GV Reddy Resign: టీడీపీకి ఊహించని షాక్.. జీవీ రెడ్డి రాజీనామా

GV Reddy Resigned from TDP: టీడీపీకి, ఏపీ ఫైబర్‌నెట్ ఛైర్మన్ పదవికి రాజీనామా చేస్తున్నట్లు జీవీ రెడ్డి ప్రకటించారు. వ్యక్తిగత కారణాలతోనే తాను రాజీనామా చేస్తున్నట్లు ఆయన వెల్లడించారు. సీఎం చంద్రబాబుకు రాజీనామా లేఖను పంపించారు.   

Written by - Ashok Krindinti | Last Updated : Feb 24, 2025, 07:33 PM IST
GV Reddy Resign: టీడీపీకి ఊహించని షాక్.. జీవీ రెడ్డి రాజీనామా

GV Reddy Resigned from TDP: ఏపీలో అధికార తెలుగుదేశం పార్టీకి ఊహించని షాక్ తగిలింది. టీడీపీ కీలక నేత, ఫైబర్‌నెట్ ఛైర్మన్ జీవీ రెడ్డి తన పదవికి రాజీనామా చేశారు. అలాగే టీడీపీకి, పార్టీ పదవులను కూడా వదులుకుంటున్నట్లు ప్రకటించారు. వ్యక్తిగత కారణాలతోనే రాజీనామా చేస్తున్నట్లు ఆయన వెల్లడించారు. ఇకపై పూర్తిగా న్యాయవాద వృత్తిలో కొనసాగుతానని స్పష్టం చేశారు. ఈ మేరకు రాజీనామా లేఖను సీఎం చంద్రబాబు నాయుడికి పంపించారు. "వ్యక్తిగత కారణాలతో నేను తెలుగు దేశం పార్టీ ప్రాథమిక సభ్యత్వం, జాతీయ అధికార ప్రతినిధి హెూదా, ఏపీ స్టేట్ ఫైబర్‌నెట్ లిమిటెడ్ చైర్మన్ పదవుల నుంచి రాజీనామా చేస్తున్నాను. 

Add Zee News as a Preferred Source

మీరు నాపై ఉంచిన విశ్వాసానికి, అందించిన మద్దతుకు, నాకు ఈ కీలకమైన బాధ్యతలను నిర్వహించే అవకాశం కల్పించినందుకు హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. తెలుగు దేశం పార్టీ మరింత బలంగా ఎదిగి ప్రజాసేవలో ముందుండాలని ఆకాంక్షిస్తున్నాను. ఇక మీదట పూర్తిగా న్యాయవాద వృత్తిలో కొనసాగుతాను. భవిష్యత్తులో ఎటువంటి రాజకీయ పార్టీలో చేరే ఉద్దేశం లేదు." అని ఆయన లేఖలో పేర్కొన్నారు. కాగా ఇటీవల ఫైబర్‌నెట్ ఎండీ, IAS దినేశ్ కుమార్ అవినీతికి పాల్పడ్డారని జీవీ రెడ్డి ఆరోపించారు. దీనిపై జీవీ రెడ్డిని సీఎం చంద్రబాబు మందలించినట్లు సమాచారం. ఈ నేపథ్యంలోనే ఆయన రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించడం చర్చనీయాంశంగా మారింది.

ఏపీ ఫైబర్‌నెట్ లిమిటెడ్‌లో గత కొద్దిరోజులుగా పంచాయితీ నడుస్తోంది. ఫైబర్ నెట్ ఎండీ దినేశ్‌ కుమార్‌పై జీవీ రెడ్డి తీవ్ర వ్యాఖ్యలు చేయడంతో సంచలనం రేకెత్తించింది. ఏపీ ఫైబర్‌నెట్‌ సంస్థను చంపేయాలని దినేశ్‌ కుమార్ కుట్రలు పన్నుతున్నారని సంచలన ఆరోపణలు చేశారు. ఈ విషయంపై ముఖ్యమంత్రి చంద్రబాబు దృష్టికి వెళ్లగా.. జీవీ రెడ్డిని పిలిపించుకుని మందలించారు. సమస్యను పరిష్కరించుకునే విధానం ఇలా కాదని.. మంత్రి దృష్టికి లేదా సీఎస్ దృష్టికి తీసుకురావాల్సిందన్నారు. అలా కాకుండా మీడియా ముందుకు వచ్చి మాట్లాడడం సరికాదన్నారు. ఛైర్మన్ పోస్టులో ఉండి.. ఐఏఎస్ అధికారులపై ఇలాంటి వ్యాఖ్యలు చేస్తే ప్రభుత్వానికి చెడ్డ పేరు వస్తుందన్నారు. చంద్రబాబు మందలింపు తరువాత జీవీ రెడ్డి రాజీనామా చేస్తున్నట్లు ఇవాళ సోషల్ మీడియా వేదికగా ప్రకటించారు.  

Also Read: BRS Party Joinings: ఎమ్మెల్సీ ఎన్నికల ముంగిట రేవంత్ రెడ్డికి భారీ షాక్‌.. బీఆర్‌ఎస్‌లోకి వలసలు

Also Read: Mlc Elections: ఎమ్మెల్సీ ఎన్నికల వేళ ప్రభుత్వ ఉద్యోగులకు సాధారణ సెలవు.. కీలక ఆదేశాలు జారీ చేసిన రిటర్నింగ్ అధికారి..  

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

Twitter, Facebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి

About the Author

Ashok Krindinti

అశోక్‌ క్రిందింటి జీ తెలుగు డిజిటల్ మీడియాలో సీనియర్ సబ్ ఎడిటర్‌గా పనిచేస్తున్నారు. ఇక్కడ 2022 నుంచి స్పోర్ట్స్, వినోదం, క్రైమ్, రాజకీయ వ్యవహరాలకు సంబంధించిన వార్తలు రాస్తున్నారు. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో వివిధ రంగాలకు సంబంధించిన వార్తలు అందించారు. ఆయనకు జర్నలిజంలో ఏడేళ్లకుపైగా అనుభవం ఉంది.

...Read More

Trending News