Vijay Politics: తమిళనాట జనసేన ఫార్ములా.. విజయం కోసం పవన్ కళ్యాణ్ ను నమ్ముకున్న విజయ్..

Vijay Politics: దక్షిణాది చిత్ర పరిశ్రమలో హీరోను తమ దైవంగా భావిస్తుంటారు అభిమానులు. అందుకే ఎక్కడా లేనట్టు మన హీరోలు పార్టీలు పెట్టి ఏకంగా ముఖ్యమంత్రి, కేంద్ర మంత్రులు, డిప్యూటీ సీఎంలు కూడా అయ్యారు. ఇక తమిళనాట ప్రముఖ హీరో విజయ్ కూడా ‘తమిళగ వెట్రి కళగం’పేరుతో పార్టీ స్థాపించారు. బుడి బుడి అడుగులు వేస్తున్న ఈ పార్టీ ఏపీలో పవన్ బాటలో ప్రయాణించాలనుకుంటున్నాడు.  

Written by - TA Kiran Kumar | Last Updated : Mar 2, 2025, 02:15 PM IST
Vijay Politics: తమిళనాట జనసేన ఫార్ములా.. విజయం కోసం పవన్ కళ్యాణ్ ను నమ్ముకున్న విజయ్..

Vijay Politics:  తమిళనాడులోనూ ఆంధ్ర ప్రదేశ్  ఫార్ములా అమలు చేయాలంటున్నారు ప్రముఖ రాజకీయ  వ్యూహకర్త ప్రశాంత్‌ కిశోర్‌.  ప్రస్తుత రాజకీయ పరిస్థితుల్లో డిప్యూటీ సీఎం పవన్‌ కల్యాణ్‌ విధానం బెస్ట్‌ అంటూ TVK అధ్యక్షుడు విజయ్‌కి సూచించారట  అప్పుడే కచ్ఛితంగా DMK ను గద్దెదింప వచ్చంటున్నారు. దీని ప్రకారం AIADMK తో TVK పొత్తు పెట్టుకోవాలని సూచించినట్టు సమాచారం.  ఇక ఎడప్పాడి పళనిసామి ముఖ్యమంత్రిగా,  హీరో  విజయ్‌ ఉప ముఖ్యమంత్రి అంటూ తేల్చిచెప్పారు  ప్రముఖ రాజకీయ వ్యూహకర్త ప్రశాంత్‌ కిశోర్‌. రాజకీయ భవిష్యత్‌ను దృష్టిలో ఉంచుకుని విజయ్‌ రాజీ పడాల్సి వుందని సలహా ఇచ్చినట్లు తెలుస్తోంది. ప్రస్తుతం  ప్రశాంత్‌ కిశోర్‌  తమిళనాడులో కొత్తగా ఏర్పాటైన TVK పార్టీకి ఎన్నికల వ్యూహకర్తగా వున్నారు. ఒకేసారి ముఖ్యమంత్రి పీఠం అంటే కష్టమని చెప్పినట్టు సమాచారం. పవన్ కళ్యాణ్ సుదీర్ఘ రాజకీయ వ్యూహంతో ఎన్నికల బరిలో దిగితే.. అతను కోరుకున్న సీఎం పీఠం దక్కడం పక్కా అని చెబుతున్నాడు.

Add Zee News as a Preferred Source

ప్రస్తుతం ప్రశాంత్ కిషోర్ తమిళనాడులో కొత్తగా ఏర్పాటైన టీవీకే (తమిళగ వెట్రీ కళగం) పార్టీకి ఎన్నికల వ్యూహకర్తగా వ్యవహరిస్తున్నారు.
2026లో జరిగే తమిళనాడు ఎన్నికల కోసం ఇప్పటి నుంచే అక్కడ పార్టీలు వ్యూహాలు అమలు చేస్తున్నాయి. దీంట్లో భాగంగా విజయ్ కూడా తన పార్టీని వచ్చే ఎన్నికల కోసం సమాయత్త పరుస్తున్నాడు. తన పార్టీని వచ్చే అసెంబ్లీ ఎన్నికల నాటికీ బలోపేతం చేసి అధికారం చేజిక్కించుకోవాలనే వ్యూహంలో భాగంగా పార్టీ కార్యకర్తలను దిశా నిర్దేశం చేయనున్నారు. ఇప్పటికి దానికి సంబంధించి వ్యూహాలు అమలు చేస్తున్నారు.  పెద్ద ఎత్తున బహిరంగ సభలు ఏర్పాటు చేస్తున్నారు. పార్టీ కార్యకర్తలను ఉద్దేశించి ప్రసంగాలు ఏర్పాటు చేస్తున్నారు. అయితే ఇటీవల రెండు మూడు రోజుల క్రితం కూడా మహాబలిపురంలో టివికే పార్టీ ఆధ్వర్యంలో మొదటి వార్షికోత్సవ సభ జరిగింది.  ఆ సభకు పెద్ద ఎత్తున అభిమానులు కార్యకర్తలు నేతలు హాజరయ్యారు.  దీనికి ఆ దేశవ్యాప్తంగా పేరు ఉన్నటువంటి రాజకీయ వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ కూడా హాజరయ్యారు.  ప్రశాంత్ కిషోర్ హాజరు కావడంతో టీవీకే పార్టీకి ఆ తను సలహాదారుగా వ్యూహకర్తగా ఉంటూ నెక్స్ట్ ఎన్నికల్లో ఇక టివికే పార్టీది అధికారం అనేలా ఒకింత ఇదే అదే విధంగా ప్రశాంత్ కిషోర్ చేసిన వ్యాఖ్యలు ప్రాధాన్యత సంతకరించుకున్నాయి.
కిషోర్ కూడా వ్యాఖ్యలు చేశారు ఈ సందర్భంగా రాజకీయంగా తమిళనాడులో వ్యాక్యూమ్ ఉంది అంటే జయలలిత మరణం తర్వాత కొంత అన్నా డిఎం కి పూర్తిగా బలహీన పడింది.  దీంతో డిఎం కే ది ఏకపక్షం  అయిపోయింది ఈ నేపథ్యంలో బిజెపి ఎంత ప్రయత్నించిన తమిళనాడులో రాజకీయంగా బలపడలేకపోతుంది.  కానీ తన ఓటు బ్యాంకు బాగానే పెంచుకుంది.  సో ఇప్పుడు ఉన్నటువంటి
పరిస్థితుల్లో కొంత రాజకీయంగా కొంత వ్యాక్యూమ్ ఉంది ఆ రాజకీయంగా ఖాళీ ఉండడంతో టీవీకే కు ఆ ఖాళీని భర్తీ చేయాలనే ఆలోచనలో ఉన్నట్టు తెలుస్తోంది.

కొత్త పార్టీకి ఇపుడు ఎంత లేదన్నా.. దాదాపు 20 శాతం ఓటు బ్యాంక్ ఉంది. దీంతో అన్నాడీఎంకే పొత్తు పెట్టుకుంటే ఉభయకుశలోపరి అన్న రీతిలో ఇద్దరికీ లాభం చేకూరుస్తుందనే విశ్వాసం ప్రశాంత్ కిషోర్ వ్యక్తం చేశారు.  ఈ నేపథ్యంలో ప్రశాంత్ కిషోర్ టీవీకే పార్టీకి సంబంధించి మొదటగానే డిప్యూటీ సీఎం తీసుకోమని ఒక రాజీ ఫార్ములా చేయడం మాత్రం విజయ్ అభిమానులకు మాత్రం మింగుడు పడటం లేదు.

ఇదీ చదవండి:   అల్లు అర్జున్ నిజంగానే రామ్ చరణ్ అన్ ఫాలో చేశాడా.. తెర వెనక అసలు స్టోరీ ఇదే.

ప్రశాంత్ కిషోర్ వ్యూహం వెనక కూడా బిజెపి ఉందనే ఒక ప్రచారం కూడా జరుగుతా ఉంది. ఎందుకంటే ఏపీ లో ఎలాగైతే టిడిపి బిజెపి జనసేన ఎలా ఉందో తమిళనాడు కూడా అదే అదే ఫార్ములా ప్రకారం ఇటు టివికే ఏ డిఎం కే అదే విధంగా బిజెపి ఈ మూడు కూటమి కలిసి కొంత డిఎం కే నిలువరించి అధికారాన్ని కైవసం చేసుకోవాలనుకునే ప్రయత్నం చేస్తున్నట్టుగా తెలుస్తోంది. ఎందుకంటే బిజెపి ఒక్కటి సింగిల్ పార్టీగా తమిళనాడులో అధికారాన్ని కైవసం చేసుకునే అవకాశం లేదు. ఎందుకంటే అక్కడ ఉన్నటువంటి

రాజకీయ పరిస్థితులు భిన్నము.  సో కొంత అక్కడ బిజెపి కి అధికారం అధికారంలోకి రావడం అంతా ఆశామాషి కాదు. ఇదే సందర్భంలో కూటమి అయితేకొంత ఈజీగా అవుతుంది. తమిళనాడులో కొంత ఓటుబ్యాంకును పెంచుకునే క్రమంలో తమకు ఈ కూటమి కలిసి వచ్చే అవకాశం ఉంది.  సో ఈ మొత్తంవ్యవహారం వెనుక బిజెపి ఉందా అనేది కూడా ఒక ప్రచారం జరుగుతుంది.  అంటే బిజెపి, విజయ్ పార్టీ, ఏఐఏడీఎంకే  ముగ్గురు కలిసి తమిళనాడులో అధికారాన్ని కైవసం చేసుకోవాలనే ఆలోచనలో ఉన్నట్టు సమాచారం. ఇప్పుడున్న పరిస్థితుల్లో మొన్న రెండు మూడు రోజుల క్రితం జరిగిన వార్షికోత్సవ సభలో మాత్రం కొంత విజయ్ టీవీకే అధినేత విజయ్ మాత్రం ఢిల్లీకి సంబంధించి బిజెపి పైన కొంత సీరియస్ అయ్యాడు. ఎందుకంటే మతతత్త్వ రాజకీయాలకు అంటే ప్రజలను విభజన చేసేరాజకీయాలకు మేము చాలా దూరంగా ఉంటామనిస్పష్టం చేశాడు.  ఇలాంటి నేపథ్యంలో బిజెపితో విజయ్ కలిసే అవకాశం ఉంటుందా అనే డౌట్స్ కూడా ఏర్పడ్డాయి.

తమిళనాడులో డిఫరెంట్ రాజకీయ పరిస్థితిఉంది. ఇప్పటివరకు సిసినీ గ్లామర్ తో వచ్చిన నాయకులంతా కూడా దాదాపు కొంతమంది సక్సెస్ అయిన కొంతమంది ఫెల్యూర్  అయ్యారు.  సో ప్రశాంత్ కిషోర్ చెప్తుంది ఏందంటే గతంలోఉన్న అనుభవాల దృశ్య చాలా కమలహాసన్ కావచ్చు.విజయకాంత్ కావచ్చు వీళ్ళకు పెద్ద ఎత్తున అభిమానులు ఉన్నా కూడా దాన్ని ఓటు బ్యాంకు కూడా మంచుకోలేకపోయారు. కమలహాసన్ విజయకాంత్ లాగా విజయ్ టివికేపార్టీ తలపతి విజయ్ కాకూడదు అనే ఒక ఫార్ములా రూపొందించినట్టు తెలుస్తుంది. అలా
వెళ్తే ఫెయిల్ అయ్యే అవకాశం ఉంటుంది.  గతంలో పవన్ కళ్యాణ్ కూడా ఏపీ లో ఒంటరిగా పోటీ చేసినప్పుడు ఎలాంటి ఫలితాలు వచ్చాయి. కూటమిగా వెళ్ళినప్పుడు ఎలాంటి ఫలితాలువచ్చాయో మనం చూసుకోవాలి బేరింగ్ చేసుకొని ఒక అడుగు ముందుకు వేయాల్సి ఉంటుందని చెప్పుకొచ్చారు. దీనిపైనే ఫైనల్ డిజిషన్ తీసుకునేది విజయ్ మాత్రమే అని చెప్పాలి.

ఇదీ చదవండి: Liquor Rates Hike: మందుబాబుకు భారీ షాక్.. భారీగా పెరిగిన బీర్ల ధరలు..

ఇదీ చదవండి: ప్రభుత్వ ఉద్యోగులకు అదిరిపోయే శుభవార్త.. బేసిక్ పేలో భారీ పెంపు..

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

TwitterFacebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.

About the Author

TA Kiran Kumar

కిరణ్ కుమార్ తంజావూర్ జీ తెలుగు తెలుగు న్యూస్‌లో ఛీఫ్ సబ్ ఎడిటర్‌గా పనిచేస్తున్నారు. ఇక్కడ 2024 నుంచి  వినోదం, ఆధ్యాత్మికం, జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ వ్యవహారాలకు సంబంధించిన వార్తలు రాస్తున్నారు. సినిమా రివ్యూలు, సినిమాలకు సంబంధించి ప్రత్యేక కథనాలు కూడా రాస్తుంటారు. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో వివిధ రంగాలకు సంబంధించిన వార్తలు అందించారు. ఆయనకు జర్నలిజంలో 18 ఏళ్లకుపైగా అనుభవం ఉంది.

...Read More

Trending News