)
Visakha Railway Zone: విశాఖపట్నం కేంద్రంగా దక్షిణ కోస్తా రైల్వే జోన్‌కు కేంద్ర ప్రభుత్వం పచ్చజెండా ఊపిన విషయం తెలిసిందే. ఇప్పుడు తాజాగా ఇదే జోన్‌కు జనరల్ మేనేజర్‌ను నియమిస్తూ రైల్వే బోర్డు ఆదేశాలు జారీ చేసింది. త్వరలో కార్యకలాపాలు ఎప్పుడు ప్రారంభమయ్యేది స్పష్టత రానుంది.
ఆంధ్రప్రదేశ్ విభజన తరువాత విశాఖపట్నం కేంద్రంగా దక్షిణ కోస్తా రైల్వే జోన్ ఏర్పడింది. అయితే పనులకు సంబంధించి ఇప్పటి వరకు ఎలాంటి పురోగతి కన్పించలేదు. ఇప్పుడు తాజాగా దక్షిణ కోస్తా రైల్వే జోన్‌కు కొత్తగా జీఎంను నియమిస్తూ కేంద్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. జోన్ కార్యకలాపాలు ప్రారంభమయ్యే తేదీ వెల్లడి కావల్సి ఉంది. ఇప్పటి వరకు ఈ కొత్త రైల్వే జోన్‌కు ప్రత్యేక అధికారి మాత్రమే ఉన్నాడు. ఇప్పుడిక జీఎం నియామకం కూడా పూర్తయింది. వడోదరలోని నేషనల్ అకాడమి ఆఫ్ ఇండియన్ రైల్వే డైరెక్టర్ జనరల్ కేడర్ పోస్టు ఖాళీగా ఉండటంతో ఆ పోస్టుని విశాఖ జోన్‌కు బదలాయించారు.
విశాఖ రైల్వే జోన్ ప్రకటన తొలిసారిగా 2019 ఫిబ్రవరిలో జరిగింది. కేంద్ర మంత్రివర్గం కూడా ఆమోదించింది. 149 కోట్ల వ్యయంతో 9 అంతస్థులతో గ్రౌండ్ ఫ్లోర్, రెండు ఫ్లోర్ల పార్కింగ్తో జోన్ కార్యాలయం పనులు ప్రారంభం కానున్నాయి. ఇప్పటికే టెండర్లు ఖరారు చేసి పనులు సంబంధిత కంపెనీకు అప్పగించారు.
విశాఖ రైల్వే జోన్లో ఇంకా అసిస్టెంట్ జీఎం, పది విభాగాలకు ముఖ్య విభాగాధిపతులు, ప్రిన్సిపల్ హెచ్ఓడీలు, విభాగాధిపతులు కలిసి మొత్తం 170 మందిని నియమించాల్సి ఉంటుంది. ఈ జోన్ పరిధిలో విజయవాడ, గుంటూరు, గుంతకల్లు డివిజన్లు, తూర్పు కోస్తా రైల్వే జోన్ పరిధిలో ఉన్న వాల్తేరు డివిజన్ ఉన్నాయి.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook