Sri Reddy In Police Station Video: టీడీపీ, జనసేన అధినేతలపై శ్రీరెడ్డి సోషల్ మీడియా వేధికగా అసభ్యకర కామెంట్లు పెట్టడంతో 2024 డిసెంబర్‌నెలలో శ్రీరెడ్డిపై కేసు నమోదు చేశారు. ఈనేపథ్యంలో తాజాగా శ్రీ రెడ్డిని విచారించేందకు పోలీసులు పిలిచారు. దీంతో ఆమె విజయ నగరం జిల్లాలోని పూసపాటిరేగ సర్కిల్‌లోని అనకాపల్లి స్టేషన్‌కు వచ్చారు.
దీంతో శ్రీరెడ్డిని పోలీసులు ఓ అరగంటపాటు విచారించారు. అవసరమైతే మరోసారి విచారణకు రావాలని చెప్పారు. కూటమి ప్రభుత్వం. గత రాత్రి శ్రీరెడ్డిని విచారణకు పిలిచారు. కూటమి నేతలు పెద్ద ఎత్తున ఆందోళన చేశారు. ఈనేపథ్యంలో శ్రీరెడ్డిపై కేసు నమోదు చేశారు. 2024 డిసెంబర్ 13న తేదీ కేసు నమోదు అయింది. విజయనగరం, అనకాపల్లి రెండు పోలీస్ స్టేషన్‌లలో ఆమె విచారణకు హాజరు అయ్యారు. పెద్ద ఎత్తున మహిళ, వైఎస్‌ఆర్‌సీపీ నాయకులు చేరుకున్నారు. శ్రీరెడ్డిని అరెస్టు చేస్తారనే ప్రచారం జరగడంతో ఎక్కువ మంది గుమిగూడారు.
పోలీసులు వారిని చెదరగొట్టారు. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకోకుండా చర్యలు తీసుకున్నారు. శ్రీరెడ్డి వ్యక్తిగత లాయర్ సమక్షంలో వివరణ ఇచ్చారు. గతంలో పోసాని కృష్ణ మురళి కూడా అసభ్యకరంగా టీడీపీ అధినేతలను అనడంతో అరెస్ట్ చేశారు. ఇప్పటికే రామ్ గోపాల్ వర్మను కూడా విచారణకు హాజరు కావాలని చెప్పారు. కానీ, ఆయన స్పందించడం లేదు. శ్రీరెడ్డిని మాత్రం తదుపరి విచారణకు అందుబాటులో ఉండాలని చెప్పారు. ఆమెకు ప్రస్తుతం 41ఏ నోటసులు జారీ చేశారు. పోలీసులకు అందుబాటులో లేని పక్షంలో అరెస్టు చేస్తామని సీరియస్‌గా ఉన్నట్లు తెలుస్తోంది.మరోసారి విచారణ జరిగిన తర్వాత శ్రీరెడ్డిని అరెస్ట్ చేసే అవకాశం ఉందని తెలుస్తోంది.
ఇదీ చదవండి: డీఎస్సీ నోటిఫికేషన్ విడుదల.. ఈ లింక్ ద్వారా వెంటనే దరఖాస్తు చేసుకోండి..
ఇదీ చదవండి: తిరుమలలో వేసవి రద్దీ వేళ.. వీఐపీ సిఫార్సు లేఖల తిరస్కరణ?
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి









