AP Summer Effect: ఏపీలో ఈ ఏడాది ఎండలు తీవ్రరూపం దాల్చనున్నాయి. ఈ నెల 10 తరువాత వడగాల్పులు ప్రారంభమౌతాయని ఇప్పటికే ఐఎండీ వెల్లడించింది. ఇప్పుడు తాజాగా వచ్చిన అప్‌డేట్స్ మరింత ఆందోళన కల్గిస్తున్నాయి. ఏప్రిల్, మే నెలల్లో చాలా జాగ్రత్తగా ఉండాలని సూచిస్తున్నారు. మే నెలలో అయితే ఎండలు 47 డిగ్రీలు దాటవచ్చని అంచనా ఉంది.
మార్చ్ ప్రారంభంలోనే ఏపీలో ఎండలు ఠారెత్తిస్తున్నాయి. రోజు రోజుకూ ఉష్ణోగ్రతలు పెరుగుతున్నాయి. అప్పుడే పగటి ఉష్ణోగ్రతలు కొన్ని ప్రాంతాల్లో 38-39 డిగ్రీలు నమోదవుతున్నాయి. రానున్న రోజుల్లో ఎండల తీవ్రత మరింత పెరుగుతుందని వాతావరణ శాఖ హెచ్చరించింది. ముఖ్యంగా ఏప్రిల్, మే నెలల్లో ఎండలు పీక్స్‌కు చేరతాయని తెలుస్తోంది. మే నెలలో అయితే పగటి ఉష్ణోగ్రతలు 46-48 డిగ్రీల మధ్య ఉండవచ్చని తెలుస్తోంది. దక్షిణ కోస్తాంధ్ర, రాయలసీమ జిల్లాల్లో సాధారణం కంటే 4-5 డిగ్రీలు అధికంగా ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. మద్యాహ్నం బయటికొచ్చేందుకు భయపడే పరిస్థితి నెలకొంది. రానున్న రోజుల్లో అంటే మార్చ్ 10వ తేదీ తరువాత వడగాల్పులు వీస్తాయని ఇప్పటికే వాతావరణ శాఖ వెల్లడించింది. అదే జరిగితే ప్రజల కష్టాలు మరింతగా పెరుగుతాయి.
వేసవి పూర్తిగా ప్రారంభం కాకుండానే 32 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదవుతోంది. ఇళ్లలో ఉన్నా తీవ్రమైన ఉక్కపోత ఉంటోంది. వేసవి తాపం తీర్చుకునేందుకు రకరకాల ప్రయత్నాలు చేస్తున్నారు. ఎండలు తీవ్రమయ్యే కొద్దీ భూగర్భ జలాలు అడుగంటే ప్రమాదం ఉండటంతో ప్రజల్లో ఆందోళన నెలకొంది.
ఎండల కారణంగా వడదెబ్బ తగలకుండా జాగ్రత్తలు తీసుకోవాలి. డీ హైడ్రేషన్ ప్రమాదం పొంచి ఉంది. వేసవిలో వీలైనంతవరకు తేలికపాటి లైట్ కలర్ దుస్తులే ధరించాలి. వదులుగా ఉండేట్టు చూసుకోవాలి. ఇంట్లో చిన్నారులు, వృద్ధులు అప్రమత్తంగా ఉండాలి. పగలు బయటికి వెళ్లకుండా ఉండాలి. అత్యవసరమై బయటకు వెళ్లాల్సి వస్తే తలకు ఏదైనా కవర్ చేసేలా ధరించాలి. రోజంతా ద్రవ పదార్ధాలు ఎక్కువగా తీసుకోవాలి. ముఖ్యంగా కొబ్బరి నీళ్లు, మజ్జిగ, నిమ్మకాయ నీళ్లతో పాటు పుచ్చకాయ, దోసకాయ వంటి పండ్లను తీసుకోవాలి.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి









