తర్వాత స్వామివారిపై ఉన్న చందనాన్ని వెండి బొరిగేలో వేరు చేశారు. నిజ రూపంలోకి స్వామివారి దర్శనం వచ్చాక అభిషేకాలు నిర్వహించి వైదిక కార్యక్రమాల తర్వాత అనువంశిక ధర్మకర్త పూసపాటి అశోక్ గజపతిరాజు ఆయన కుటుంబ సభ్యులు నిజరూప దర్శనం కల్పించారు. ఇక రాష్ట్ర ప్రభుత్వం తరఫున రెవెన్యూ శాఖ మంత్రి అనగానే సత్యప్రసాద్ తిరుమల తిరుపతి దేవస్థానం పట్టు వస్త్రాలు కూడా సమర్పించారు. ఉదయం 3 గంటల నుంచి 6 గంటల వరకు ప్రోటోకాల్ దర్శనాలు కూడా ఏర్పాటు చేశారు.
8 devotees feared dead and several critically injured in a wall collapse at #Simhachalam temple in early hours.
Large number of devotees joined Q for darshan on #Chandanotsavam today. It rained heavily after midnight. Tragedy happened in Rs 300 Q. Sad to see ?#Vizag pic.twitter.com/Oiovw1LwUi— Vizag weatherman?? (@KiranWeatherman) April 30, 2025
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe