Mark Shankar: బంపర్ జాక్ పాట్ కొట్టేసిన మార్క్ శంకర్‌ను కాపాడిన కార్మికులు.. సింగపూర్ సర్కారు ఏంచేసిందంటే..?

Singapore govt honoured: పవన్ కళ్యాణ్ చిన్న కొడుకు ఇటీవల సింగపూర్లో అగ్ని ప్రమాదంలో చిక్కుకుని ఆ తర్వాత బైటపడిన విషయం తెలిసిందే. అయితే.. మార్క్ శంకర్ తో పాటు మరికొందరు ఈ ప్రమాదం నుంచి బైటపడేందుకు భారత్ కు చెందిన ప్రవాస భారతీయులు తమ ప్రాణాలు తెగించి మరీ పిల్లల కోసం స్కూల్లోకి ప్రవేశించారంట.  

Written by - Inamdar Paresh | Last Updated : Apr 12, 2025, 04:59 PM IST
  • పవన్ ను కాపాడిన ప్రవాసులు..
  • ఘనంగా సత్కరించిన సింగపూర్ ప్రభుత్వం..
Mark Shankar: బంపర్ జాక్ పాట్ కొట్టేసిన మార్క్ శంకర్‌ను కాపాడిన కార్మికులు.. సింగపూర్ సర్కారు ఏంచేసిందంటే..?

Singapore govt has honoured four Indians migrants: ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ చిన్న కొడుకు ఇటీవల సింగపూర్లో ఒక స్కూళ్లో జరిగిన అగ్ని ప్రమాదంలో చిక్కుకున్న విషయం తెలిసిందే. ఈ ఘటనలో ప్రస్తుతం మార్క్ శంకర్ ఆస్పత్రి నుంచి డిశ్చార్జీ అయ్యాడు. అయితే.. ఈ క్రమంలో అగ్ని ప్రమాదం సంభవించినప్పుడు.. కొంత మంది ప్రవాస  భారతీయులు మంటలు, దట్టమైన పొగలు వస్తున్నా కూడా.. మార్క్ శంకర్ తో పాటు, మరికొందరిని కాపాడటం కోసం స్కూల్ కు వెళ్లారంట. అక్కడ భద్రత సిబ్బందితో కలిసి రెస్క్యూలో పాల్గొన్నారు.

Add Zee News as a Preferred Source

ఈ క్రమంలో  ప్రస్తుతం  సింగపూర్ ప్రభుత్వం పిల్లల ప్రాణాలతో పాటు, మార్క్ శంకర్ ను కూడా కాపాడిన నలుగురు భారతీయ సంతతికి చెందిన కార్మికులను ఘనంగా సన్మానించింది. అంతే కాకుండా.. వారిసేవల్ని సైతం అక్కడి అధికారులు కొనియాడారు. ఆరోజు ప్రమాదం జరగ్గానే.. తమ ప్రాణాలు సైతం తెగించి.. పిల్లల ప్రాణాలు కాపాడినందుకు ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలిపారు.

అదే విధంగా శాలువాలతో సత్కరించి, ప్రత్యేకంగా వారి సేవల్ని కొనియాడారు.   మంటల్లో చిక్కుకున్న వారిని కాపడిన ఇందర్ జిత్ సింగ్, సుబ్రమణియన్ శరణ్ రాజ్, నాగరాజన్, అన్బరసన్, శివసామి విజయరాజ్ లు ఉన్నారు. వీరికి మ్యాన్ పవర్ మంత్రిత్వ శాఖ అస్యూరెన్స్, కేర్ అండ్ ఎంగెజ్ మెంట్ ఏస్ గ్రూప్ నుంచి ఫ్రెండ్స్ ఆఫ్ ఏసీఈ నాణేలను బహుకరించింది.

అయితే.. ప్రస్తుతం పవన్ కళ్యాణ్ కొడుకు క్రమంగా కొలుకుంటున్నాడని చిరంజీవి  ఇటీవల సోషల్ మీడియాలో పోస్ట్ సైతంపెట్టిన విషయం తెలిసిందే. అదే విధంగా మార్క్ శంకర్ కోసం, మెగా ఫ్యామిలీ కోసం ప్రార్థనలు చేసిన ప్రతి ఒక్కరికూడా చిరంజీవి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలిపారు. అదే విధంగా తమ కులదైవం ఆంజనేయ స్వామి దయ వల్ల.. మార్క్ శంకర్ పెద్ద గండం నుంచి బైటపడ్డాడని కూడా చిరంజీవి ఎమోషనల్ అయ్యారు.

Read more: Pawan Kalyan Son: పవన్ కొడుకు హెల్త్‌పై జుగుప్సాకరమైన పోస్టులు.. ఏపీ పోలీసులు సీరియస్..

 సింగపూర్ లో స్కూళ్లో  జరిగిన అగ్ని ప్రమాదంలో దాదాపు.. 19 మంది చిన్నారులు గాయపడ్డారు. వెంటనే సిబ్బంది స్పందించడంతో పెద్ద ప్రమాదం మాత్రం తప్పిందని చెప్పుకొవచ్చు. మరోవైపు పవన్ ను కలిసేందుకు ఇప్పటికే చిరంజీవి దంపతులు సింగపూర్ కు వెళ్లారు. మరోవైపు ఇప్పటికే మెగా ఫ్యాన్స్అంతా మార్క్ శంకర్ కొలుకొవాలని.. ప్రత్యేకంగా హనుమాన్ జయంతి వేళ పలు చోట్ల అన్నదానాలు,పూజలు నిర్వహిస్తున్నారు.

 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

Twitter, Facebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి

About the Author

Inamdar Paresh

పరేష్ జీ తెలుగు డిజిటల్ మీడియాలో సబ్ ఎడిటర్‌గా పనిచేస్తున్నారు. ఇక్కడ 2024 నుంచి నేషనల్, సోషల్ మీడియా వైరల్ న్యూస్, క్రైమ్, తెలంగాణ, ఏపీ రాజకీయాలు, ఆస్ట్రాలజీ, లైఫ్  స్టైల్  వ్యవహరాలకు సంబంధించిన వార్తలు రాస్తున్నారు. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో వివిధ రంగాలకు సంబంధించిన వార్తలు అందించారు.

...Read More

Trending News