Srisailam Ugadi Mahotsavam: శ్రీశైలంలో ఉగాది ఉత్సవాలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. ఈ సేవలో శ్రీ స్వామిఅమ్మవార్ల ఉత్సవమూర్తులను భృంగివాహనంపై కూర్చండపెట్టి విహరించారు. ఈ సందర్భంగా స్వామి అమ్మవార్లకు విశేషంగా అలంకార మండపములో పూజాదికాలు జరిపించారు. తరువాత గ్రామోత్సవం నిర్వహించారు.
భృంగివాహనం వారి దర్శించడం వల్ల పనులలో ఏకాగ్రత లభిస్తుందని, పాపాలను హరించబడుతుందని పురాణాలు చెపుతున్నాయి. ఉత్సవాలలో భాగంగా అమ్మవారి ఉత్సవమూర్తికి మహాలక్ష్మీ అలంకారం లో గ్రామోత్సవం జరిపించారు.
మహాలక్ష్మి స్వరూపాన్ని దర్శించడం వలన శత్రుబాధలు నివారించి, సకల శుభాలు కలుగుతాయని భక్తుల విశ్వాసం. ఈ సందర్భంగా ఊరేగింపులో జానపద కళాకారుల వృత్యాలు, కోలాటం, చెక్కభజన వంటి కళారూపాలు భక్తులను ఆకట్టుకున్నాయి. మరోవైపు ఉగాది ఉత్సవాల సందర్భంగా ఉగాది సందర్భంగా ప్రత్యేకంగా పంచాగం శ్రవణం నిర్వహించనున్నారు. ఈ సందర్బంగా ఈ సందర్భంగా పలు సాంస్కృతిక ఆధ్యాత్మిక కార్యక్రమాలతో పాటు విశేష పూజలు, హోమాలు శ్రీశైలం దేవస్థానం నిర్వహించనుంది.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.









