Borugadda Anilkumar: ముఖ్యంగా ఆ పిటిషన్‌పై విచారణ ముగిస్తూ జస్టిస్ బీవీ నాగరత్న, జస్టిస్ కేవీ విశ్వనాథన్‌లతో కూడిన ధర్మాసనం ఉత్తర్వులు జారీచేసింది. తొలుత జస్టిస్ నాగరత్న జోక్యం చేసుకుంటూ ఈ కేసు ఇంకా హైకోర్టులో పెండింగ్‌లో ఉంది కదా అని ప్రశ్నించారు.
అందుకు బోరుగడ్డ తరఫున హాజరైన సీనియర్ న్యాయవాది నాగముత్తు సమాధానమిస్తూ.. మధ్యంతర బెయిల్ సమయంలో తాను సమర్పించిన ధ్రువీకరణ పత్రాలపై విచారణకు ఆదేశిస్తూ హైకోర్టు ఆదేశాలు జారీచేసిందని, దాని కారణంగా తన ప్రధాన బెయిల్ అప్లికేషన్‌ను విచారణకు స్వీకరించడం లేదని ధర్మాసనం దృష్టికి తెచ్చారు.
అప్పుడు జస్టిస్ కేవీ విశ్వనాథన్ స్పందిస్తూ నకిలీ ధ్రువీకరణ పత్రాల ఆధారంగా మధ్యంతర బెయిల్ ఇచ్చారా? లేదా అన్న అంశం ప్రధాన బెయిల్ అప్లికేషన్‌పై ప్రభావం చూపుతుందని వ్యాఖ్యానించారు. అందుకే ఆ ధ్రువీకరణ పత్రాలపై హైకోర్టు నివేదిక కోరినట్లు తెలిపారు. ఈ నేపథ్యంలో బెయిల్ పిటిషన్‌పై హైకోర్టు సాధ్యమైనంత త్వరగా విచారణ ముగించాలని జస్టిస్ బీవీ నాగరత్న ఆదేశించారు.
అయితే నకిలీ ధ్రువీకరణ పత్రాల విచారణతో సంబంధం లేకుండా.. ప్రధాన బెయిల్ పిటిషన్‌పై స్వతంత్రంగా విచారణ జరిపేలా ఆదేశించాలని న్యాయవాది నాగముత్తు చేసిన విజ్ఞప్తిని సుప్రీంకోర్టు ధర్మాసనం పరిగణనలోకి తీసుకోలేదు.
ఇదీ చదవండి: బడా స్టార్స్ సహా 900 సినిమాల్లో నటించిన నటి.. భర్త చనిపోవడంతో తాగుడుకు బానిసై జీవితం నాశనం..
ఇదీ చదవండి: ఈ చెట్లు ఉంటే.. పాములకు మీ ఇంట్లోకి రెడ్ కార్పెట్ పరిచినట్టే.. తస్మాత్ జాగ్రత్త..!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.









