Special Trains For Sankranti 2026: రాబోయే సంక్రాంతి సందర్భంగా ప్రయాణికుల రద్దీని దృష్టిలో దక్షిణ మధ్య రైల్వే శుభవార్త చెప్పింది. పండుగ సందర్భంగా తెలుగు రాష్ట్రాల్లో ప్రత్యేక రైళ్లను నడిపేందుకు ఏర్పాట్లు చేసింది. తెలుగు ప్రజలు ఎంతో ఘనంగా జరుపుకొనే పెద్ద పండుగల్లో ఇదొకటి. ఈ పండగ వస్తే తెలుగు వాళ్లు ఎక్కడున్నా వారి వారి స్వంత ఊర్లకు వెళ్లడం ఆనవాయితీగా వస్తుంది. ఇప్పుడదే క్రమంలో ప్రయాణికులను దృష్టిలో ఉంచుకొని రైల్వే అధికారులు ప్రత్యేక రైళ్లను నడపనున్నారు.
దక్షిణ భారతదేశంలోని ప్రధాన నగరాలైన హైదరాబాద్, బెంగుళూరు నుంచి తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లోని ప్రధాన నగరాలకు (వైజాగ్, రాజమండ్రి, కాకినాడ, విజయవాడ, గుంటూరు, నెల్లూరు, తిరుపతి, వరంగల్, మహబూబ్ నగర్ వంటి ప్రాంతాలకు) ప్రయాణించే వారికి ఈ నిర్ణయం ఎంతగానో ఉపయోగకరంగా మారనుంది.
సాధారణంగా ఇలాంటి ప్రత్యేక రైళ్ల వివరాలు, టైమింగ్ అనే వాటిని వారం ముందుగా అంటే సంక్రాంతికి వారం ముందు అంటే జనవరి మొదటి వారంలో ఈ వివరాలను తెలియజేసే రైల్వే శాఖ ఇప్పుడు మరింత సమయం ముందుగానే ప్రయాణికులకు తెలియజేశారు. అయితే స్పెషల్ ట్రైన్లు ఎక్కడ నుంచి ఎక్కడికి.. ఏఏ తేదీల్లో..ఏ ఏ మార్గాల్లో ఈ రైళ్లు ప్రయాణిస్తున్నాయో ఇప్పుడు తెలుసుకుందాం. దక్షిణ మధ్య రైల్వే ప్రకటించిన ప్రత్యేక వివరాలను ఇక్కడ ఉన్నాయి. అవేంటో ఒకసారి పరిశీలిద్దాం.
| రైలు నంబర్ | మార్గం | నడిచే రోజులు | తేదీలు |
| 07041 | సికింద్రాబాద్-అనకాపల్లి | ఆదివారాలు | జనవరి 4, 11, 18, 2026 |
| 07042 | అనకాపల్లి-సికింద్రాబాద్ | సోమవారాలు | జనవరి 5, 12, 19, 2026 |
| 07075 | హైదరాబాద్-గోరఖ్‌పూర్ | శుక్రవారాలు | జనవరి 9, 16, 23, 2026 |
| 07076 | గోరఖ్‌పూర్-హైదరాబాద్ | ఆదివారాలు | జనవరి 11, 18, 25, 2026 |
| 07274 | మచిలీపట్నం-అజ్మీర్ | ఆదివారం | డిసెంబర్ 21, 2025 |
| 07275 | అజ్మీర్-మచిలీపట్నం | ఆదివారం | డిసెంబర్ 28, 2025 |
స్పెషల్ ట్రైన్స్..ముఖ్యమైన స్టాప్‌లు..
దక్షిణ మధ్య రైల్వే ప్రకటించిన ప్రత్యేక రైళ్లు కొన్ని ఎంపిక చేసిన ప్రాంతాల్లో మాత్రమే రైల్వే స్టేషన్లలో నిలిపివేయనున్నారు. ఆయా ప్రాంతాలను పరిశీలించి ప్రయాణికులు వారి వారి బుకింగ్స్ చేసుకోవాలని రైల్వే అధికారులు తెలియజేశారు. తెలుగు రాష్ట్రాల్లోని మహబూబ్ నగర్, వరంగల్, ఖమ్మం, విజయవాడ, గుడివాడతో పాటు నాందేడ్, ధర్మాబాద్, బాసర, నిజామాబాద్, కరీంనగర్, పెద్దపల్లి, జమ్మికుంట స్టేషన్లలో ఈ సంక్రాంతి స్పెషల్ ట్రైన్స్ ఆగనున్నాయి.
అలాగే ఉత్తరాదికి వెళ్లే స్పెషల్ ట్రైన్స్ పూర, పర్భాని, సి. శంభాజీనగర్ (ఔరంగాబాద్), మన్మాడ్, భుసావల్, ఖాండ్వా, ఇటార్సి, భోపాల్, ఉజ్జయిని వంటి ఇతర స్టేషన్ల మీదుగా ఇవి ప్రయాణించనున్నాయి. అయితే ప్రయాణికుల రద్దీని బట్టి మరిన్నీ ప్రత్యేక రైళ్లను నడిపేందుకు చర్యలు తీసుకుంటామని దక్షిణ మధ్య రైల్వే అధికారులు తెలియజేశారు.
Also Read: Pini Village Women: ఆ గ్రామంలో మహిళలు దుస్తులు ధరించరు..భారత్‌లోనే వింతైన గ్రామం..ఎక్కడుందో తెలుసా?
Also REad: New Year Celebration: న్యూఇయర్ వేడుకలకు గోవా వెళ్తున్నారా? ఇవి తెలిస్తే సేఫ్..లేదంటే పోయాం మోసం?!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook









