CM on Simhachalam Tragedy: మంగళవారం అర్ధరాత్రి తర్వాత గోడ కూలడంతో సింహాచలంలో ఎనిమిది మంది భక్తులు మృతి చెందారు. రాత్రి పడిన భారీ వర్షానికి గోడకూలి భక్తులపై పడడంతో అక్కడికక్కడే చనిపోయారు. ఈ ఘటనలో పలువురు గాయపడ్డారు. ఈ నేపథ్యంలో తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు ఈ ఘటనపై స్పందించారు. ప్రధానంగా ముఖ్యమంత్రి సీఎం చంద్రబాబు నాయుడు సింహాచలం శ్రీ వరాహ లక్ష్మీనరసింహస్వామి చందనోత్సవములో గోడ కూలిన భక్తుల తీవ్ర సంతాపం తెలియజేశారు. ఈ ఘటన తనను తీవ్రంగా కలిసి చేసిందని చెప్పారు. భారీ వర్షానికి గోడ కూలడంతో జరిగిన ఈ ఘటనలో మరణించిన వారి కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. ఇక పరిస్థితిపై జిల్లా కలెక్టర్ తో మాట్లాడి పరిస్థితులను ఆరా తీశారు. వారికి మెరుగైన చికిత్స అందాలించాలని ఎప్పటికప్పుడు పరిస్థితిని సమీక్షిస్తున్నట్లు ట్వీట్ చేశారు.
శ్రీ వరాహ లక్ష్మీనరసింహ స్వామి చందనోత్సవంలో గోడ కూలి ఏడుగురు భక్తులు మృతి చెందడం నన్ను కలచి వేసింది. భారీ వర్షాల కారణంగా గోడ కూలడం తో జరిగిన ఈ ఘటనలో మరణించిన వారి కుటుంబాలకు నా ప్రగాఢ సానుభూతి. అక్కడి పరిస్థితి పై జిల్లా కలెక్టర్, ఎస్పీ తో మాట్లాడాను. గాయపడిన వారికి చికిత్స…
— N Chandrababu Naidu (@ncbn) April 30, 2025
పీఎం నరేంద్ర మోదీ సంతాపం.. పరిహారం ప్రకటన
సింహాచలం ఘటన పై పీఎం మోదీ కూడా తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. వారి కుటుంబాలకు సానుభూతి తెలియజేసి క్షతగాత్రులు త్వరగా కోలుకోవాలని ఆశించారు. అంతే కాదు బాధిత కుటుంబాలకు రూ.2 లక్షలు గాయపడిన వారికి రూ. 50 వేలు చొప్పున పరిహారం ప్రకటించారు.
సీఎం రేవంత్ రెడ్డి స్పందన..
ఇదిలా ఉండగా తెలంగాణ ముఖ్యమంత్రి సీఎం రేవంత్ రెడ్డి కూడా ఆంధ్రప్రదేశ్ సింహాచలం ఆలయం ప్రమాద ఘటనపై విచారం వ్యక్తం చేశారు. గోడ కూలిన ప్రమాదంలో భక్తులు మరణించిన ఘటన తీవ్ర ఆవేదన కలిగించిందని అన్నారు. ఇక మృతుల ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతుడిని ప్రార్థిస్తున్నట్లు తెలిపారు. బాధిత కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలియజేస్తూ పోస్ట్ చేశారు.
ఆంధ్ర ప్రదేశ్ లోని
సింహాచలం ఆలయం వద్ద గోడ కూలి
భక్తులు మరణించిన ఘటన
తీవ్ర ఆవేదనను కలిగించింది.వారి కుటుంబ సభ్యులకు
నా ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తూ…
మృతుల ఆత్మలకు శాంతి చేకూరాలని…
భగవంతుడిని ప్రార్థిస్తున్నాను.— Revanth Reddy (@revanth_anumula) April 30, 2025
ఇక ఈ ఘటనపై మంత్రి నారా లోకేష్ కూడా ట్వీట్ చేశారు. తనను తీవ్ర ఆవేదనకు గురి చేసిందన్నారు. మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలియజేసి ప్రభుత్వం అండగా నిలబడుతుందన్నారు. వారికి భరోసా ఇచ్చి మెరుగైన చికిత్స అవసరం అయితే ప్రైవేటు ఆసుపత్రి కూడా తరలించాలని యంత్రాంగాన్ని ఆదేశించారు.
అదే విధంగా ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కూడా చందనోత్సవ సమయాన జరిగిన ఘటన దురదృష్టకరమని అన్నారు. ఎనిమిది మంది మృతి చెందడం చాలా బాధాకరం. మృతుల కుటుంబాలకు నా ప్రగాఢ సానుభూతి, బాధిత కుటుంబాలకు ప్రభుత్వం ఎప్పుడు అండగా ఉంటుందన్నారు, ఇక విశాఖ జిల్లా అధికారుల నుంచి ఘటన వివరాలు తెలుసుకొని గోడ వల్ల కూలిందని తెలిపారు.
ఇదిలా ఉండగా ఇప్పటికే ఏపీ హోమ్ మినిస్టర్ అనిత ఘటన స్థలానికి వెళ్లి పరిస్థితి పై ఆరా తీశారు. గాలి దుమారం కారణంగానే ఘటన జరిగిందని చెప్పారు. ఇటీవల ఏర్పాట్లను పరిశీలించాము, గోడను పిల్లర్లతో కట్టారా? సిమెంట్ తో నిర్మించారా? చూడలేదు అన్నారు. కాంట్రాక్టర్ ఎవరు? ఇంజనీర్, క్వాలిటీ కంట్రోల్ ఎంక్వైరీ చేసి వారిని కఠినంగా శిక్షిస్తామని చెప్పారు.
READ ALSO: సింహాచలం ఘటనకు ప్రధాన కారణం ఇదే? మృతుల కుటుంబాలకు రూ.25 లక్షల పరిహారం..
ఇక ఈ ఘటనపై ఉన్నతాధికారులు మంత్రులతో ముఖ్యమంత్రి చంద్రబాబు టెలి కాన్ఫరెన్స్ నిర్వహించారు. క్షతగాత్రులకు అవసరమైతే వైద్య సేవలు మెరుగ్గా అందించాలని సూచించారు. ముగ్గురు సభ్యుల కమిటీ కూడా విచారణ చేయాలని చెప్పారు. మృతుల కుటుంబాలకు రూ.25 లక్షల పరిహారం, క్షతగాత్రులకు రూ.3 లక్షల సాయం అందించనున్నారు. అంతే కాదు మృతుల కుటుంబాలు ఒక్కొక్కరికి దేవాదాయ శాఖలో ఔట్ సోర్సింగ్ ఉద్యోగం కూడా కల్పించనున్నారు.
READ ALSO: ఆషాడం బోనాల తేదీలు వచ్చేశాయి.. 2025 తెలంగాణ బోనాల షెడ్యూల్ ఇదే..
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.









