SI Suicide: బాత్‌రూమ్‌లో తుపాకీతో కాల్చుకుని ఎస్‌ఐ ఆత్మహత్య.. కారణం అదేనా..?

SI Suicide in Tanuku Rural Police Station: పశ్చిమ గోదావరి జిల్లాలో ఎస్‌ఐ మూర్తి ఆత్మహత్యకు పాల్పడ్డారు. తనను వీఆర్‌కు పంపించారని మనస్తాపంతో ఆయన ఆత్మహత్య చేసుకున్నట్లు తెలుస్తోంది. వివరాలు ఇలా..  

Written by - Ashok Krindinti | Last Updated : Jan 31, 2025, 10:26 AM IST
SI Suicide: బాత్‌రూమ్‌లో తుపాకీతో కాల్చుకుని ఎస్‌ఐ ఆత్మహత్య.. కారణం అదేనా..?

SI Suicide in Tanuku Rural Police Station: పశ్చిమ గోదావరి జిల్లాలో తీవ్ర విషాదం చోటు చేసుకుంది. తణుకు రూరల్ పోలీస్ స్టేషన్‌లో ఎస్ఐ మూర్తి  తుపాకీతో కాల్చుకొని ఆత్మహత్య చేసుకున్నారు. తణుకు రూరల్ ఎస్ఐగా పనిచేస్తున్న ఏజీఎస్ మూర్తి.. ఇటీవల పలు ఆరోపణలు నేపథ్యంలో ఉన్నతాధికారులు ఆయను వీఆర్‌కు బదిలీ చేశారు. అయితే పెనుగొండలో నేడు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పర్యటనలో విధులు నిర్వహించేందుకు వచ్చారు. ఈ నేపథ్యంలో తణుకు రూరల్ పోలీసు స్టేషన్‌కు వెళ్లి బాత్ రూమ్‌లో  తలపై తుపాకీతో  కాల్చుకుని ఆత్మహత్యకు పాల్పడ్డారు. వెంటనే స్టేషన్‌లో ఉన్న పోలీస్ సిబ్బంది ఎస్‌ఐని  ఏరియా ఆసుపత్రికి తరలించగా.. ఆయన మృతి చెందారు. తనను వీఆర్‌కు పంపారన్న మనస్తాపంతోనే మూర్తి సూసైడ్ చేసుకున్నట్లు అనుమానిస్తున్నారు. ఈ సంఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

Add Zee News as a Preferred Source

Also Read: ప్రస్తుత మార్కెట్ వాల్యూ ప్రకారం నాగార్జున ‘అన్నపూర్ణ స్టూడియో’ మార్కెట్ విలువ ఎంతో తెలుసా..?

Also Read:  గడ్డకట్టే చలిలో నాగ సాదువులు నగ్నంగానే ఎందుకు ఉంటారు.. అసలు రహస్యం అదేనా..!

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

TwitterFacebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.

About the Author

Ashok Krindinti

అశోక్‌ క్రిందింటి జీ తెలుగు డిజిటల్ మీడియాలో సీనియర్ సబ్ ఎడిటర్‌గా పనిచేస్తున్నారు. ఇక్కడ 2022 నుంచి స్పోర్ట్స్, వినోదం, క్రైమ్, రాజకీయ వ్యవహరాలకు సంబంధించిన వార్తలు రాస్తున్నారు. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో వివిధ రంగాలకు సంబంధించిన వార్తలు అందించారు. ఆయనకు జర్నలిజంలో ఏడేళ్లకుపైగా అనుభవం ఉంది.

...Read More

Trending News