YS Jagan Mohan Reddy: ముగ్గురు నేతలు.. ఆరు గ్రూపులు.. వైసీపీలో ఇదేం లొల్లి అయ్యా..!

EX CM YS Jagan Mohan Reddy: ఉత్తరాంధ్రలోని ఓ నియోజకవర్గంలో నేతల తీరు జగన్‌కు తలనొప్పిగా మారిందా..! ఆ నియోజకవర్గంలో ముగ్గురు నేతలు.. ఆరు గ్రూపులుగా రాజకీయం రక్తి కట్టిస్తోందా..! పార్టీ అధికారం కోల్పోయి.. కష్టాల్లో ఉందని తెలిసి కూడా ఆ నేతలు తగ్గడం లేదా..! సోషల్‌ మీడియా వేదికపై ఒకరిపై మరొకరు విమర్శలు గుప్పించుకుంటున్నారా..! ఈ సోషల్‌ మీడియా వార్‌తో ఆ నియోజకవర్గం మరోసారి వార్తల్లో నిలిచిందా..! ఇంతకీ ఈ గ్రూపుల పంచాయతీతో రగిలిపోతున్న ఆ నియోజకవర్గం ఏంటి..!   

Written by - Ashok Krindinti | Last Updated : Mar 10, 2025, 08:55 PM IST
YS Jagan Mohan Reddy: ముగ్గురు నేతలు.. ఆరు గ్రూపులు.. వైసీపీలో ఇదేం లొల్లి అయ్యా..!

EX CM YS Jagan Mohan Reddy: ఆంధ్రప్రదేశ్‌లో అధికారంలో కోల్పోయాక.. వైసీపీ ఇప్పుడిప్పుడే కోలుకుంటోంది.. ఆ పార్టీ అధినేత జిల్లాల నేతలను వరుసగా కలుస్తూ.. నేతలు చేజారిపోకుండా భరోసా ఇస్తున్నారు. ఇటీవల శ్రీకాకుళం జిల్లా నేతలతోనూ అధినేత జగన్‌ సమావేశం అయ్యారు. నేతలంతా కలిసి ప్రభుత్వంపై పోరాడాలని పిలుపునిచ్చారు. దాంతో అధినేత ముందు తలుపినా నేతలు తమ తీరు మాత్రం మార్చుకోవడం లేదు. కొద్దిరోజుల క్రితమే టెక్కలి నియోజకవర్గం రాష్ట్రవ్యాప్తంగా హాట్‌టాపిక్‌గా మారింది. దువ్వాడ శ్రీనివాస్‌ ఏపిసోడ్‌ తర్వాత టెక్కలిలో వైసీపీ పరువు పోయినంతా పనియ్యింది. ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్‌పై భార్య వాణి పోరాటానికి దిగడం అప్పట్లో హాట్‌టాపిక్‌ అయ్యింది. ఈ ఏపిసోడ్‌లోకి దివ్వెల మాధురి ఎంట్రీతో మొత్తం దువ్వాడ రాజకీయ భవిష్యత్తే తారుమారు అయ్యింది.. 
 
ఇక దివ్వెల మాధురి వ్యవహారం వెలుగు చూడటంతో పార్టీ హైకమాండ్‌ను దువ్వాడను పక్కన పెట్టేసింది. దువ్వాడను టెక్కలి ఇంచార్జ్‌ బాధ్యతల నుంచి తప్పించారు. ఆయన స్థానంలో పేరాడ తిలక్‌కు టెక్కలి ఇంచార్జ్‌ బాధ్యతలు అప్పగించారు. 2024 పార్లమెంటు ఎన్నికల్లో పోటీచేసిన పేరాడ తిలక్‌ ఎంపీగా ఓటమి పాలయ్యారు. దాంతో టెక్కలి వైసీపీకి ఆయన పెద్దదిక్కులా మారిపోయారు. ఇటీవల పార్టీ హైకమాండ్‌ రైతు సమస్యలపై ఆందోళనకు పిలుపునిచ్చింది. దాంతో పేరాడ తిలక్‌ అన్ని తానై చూసుకుంటున్నారు. దాంతో తిలక్‌పై దువ్వాడ తీవ్ర అసంతృప్తితో ఉన్నట్టు తెలుస్తోంది. ఇన్నాళ్లు తాను ఇంచార్జ్‌గా వ్యవహరించిన టెక్కలిలో తిలక్ పెత్తనం ఏంటని ఆయన ప్రశ్నిస్తున్నారట. అయితే కొద్దిరోజులుగా దివ్వెల మాధురితోనే కలిసి ఉంటున్న దువ్వాడ ఇప్పుడు ఆమెను రంగంలోకి దింపినట్టు తెలుస్తోంది.. 
 
తాజాగా టెక్కలి పాలిటిక్స్‌లోకి దివ్వెల మాధురి ఎంట్రీ హాట్ టాపిక్‌గా మారింది. దువ్వాడకు మద్దతుగా దివ్వెల మాధురి రాజకీయాల్ని ఓ రేంజ్‌లో పండిస్తున్నారట. అటు సొంత పార్టీ లీడర్‌ పోరాడ తిలక్‌ను కూడా టార్గెట్‌ చేసినట్టు తెలిసింది. ఇటీవల పేరాడను ఉద్దేశించి దివ్వెల మాధురి సోషల్‌ మీడియాలో పెట్టిన ఓ పోస్టు సంచలనంగా మారింది. వచ్చే ఎన్నికల్లో దమ్ముంటే తెచ్చుకో అసెంబ్లీ టికెట్‌.. నీవు తెచ్చుకుంటే నేను వదిలేస్తా పాలిటిక్స్‌ అంటూ పోస్టు పెట్టడం హాట్‌టాపిక్‌ అయ్యింది. అంతేకాకుండా తిలక్‌ ను పరోక్షంగా టార్గెట్‌ చేసి వరుస ట్వీట్‌లతో విరుకుచుపడుతున్నారట. దాంతో ఫ్యాన్‌ పార్టీలో ఏం జరుగుతుందో తెలియక క్యాడర్‌ మొత్తం పరేషాన్ అవుతున్నట్టు తెలిసింది.. 
 
మొత్తంగా పార్టీ కష్టకాలంలో ఉన్న సమయంలో సొంత పార్టీలోనే ఈ  లొల్లి ఏంటని క్యాడర్‌ ప్రశ్నిస్తుందట. ఇద్దరు నేతలు ఇలాగే కొట్టుకుంటూ వెళితే వచ్చే ఎన్నికల వరకు పార్టీలో ఎవరూ ఉండరని హెచ్చరిస్తున్నారట. గతంలోనూ దువ్వాడ తీరుతో టెక్కలిలో పార్టీ పరువంతా పోయిందని అంటున్నారట. ఇప్పటికైనా పార్టీ హైకమాండ్ దువ్వాడ- తిలక్‌ మధ్య ఆధిపత్య పోరుకు ఎండ్‌ కార్డ్‌ వేయాలని సూచిస్తున్నారట. మొత్తంగా టెక్కలి పాలిటిక్స్‌కు వైసీపీ హైకమాండ్‌ ఎలా చెక్‌పెడుతుంది అనేది ఆసక్తికరంగా మారింది. 

Add Zee News as a Preferred Source

Also Read: Pawan Kalyan: చంద్రబాబు సీఎం అయ్యారంటే..అది పవన్ క్రెడిట్ మాత్రమే.. బాంబు పేల్చిన నాదెంఢ్ల.. వీడియో వైరల్..

Also Read: TGPSC Group 1 Results: టీజీపీఎస్సీ గ్రూప్‌ 1 ఫలితాలు విడుదల.. చెక్‌ చేసుకోవడం ఇలా

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.FacebookTwitter

About the Author

Ashok Krindinti

అశోక్‌ క్రిందింటి జీ తెలుగు డిజిటల్ మీడియాలో సీనియర్ సబ్ ఎడిటర్‌గా పనిచేస్తున్నారు. ఇక్కడ 2022 నుంచి స్పోర్ట్స్, వినోదం, క్రైమ్, రాజకీయ వ్యవహరాలకు సంబంధించిన వార్తలు రాస్తున్నారు. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో వివిధ రంగాలకు సంబంధించిన వార్తలు అందించారు. ఆయనకు జర్నలిజంలో ఏడేళ్లకుపైగా అనుభవం ఉంది.

...Read More

Trending News