Pithapuram Temple: పిఠాపురం కుక్కుటేశ్వర స్వామి కళ్యాణంలో అపశృతి..

Pithapuram Temple: పిఠాపురం పాదయాత్ర క్షేత్రంగా వెలుగొందుతున్న ఉమా రాజరాజేశ్వరి సమేత కుక్కుటేశ్వర స్వామి వారి కళ్యాణం సోమవారం రాత్రి అంగరంగ వైభవంగా జరిగింది. అయితే కొందరు రాజకీయ నాయకులు కళ్యాణాన్ని కూడా రాజకీయం చేశారు. దీంతో ఆలయ ఈవో చేసేది లేక కళ్యాణ పీఠల మీద నుంచి లేచి వెళ్లి పోవలసిన పరిస్థితి వచ్చింది.

Written by - TA Kiran Kumar | Last Updated : Feb 25, 2025, 10:40 AM IST
Pithapuram Temple: పిఠాపురం కుక్కుటేశ్వర స్వామి  కళ్యాణంలో అపశృతి..

Pithapuram Temple: గోదావరి జిల్లాల్లో గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్ అమల్లో ఉంది. రాజకీయ నాయకులు ,లేదా ప్రజా ప్రతినిధులు ఆలయాలకు రావచ్చు. దర్శనం చేసుకుని వెళ్లొచ్చు. అంతే తప్ప ఎలాంటి ప్రోటోకాల్ ఉండదు. రాచ మర్యాదలు చేయరు. అయితే ఇప్పటికే పిఠాపురంలో షాడో ఎమ్మెల్యేగా వ్యవహరిస్తున్న జనసేన ఇన్చార్జ్ మర్రెడ్డి శ్రీనివాస్ దంపతులతో కలిసి కళ్యాణం వద్దకు వచ్చారు.

Add Zee News as a Preferred Source

ఆయనను కళ్యాణ వేదికపైకి పిలవాలంటూ కొందరు జనసైనికులు ఒత్తిడి తెచ్చారు. కోడ్ అమలులో ఉండటంతో మామూలుగా కళ్యాణం చూడవచ్చని ,ప్రోటో కాల్ పాటించలేమని ఆలయ అధికారులు వెల్లడించారు. జనసేన ఇంచార్జ్ తప్ప ఆయనకి ఎలాంటి అధికార పదవులు లేవు. అయినప్పటికీ కొందరు వాదనకు దిగారు.

ఇదీ చదవండి:   అల్లు అర్జున్ నిజంగానే రామ్ చరణ్ అన్ ఫాలో చేశాడా.. తెర వెనక అసలు స్టోరీ ఇదే.
-
ఎప్పుడైతే జనసైనికులు వాదనకు దిగారో ఎన్నికల కోడ్ ఉల్లంఘన జరిగితే తమకు ఇబ్బంది కలుగుతుందని భావించిన ఈవో దంపతులు.. పీటల మించి లేచి వెళ్లిపోయారు. దీంతో అర్చకులే కళ్యాణం నిర్వహించారు. దీంతో సర్వత్ర విమర్శలు వెల్లు వెత్తుతున్నాయి.

ఇదీ చదవండి: ప్రభుత్వ ఉద్యోగులకు అదిరిపోయే శుభవార్త.. బేసిక్ పేలో భారీ పెంపు..

 

ఇదీ చదవండి: Liquor Rates Hike: మందుబాబుకు భారీ షాక్.. భారీగా పెరిగిన బీర్ల ధరలు..

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

TwitterFacebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.

About the Author

TA Kiran Kumar

కిరణ్ కుమార్ తంజావూర్ జీ తెలుగు తెలుగు న్యూస్‌లో ఛీఫ్ సబ్ ఎడిటర్‌గా పనిచేస్తున్నారు. ఇక్కడ 2024 నుంచి  వినోదం, ఆధ్యాత్మికం, జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ వ్యవహారాలకు సంబంధించిన వార్తలు రాస్తున్నారు. సినిమా రివ్యూలు, సినిమాలకు సంబంధించి ప్రత్యేక కథనాలు కూడా రాస్తుంటారు. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో వివిధ రంగాలకు సంబంధించిన వార్తలు అందించారు. ఆయనకు జర్నలిజంలో 18 ఏళ్లకుపైగా అనుభవం ఉంది.

...Read More

Trending News