SRH Shift To AP: ఆంధ్రప్రదేశ్‌కు వెళ్లనున్న సన్‌రైజర్స్ హైదరాబాద్‌? ఎస్‌ఆర్‌హెచ్‌కు భారీ ఆఫర్

Sunrisers Hyderabad Likely To Shift AP: ఐపీఎల్‌ మ్యాచ్‌ టికెట్ల అంశంలో సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌కు ఇబ్బందికర వాతావరణం ఏర్పడడంతో ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం సంచలన ప్రకటన చేసింది. సన్‌రైజర్స్‌ జట్టుకు బంపర్‌ ఆఫర్‌ ప్రకటించింది.

Written by - Ravi Kumar Sargam | Last Updated : Mar 31, 2025, 07:42 PM IST
SRH Shift To AP: ఆంధ్రప్రదేశ్‌కు వెళ్లనున్న సన్‌రైజర్స్ హైదరాబాద్‌? ఎస్‌ఆర్‌హెచ్‌కు భారీ ఆఫర్

AP Cricket Association: ఐపీఎల్‌ మ్యాచ్‌ టికెట్ల అంశంలో సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌ జట్టు యాజమాన్యానికి.. హైదరాబాద్‌ క్రికెట్‌ సంఘానికి మధ్య తీవ్ర విబేధాలు ఏర్పడ్డాయి. హెచ్‌సీఏ ధోరణితో విసిగెత్తిపోయిన సన్‌రైజర్స్‌ జట్టు ఇతర ప్రాంతాలకు వెళ్లేందుకు సిద్ధమైంది. ఇప్పటికే హెచ్‌సీఏకు 'వెళ్లిపోమ్మంటారా?' అని ఆగ్రహంతో మెయిల్‌ చేసిన విషయం తెలిసిందే. హెచ్‌సీఏ వైఖరిలో మార్పు రాకపోతే సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌ నుంచి తరలివెళ్లే అవకాశం లేకపోలేదు. ఈ నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం ఆపన్నహస్తం అందించింది. అన్ని విధాలుగా సహకరిస్తామని ప్రకటించింది. ఈ మేరకు సన్‌రైజర్స్‌ యాజమాన్యానికి ఆంధ్రప్రదేశ్‌ క్రికెట్‌ సంఘం కొన్ని ప్రతిపాదనలు ముందు ఉంచింది.

Add Zee News as a Preferred Source

Also Read: HCA SRH Dispute: సన్‌రైజర్స్‌ వార్నింగ్‌పై రేవంత్‌ రెడ్డి సీరియస్‌.. విజిలెన్స్‌ విచారణకు ఆదేశం

హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ (హెచ్సీఏ) ఐపీఎల్ ఫ్రాంచైజీ సన్‌రైజర్స్ హైదరాబాద్‌కు మధ్య వివాదం నెలకొనడం, హెచ్సీఏ ఒత్తిడి.. వేధింపులకు తాళలేక సన్‌రైజర్స్ తీవ్ర వ్యాఖ్యలు చేసింది. దీనిని ఆంధ్ర క్రికెట్‌ సంఘం తనకు అనుకూలంగా మలచుకోవాలని చూస్తోంది. ఈ పరిణామాల నేపథ్యంలో సన్‌రైజర్స్ హైదరాబాద్‌ జట్టుకు ఆంధ్రప్రదేశ్‌ బంపర్ ఆఫర్ ఇచ్చింది. ఆంధ్రప్రదేశ్‌కు రావాలని ఆంధ్ర క్రికెట్ సంఘం ఆహ్వానం పలింకింది. తక్కువ అద్దెకు విశాఖ స్టేడియాన్ని ఇస్తామని హామీ ఇచ్చింది. ఐపీఎల్‌లో ఆంధ్రప్రదేశ్‌కు సొంత జట్టు అంటూ ఒకటి లేదు.

హెచ్‌సీఏతో విబేధం నేపథ్యంలో సన్‌రైజర్స్‌ ఒకవేళ హైదరాబాద్‌ను వీడితే వెంటనే ఏపీకి తెచ్చుకోవాలని ఏపీ క్రికెట్‌ సంఘం భావిస్తోంది. అందులో భాగంగానే తాజాగా ప్రతిపాదనలు చేసింది. కాగా సొంత జట్టు లేకపోవడంతో ఢిల్లీ క్యాపిటల్స్‌ విశాఖను సొంత స్టేడియంగా వినియోగిస్తోంది. కానీ ఆ జట్టును అంతగా ఏపీ ప్రజలు తమ జట్టుగా భావించడం లేదు. ప్రేక్షకుల నుంచి స్పందన లేదు. ఈ నేపథ్యంలో సన్‌రైజర్స్‌కు ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందో వేచిచూడాలి. ఏపీ ప్రజలు కూడా తమ రాష్ట్రానికి ఐపీఎల్ ఫ్రాంఛైజీ లేకపోవడాన్ని వెలితిగా ఫీల్ అవుతున్నారు.

Also Read: IPL 2025 RR vs CSK: ధోని పోరాడినా చెన్నైకి తప్పని రెండో ఓటమి.. రాజస్థాన్‌ తొలి విజయం

వివాదం ఇదే!
ఉచిత టికెట్‌ల కోసం హెచ్సీఏ ఉన్నతాధికారులు ముఖ్యంగా.. హెచ్సీఏ అధ్యక్షుడు జగన్‌ మోహన్ రావు బెదిరిస్తున్నారని సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌ సంచలన ఆరోపణలు చేసింది. ఇలాగైతే తాము హైదరాబాద్‌ను వదిలి వెళ్లిపోతామని హెచ్చరించింది. కోరినన్ని ఫ్రీ పాసులు ఇవ్వపోవడంతో ఓ మ్యాచ్‌లో తమకు కేటాయించిన కార్పొరేట్ బాక్స్‌కు హెచ్‌సీఏ తాళాలు వేసింది. ఈ విషయాన్ని హెచ్సీఏ కోశాధికారికి సన్‌రైజర్స్ లేఖ రాసింది.

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

TwitterFacebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.

About the Author

Ravi Kumar Sargam

సర్గం రవి కుమార్‌. జీ తెలుగు డిజిటల్ మీడియాలో సబ్ ఎడిటర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ 2024 నుంచి రాజకీయాలు, స్పోర్ట్స్, వినోదం, క్రైమ్, జాతీయ వ్యవహరాలకు సంబంధించిన వార్తలు రాస్తున్నారు. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో వివిధ రంగాలకు సంబంధించిన వార్తలు అందించారు.

...Read More

Trending News