Summer Heat: తెలంగాణ, ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రాల్లో భానుడు తన ప్రతాపం రాబోయే మూడు రోజులలో గరిష్టంగా ఉష్ణోగ్రతలో క్రమంగా 2 నుంచి 3 డిగ్రీలు పెరగనుంది. ఈమేరకు హైదరాబాద్ వాతావరణ శాఖ అలర్ట్ జారీ చేసింది. రాబోయే మూడు రోజులలో గరిష్టంగా ఉష్ణోగ్రతలో 2 నుంచి 3 డిగ్రీలు పెరుగుదల ఉంటుందని తెలపింది.
గరిష్ట, కనిష్ట ఉష్ణోగ్రతలు వరుసగా 35డిగ్రీల నుంచి 21 డిగ్రీల వరకు ఉంటాయని అంచనా వేసింది. తెలంగాణ వ్యాప్తంగా ఆదివారం అత్యధికంగా భద్రాచలంలో 38 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది.తెలుగు రాష్ట్రాలకు మాడుపగిలే సమాచారం ఇచ్చింది భారత వాతావరణశాఖ. ఈ వేసవి సీజన్‌లో తెలుగు రాష్ట్రాల పాటు దేశంలో అనేక ప్రాంతాలు నిప్పుల కొలిమిలా మారుతాయని హెచ్చరించింది.
ఇదీ చదవండి: అల్లు అర్జున్ నిజంగానే రామ్ చరణ్ అన్ ఫాలో చేశాడా.. తెర వెనక అసలు స్టోరీ ఇదే.
గత కొన్నేళ్లుగా వేసవిలో ఎండలు విపరీతంగా కాస్తున్నాయి. ఈ ఏడాది ఎండల తీవ్రత మరింత పెరగనుందని తెలిపింది. తెలుగు రాష్ట్రాల్లోని అనేక ప్రాంతాల్లో ఫిబ్రవరిలోనే ఎండ మండిపోయాయి. పలుచోట్ల వడగాలులతో ప్రజలు అల్లాడిన సంగతి తెలిసిందే కదా. ఫిబ్రవరిలో ఇలా ఉంటే.. ఇక మార్చి, రాబోయే ఏప్రిల్, మే నెలలు తలుచుకుంటేనే ప్రజలు భయపడే స్థితికి వచ్చారు. ఈ మూడు నెలలు అంటే.. మార్చి నుంచి మే వరకూ ఎండ తీవ్రత క్రమేపీ పెరుగుతుందని వాతావరణశాఖ అంచనావేసింది.
ఇదీ చదవండి: Liquor Rates Hike: మందుబాబుకు భారీ షాక్.. భారీగా పెరిగిన బీర్ల ధరలు..
ఇదీ చదవండి: ప్రభుత్వ ఉద్యోగులకు అదిరిపోయే శుభవార్త.. బేసిక్ పేలో భారీ పెంపు..
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.









