Summer Effect: ఏపీలో పెరుగుతున్న ఉష్ణోగ్రతలు, మార్చ్ నుంచే వడగాల్పుల ముప్పు

Summer Effect: వేసవి సీజన్ ప్రారంభానికి ముందే ఎండలు మండిపోతున్నాయి. ఓ వైపు ఉష్ణోగ్రత మరోవైపు ఉక్కపోతతో జనం అల్లాడుతున్నారు. గతం కంటే భిన్నంగా ఈసారి మార్చ్ నెలలోనే వడగాల్పులు ఉంటాయని వాతావరణ శాఖ హెచ్చరిస్తోంది. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి. 

Written by - Md. Abdul Rehaman | Last Updated : Feb 27, 2025, 10:53 AM IST
Summer Effect: ఏపీలో పెరుగుతున్న ఉష్ణోగ్రతలు, మార్చ్ నుంచే వడగాల్పుల ముప్పు

Summer Effect: ఈసారి ఎండాకాలం ముందే వచ్చేసింది. ఫిబ్రవరి మూడో వారం నుంచే ఆంధ్రప్రదేశ్ తెలంగాణలో ఉష్ణోగ్రతలు క్రమంగా పెరగడం ప్రారంభమైంది. గత రెండ్రోజులుగా ఎండ తీవ్రత, ఉక్కపోత అధికమైంది. ఇక రానున్న 10-15 రోజుల్లో వడగాల్పులు ప్రభావం చూపిస్తాయని ఐఎండీ హెచ్చరించింది. మార్చ్ 10 తరువాత వడగాల్పులు వీస్తాయని తెలిపింది. 

Add Zee News as a Preferred Source

వేసవి సీజన్ కంటే ముందే ఎండలు మండిపోతున్నాయి. సాధారణం కంటే 4-6 డిగ్రీలు అధిక ఉష్ణోగ్రత నమోదవుతోంది. ముఖ్యంగా ఏపీలోని కోస్తాంధ్ర జిల్లాల్లో గత నాలుగైదు రోజులుగా సాధారణం కంటే 3-5 డిగ్రీలు అధిక ఉష్ణోగ్రత ఉంటోంది. విశాఖపట్నం, నరసాపురం, మచిలీపట్నం ప్రాంతాల్లో గరిష్ట ఉష్ణోగ్రత 2-3 డిగ్రీలు పెరిగింది. గత ఏడాది వడగాల్పులు ఏప్రిల్ నుంచి మొదలైతే ఈసారి అంతకంటే ఓ నెల ముందు అంటే మార్చ్ 10 నుంచే మొదలు కావచ్చని వాతావరణ శాఖ అంచనా వేస్తోంది. ముఖ్యంగా కోస్తా జిల్లాల్లో అధిక ఉష్ణోగ్రతతో పాటు ఉక్కపోత కూడా తీవ్రంగా ఉండనుంది. 

ఏపీలో పెరుగుతున్న ఎండలు

వాస్తవానికి ఏపీలో చాలాకాలంగా ఎండలు తీవ్రమౌతున్నాయి. 1961 నుంచి 2020 మధ్యకాలంలో మార్చ్ - జూన్ సమయంలో ఉమ్మడి అనంతపురం, కడప, చిత్తూరు జిల్లాలలో వడగాలుల తీవ్రత గణనీయంగా పెరిగింది. నెల్లూరు, ప్రకాశం, గుంటూరు, కృష్ణా, పశ్చిమ గోదావరి, తూర్పు గోదావరి జిల్లాల్లో ఉష్ణోగ్రతలు సాధారణం కంటే 8 డిగ్రీలు పైనే ఉంటున్నాయి. సాధారణంగా వడగాల్పులు ప్రతి ఏటా 4-8 రోజులు వీస్తుంటాయి. కానీ కోస్తాంధ్ర, ఒడిశాలోని కొన్ని జిల్లాల్లో 10-12 రోజులు ఉంటున్నాయి. 

రానున్న రోజుల్లో ఎండలు మరింత పెరగనున్నాయి. ఏప్రిల్-జూన్ నెలల్లో ఈసారి పరిస్థితి మరింత తీవ్రంగా ఉంటుందని ఐఎండీ హెచ్చరిస్తోంది. వడగాల్పులైతే ఈసారి మార్చ్ రెండో వారం నుంచే మొదలయ్యే అవకాశం ఉందని వాతావరణ శాఖ వెల్లడించింది. 

Also read: Supreme Court: క్రిమినల్ రాజకీయ నేతలకు కేంద్రం నుంచి బిగ్ రిలీఫ్, ఆరేళ్లు చాలని అఫిడవిట్

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

Twitter, Facebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి

About the Author

Trending News