
Srisailam Ugadi Mahotsavalu:శ్రీశైలం ఆలయంలో ఏర్పాటు చేసిన ప్రత్యేక వేదికపై స్వామి, అమ్మవార్ల ఉత్సవమూర్తులకు అర్చకులు, వేదపండితులు శాస్త్రోక్తంగా ప్రత్యేక పూజలు నిర్వహించి కర్పూరహారతులిచ్చారు. అనంతరం స్వామి, అమ్మవార్ల ఉత్సవమూర్తులకు బాజా భజంత్రీలు, వాయిద్యాల నడుమ ఆలయ ప్రాకారోత్సవం నిర్వహించారు.
ఆలయ ప్రదక్షిణలో ఉత్సవం ముందు స్వామి అమ్మవార్లను దర్శించుకున్నారు భక్తులు. దీంతో శ్రీశైలం క్షేత్రంలో ఉగాది మహోత్సవాలు వైభవంగా ముగిశాయి. ఈ కార్యక్రమంలో ఆలయఈవో దంపతులు, అర్చకులు, అధికారులు,సిబ్బంది పాల్గొన్నారు.మరోవైపు ఉగాది సందర్భంగా ప్రత్యేకంగా పంచాగం శ్రవణం నిర్వహించారు. ఈ సందర్బంగా ఈ సందర్భంగా పలు సాంస్కృతిక ఆధ్యాత్మిక కార్యక్రమాలతో పాటు విశేష పూజలు, హోమాలు శ్రీశైలం దేవస్థానం నిర్వహించింది. భక్తులు కూడా పెద్ద సంఖ్యలో హాజరయ్యారు.
అంతేకాదు ఉగాది సందర్బంగా ప్రత్యేక అభిషేకాది పూజలు నిర్వహించారు. ముఖ్యంగా ద్వాదశ జ్యోతిర్లింగంతో పాటు అష్టాదశ శక్తి పీఠం కొలువైన ఈ క్షేత్రంలో ఉగాది రోజు స్వామి అమ్మవార్లను దర్శించుకుంటే.. ఎన్నో జన్మల పుణ్యఫలం అని భక్తులు విశ్వసిస్తారు. ఈ సందర్భంగా కర్ణాటక తో పాటు ఏపీలోని పలు ప్రాంతాల నుంచి పెద్ద ఎత్తున భక్తులు శ్రీశైలం సందర్శించి స్వామి అమ్మవార్లకు తమ మొక్కులను చెల్లించుకున్నారు.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe