
AP Sports: ఆంధ్ర ప్రదేశ్ శాసనసభ సమావేశాల సందర్భంగా ఎమ్మెల్యే, ఎమ్మెల్సీలకు క్రీడా పోటీలు నిర్వహించబోతునున్నారు. ఈ నెల18 నుంచి మూడు రోజుల పాటు మధ్యాహ్నాం 3 గంటల నుంచి రాత్రి 8 గంటల వరకు ఈ పోటీలు జరగనున్నాయి. ప్రతిపక్ష వైసీపీ సభ్యులకు సైతం ఈ పోటీల్లో పాల్గొనేందుకు ఆహ్వానాలు పంపించినట్లు అధికార పార్టీ నేతలు తెలిపారు.
ఈ పోటీల్లో పాల్గొనే పురుషులకు క్రికెట్, వాలీబాల్, బ్యాడ్మింటన్, కబడ్డీ.... మహిళలకు బ్యాడ్మింటన్, త్రోబాల్, టగ్ ఆఫ్ వార్ పోటీలను నిర్వహించనున్నారు. క్రీడల్లో పాల్గొనే సభ్యులకు ప్రత్యేక డ్రెస్ కోడ్ ఏర్పాటు చేశారు.
నిత్యం రాజకీయాలతో బిజీబిజీగా ఉండే నాయకులకు ఉపశమనం కలిగించేందుకు ఈ క్రీడా పోటీలను నిర్వహిస్తున్నట్లు శాసనసభ సభాపతి అయ్యన్నపాత్రుడు ప్రకటించారు. ఈ పోటీల్లో విజేతలకు 20వ తేదీన సీఎం చంద్రబాబు బహుమతులు ఇవ్వనున్నట్లు స్పీకర్ వెల్లడించారు. మొత్తంగా ఏపీలో క్రీడా పోటీలు ఎమ్మెల్యేలకు ఎమ్మెల్సీలకు కాస్త రిలీఫ్ ఇచ్చే అంశమనే చెప్పాలి.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe